మంచి మనసు చాటుకున్న మహేష్ బాబు కూతురు సితార, ఆ విషయంలో తండ్రిని మించిపోయిందిగా..?
ఎదుటివారికి సహాయం చేయాలి అనే గుణంలో తన తండ్రిని మించిన కూతురు అనిపించుకుంటుంది మహేష్ బాబు కూతురు సితార.
సూపర్ స్టారా్ మహేష్ బాబు.. టాలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నాడో.. మంచి మనసున్న మనిషిగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు. పెద్దగా ప్రచారం లేకుండా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ.. తన మంచి మనసు చాటుకున్నాడు. ముఖ్యంగా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి వారి పాలిట దేవుడయ్యాడు. అదే మనసును పుణికి పుచ్చుకుంది ఆయన కూతురు సితార.
కొంచెం చేస్తేనే పదింతలు చెప్పుకునే ఈ రోజుల్లో.. వేల మందికి మంచి చేస్తూ.. ప్రచారం అవసరంలేదంటాడు మహేష్. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తున్నారు.ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా రెయిన్ బో ఆంధ్ర హాస్పిటల్స్ లో చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఇక ఇలా ఎన్నో సేవలు చేస్తున్న మహేష్ బాబు. తన ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువమందికి తెలిసి.. వారు కూడా సహాయం పొందేలా.. స్పెషల్ వెబ్ సైట్ ప్రారంభించారు. ఇక ఈ విషయాన్ని మహేష్ బాబు కూతురు.. సూపర్ స్టార్ గారాల పట్టి సితార ఘట్టమనేని ప్రకటించారు.
అధికారకంగా ప్రకటించడంతో పాటు..తన వంతు సహాయంగా ఫౌండేషన్ కి తన పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు సితార తెలిపారు. ఈ ప్రకటనతో అంతా సితారపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతే కాదు..మహేష్ అభిమానులు సితార మంచి మనసుకు మురిసిపోతున్నారు.. తమ అభిన హీరో మంచి మనసును పుణికిపుచ్చుకుందంటూ కామెంట్ చేస్తున్నారు.
నూతన సంవత్సరంలో మా అధికారక వెబ్ సైట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా తరపున నాపాకెట్ మనీ ఇస్తున్నానంటూ సూపర్ స్టార్ డాటర్ ప్రకటించింది.
Mahesh Babu
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడే న్యూ ఇయర్ ను సెబ్రేట్ చేశారు స్టార్ ఫ్యామిలీ. ఇక సిట్జర్లాండ్ టూర్ కంప్లీట్ అవ్వగానే..సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే చాలా బ్రేక్స్ తీసుకున్న ఈ సినిమాను ఫాస్ట్ గాకంప్లీట్ చేయాలని చూస్తున్నారు.