సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్
సౌత్ లో స్టార్ హీరోలను మించి ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోయిన్ లేడీ పవర్ స్టార్ గా సౌత్ లో పేరు తెచ్చుకుంది. మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి డాక్టర్ గా కొత్త జీవితం స్టార్ట్ చేయబోతుందట. నిజమెంత.?

సౌత్ ఫిల్మ్ ఫిండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే.. లేడీ పవర్ స్టార్ మాత్రం సాయి పల్లవి అని చెప్పాలి. సినిమాల విషయంలో ఆమె విజన్ మామూలుగా ఉండదు. సాయి పల్లవి అంటే అందరు హీరోయిన్లలా కాదు. కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే కాదు పెర్ఫామెన్స్ ఒరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ స్సెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
Sai Pallavi
ఈమధ్య వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వస్తోంది సాయి పల్లవి. సినిమాల విషయంలో మంచి కథ, తన క్యారెక్టరైజేషన్ ను చూసుకుంటుంది బ్యూటీ. అలా ఉంటే హిట్లు రావు అనేవారికి సమాధానం చెపుతూ.. తాజాగా వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతోంది సాయి పల్లవి. ఈమధ్య రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. సాయి పల్లవి శివకార్తికేయం కాంబోలో వచ్చిన అమర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఓ జవాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసి సంచలనంగా మారింది.
Also Read: మహేష్ బాబుకు సారి చెప్పిన స్టార్ డైరెక్టర్, కారణం ఏంటి? నిజం ఎంత?
Sai Pallavi starrer Thandels collection report out
ఇక తాజాగా సాయి పల్లవి నటించిన మరో ప్రయోగాత్మక సినిమా తండేల్. నాగచైతన్య పట్టుదలతో పక్కా ప్లానింగ్ తో చేసిన ఈ రియల్ లైఫ్ స్టోరీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 100 కోట్ల మార్క్ ను దాటింది. ఈసినిమాలో నాగచైతన్య జంటగా బుజ్జితల్లి పాత్రలో కనిపించి అద్భుతంగా నటించింది సాయి పల్లవి. ఈమూవీ ఇప్పటికీ అద్భుతంగా నడుస్తోంది. వారి కష్టానికి ప్రతి ఫలం దక్కింది. ఇలా మంచి కథలతో సూపర్ హిట్ సినిమాలు చేయవచ్చు అని నిరూపించింది సాయి పల్లవి.
Also Read:హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?
అందరు హీరోయిన్లలా కాదు కాబట్టే.. సాయి పల్లవి ఎంతో స్పెసల్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలను కూడా కథ బాలేదంటూ రిజక్ట్ చేయగల ధైర్యం సాయి పల్లవికి మాత్రమే ఉంది అని చెప్పవచ్చు. మహేష్ బాబు సినిమా ఆఫర్ వస్తే.. తన క్యారెక్టరైజేషన్ నచ్చలేదని ఆ సినిమా ను వదిలేసింది. మహేష్ సినిమా కదా అని ఎగబడి ఒప్పుకోలేదు సాయి పల్లవి. తను చేసే పాత్రలు... సినిమాలు చాలా డిఫరెంట్ అందుకే చాలా తక్కువ సినిమాలు చేసినా.. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది సాయిపల్లవి.
Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?
Sai Pallavi
ఇక రీసెంట్ గా సాయి పల్లవికి సబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది. వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధిస్తోంది. అయినా సరే సాయి పల్లవి నిజంగా ఇండస్ట్రీని వదిలి వెళ్తుందా..? ఇంతకు ముందు కూడా ఇలాంటి న్యూస్ లు చాలా వచ్చాయి..
సాయిపల్లవి పెళ్లి కుదిరిందని.. అబ్బాయి కూడా ఓ డాక్టర్ అని.. త్వరలో సినిమాలు వదిలేస్తుందని న్యూస్ వైరల్ అయ్యింది. అయితే అప్పుడు వాటిలో నిజం లేదని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది. తాను అస్సలు పెళ్ళి చేసుకుంటానో లేదో కూడా తెలియదంటూ బాంబ్ పేల్చింది. దాంతో ఆ గాలివార్తలు అక్కడితో ఆగిపోయాయి.
Also Read: రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Sai pallavi
ఇక ఇప్పుడు కొత్త కారణంతో ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. సాయిపల్లవి యాక్టర్ కాకముందు డాక్టర్.. అంతకంటే ముందు డాన్సర్. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. జార్జియాలో MBBS చదివిన సాయిపల్లవి.. ఇండియా వచ్చి.. డాన్స్ మీద ఇంట్రెస్ట్ తో..నటనమీద ప్రేమతో హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక తన వృత్తికి న్యాయం చేయాలి అనుకుంటుందట ఈ మలబారు బ్యూటీ.
Sai Pallavi
అందుకే నటిగా ఎంత స్టార్ డమ్ సంపాదించుకుందో.. డాక్టర్ గా కూడా తన వృత్తికి న్యాయం చేయాలని అనుకుంటుందట. దాని కోసం ఏర్పట్లు కూడా చేసుకుంటుందట సాయి పల్లవి. అందుకే నటనకు గుడ్ బై చెప్పి.. డాక్టర్ గా సెటిల్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను కట్టి డాక్టర్ గా సెటిల్ అవ్వబోతుందట.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. సినిమాలు చేసినన్ని రోజులు చేసి.. ఆతరువాత డాక్టర్ గా ఆమె సెటిల్ అవుతందట. ఈలోపు హాస్పిటల్ కట్టేసి.. నడింపించాలని ప్రయత్నం అంట. హీరోయిన్ గా ఏదో ఒకట టైమ్ లో రిటైర్మెంట్ తీసుకుని.. డాక్టర్ అవతారం ఎత్తాలనేది సాయి పల్లవి నిర్ణయంగా తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.