MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ తో డేటింగ్ విషయంలో స్పందించిన కృతి సనన్, బాలీవుడ్ బ్యూటీ ఏమన్నదంటే..?

ప్రభాస్ తో డేటింగ్ విషయంలో స్పందించిన కృతి సనన్, బాలీవుడ్ బ్యూటీ ఏమన్నదంటే..?

ఎట్టకేలకు స్పందించింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, ప్రభాస్ తో తన డేటింగ్ రూమర్స్ పై సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నది. ప్రభాస్ తో తన రిలేషన్ నిజమేనా..? 
 

Mahesh Jujjuri | Updated : Nov 30 2022, 09:13 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Kriti sanon prabhas

Kriti sanon prabhas

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది కృతీ సనన్. ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ రాముడిగా.. కృతి సీతగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ రూమర్స్ బయలుదేరాయి బాలీవుడ్ లో. 

28
Asianet Image

ప్రభాస్ తో ఆమె క్లోజ్ గా ఉండటంతో.. కృతి సనన్, హీరో ప్రభాస్ తో డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ గత కొద్ది నెలలుగా వార్తలు గుప్పుమన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ వార్తలను అన్ని రకాలుగా అల్లి ప్రచారం చేశారు. 
 

38
Asianet Image

అయితే ఇప్పటి వరకూ ఆ ఇద్దరు స్టార్స్ స్పందించకపోవడంతో.. అందరూ వారిస్పందన కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ విషయంలో హీరోయిన్ కృతి సనన్ స్పందించారు. 

48
Prabhas-Kriti Sanon

Prabhas-Kriti Sanon

రీసెంట్ గా బేధియా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. బాలీవుడ్ స్టార్  ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో, బాలీవుడ్ యంగ్ హీరో  వరుణ్ ధావన్ మాట్లాడుతూ..కృతి సనన్ మనసు ఇక్కడ లేదు, దీపికా పదుకొనే తో నటిస్తున్న ఒక నటుడి వద్ద ఉంది.. అంటూ కామెంట్స్ చేయడంతో అవి అప్పటి నుండి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

58
Asianet Image

దాంతో ప్రభాస్ తో కృతీ ప్రేమలో పడిందంటూ.. వార్తలు తెగవైరల్ అయ్యాయి.  ఫైనల్ గా ఈ విషయంలో ఈరోజు తన  అఫీషియల్ ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా స్పందించారు కృతి సనన్.నిజానికి అటువంటి బేస్ లెస్ రూమర్స్ ని నమ్మవద్దని, తన పెళ్లి నిశ్చయం అయిందని వస్తున్నవి అంతా కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని అన్నారు. 

68
Asianet Image

హీరో వరుణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుడు  ప్రచారం చేస్తున్నారని, దయచేసి ఇటువంటివి ప్రచారం చేయవద్దని ఆమె క్లారిటీ ఇచ్చింది. కృతీ సనన్ క్లారిటీ  ఇవ్వడంతో  పుకార్లకు పూర్తిగా అడ్డుకట్ట పడ్డట్లైంది. కాగా ప్రస్తుతం కృతి సనన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ పై రకరరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. 

78
kriti Sanon

kriti Sanon

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కృతీ సనన్ టాలీవుడ్ మూవీ ద్వారానే ఇండ స్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలతో.. సక్సెస్ లతో దూసుకెళ్తున్న కృతి సనన్ టాలీవుడ్  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ తెరకెక్కిన వన్ నేనొక్కడినే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
 

88
Asianet Image

ఆ మూవీ  హిట్ అవ్వకపోయినా.. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సాధించింది. ఆతరువాత నాగ చైతన్యతో దోచేయ్ మూవీ చేసిన కృతి టాలీవుడ్ లో వర్కౌట్ అవ్వక.. బాలీవుడ్ చేరింది. అక్కడ స్టార్ హీరోల సరసన మెరుస్తూ.. స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది బ్యూటీ. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
నాగ చైతన్య
ప్రభాస్
 
Recommended Stories
Top Stories