మెగాస్టార్ చిరంజీవి హీరోగా,  అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీని తన మార్క్ స్పీడ్ లో కంప్లీట్ చేయబోతున్నాడు అనిల్. అటు విశ్వంభర సినిమాపై ఎటువంటి అప్ డేట్ ఇంత వరకు రాలేదు. కాని అనిల్ రావిపూడి సినిమా మాత్రం పరుగులు పెడుతోంది. ఇక ఈసినిమా స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ వినిపిస్తూనే ఉంది. ఈక్రమంలో తాజాగా మరో అప్ డేట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

తాజాగా వినిపిస్తున్నవార్తల ప్రకారం, ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేయనున్నారని టాక్. ఇందులో ఒక పాత్ర వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేసేవిధంగా ఉంటుందని, మరో పాత్ర మాత్రం పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉంటుందని సమాచారం. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాని టాలీవుడ్ సర్కిల్ లో మాత్రం ఈ రూమర్ షికారు చేస్తోంది.

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ లో భాగంగా నయనతార , చిరంజీవిపై ఫ్యామిలీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో వారి మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగా వస్తోందని మూవీ యూనిట్ నుంచి సమాచారం. సినిమాకు ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతాయని అంటున్నారు.

ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి, "ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందుతున్నట్టు వెల్లడించారు. కథ నన్ను బాగా ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి చెప్పిన సన్నివేశాలను వింటూనే కడుపుబ్బా నవ్వుతున్నాను. ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చడం ఖాయం, అని వెల్లడించారు.

ఈ ఈ సినిమాను సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి గత సినిమాలన్నీ యాక్షన్ డ్రామాలు కాగా, ఈసారి ప్యూర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతానికి మాత్రం మెగాస్టార్ డ్యూయెల్ రోల్ గాసిప్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.