- Home
- Entertainment
- జబర్దస్త్ ని వీడలేక రోజా ఎమోషనల్.. అందరిని హత్తుకుంటూ కన్నీటి పర్యంతం.. పాపమ్ రష్మి..
జబర్దస్త్ ని వీడలేక రోజా ఎమోషనల్.. అందరిని హత్తుకుంటూ కన్నీటి పర్యంతం.. పాపమ్ రష్మి..
రోజా ఇక `జబర్దస్త్` షోలకు గుబ్‌బై చెప్పబోతుంది. ఆమెకి మంత్రి పదవి వరించడంతో ఇక తాను ఈ కామెడీ షోలకు రాలేనని తెలిపింది. ఈ నేపథ్యంలో `జబర్దస్త్` టీమ్, మల్లెమాల ఆమెకి వీడ్కోలు పలికింది. అంతా కన్నీటి పర్యంతమయ్యారు.

నటి రోజా సినిమాలు మానేశాక `జబర్దస్త్` షోకి జడ్జ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. `జబర్దస్త్` షో ప్రారంభం నుంచి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. మధ్యలో ఒకటిరెండు సార్లు అనారోగ్యం కారణంగా గ్యాప్ ఇచ్చారు. కానీ దాదాపు తొమ్మిదేళ్ల పాటు `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కమేడియన్లతోపాటు తను కూడా పంచ్‌లు వేస్తూ ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నారు. అదే సమయంలో జడ్జ్ అనే సీట్‌కి ఒక హుందాతనం తీసుకొచ్చారు రోజా.
ఈ కామెడీ షోతో ఆర్కే రోజా కాస్త `జబర్దస్త్` రోజాగా మారిపోయింది. కొన్నిఏళ్లపాటు తాను రన్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఇంటిపేరునే జబర్దస్త్ గా మార్చుకున్నారు. ఈ షోకి వచ్చాక ఆమె వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమెకి మంత్రి పదవి ఇచ్చారు. ఇటీవలే మంత్రిగానూ ఆమె పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇప్పటికే తాను షోలు చేయలేనని, బాధ్యత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి షోస్‌లో కంటిన్యూ కాలేమని వెల్లడించింది. పైగా ప్రభుత్వ రూల్స్ కూడా ఉండటంతో తాను దూరమవుతున్నట్టు చెప్పారు.
తాజాగా రోజాకి గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది `జబర్దస్త్` టీమ్, మల్లెమాల యూనిట్. జబర్దస్త్ కమేడియన్లు అందరు కలిసి ఆమెకి చప్పట్లతో, అరుపులతో అభినందించారు. వేదికని హోరెత్తించారు. కంగ్రాట్స్ చెబుతూ, ఆనందంలో ముంచెత్తారు. ఇది మల్లెమాల టీమ్‌కి, జబర్దస్త్ కి ఒక ప్రౌడ్ మూవ్‌మెంట్ అంటూ రష్మి అభినందనలు తెలిపింది.
అనంతరం నటి పూర్ణ, సుడిగాలి సుధీర్, కెవ్వు కార్తీక్, ఇతర హాస్యనటులుంతా కలిసి రోజాని వేదిక మీదకు తీసుకొచ్చారు. ఆమెకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనల తెలిపారు. చిన్నగా సత్కరించుకున్నారు. రోజాకి మరింత ఆనందాన్ని చేకూర్చారు. ఆమెని ఎమోషనల్‌కి గురి చేశారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యే ఇక్కడే(జబర్దస్త్ లో ఉన్నప్పుడే) అయ్యాను. మంత్రిని కూడా ఇక్కడే అవ్వాలనుకున్నానని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని చెప్పింది రోజా. నెక్ట్స్ `జబర్దస్త్` షోస్ చేయడం కొంచెం కష్టమే అని, కానీ అందరిని చాలా మిస్ అవుతానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ బాధ తనని బాగా వెంటాడుతుందని చెప్పింది.
తనకు సర్వీస్ చేయడమనేది చాలా ఇష్టమని చెప్పిన రోజా, అలాంటి ఒక మంచి స్థాయి వచ్చినప్పుడు, ఇలాంటి ఇష్టమైన వాటిని కొన్ని వదులుకోవాల్సి వస్తుందని మరింతగా భావోద్వేగానికి గురయ్యింది.ఈటీవీకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలని, లైఫ్‌లో తాను అనుకున్న గోల్స్ ని రీచ్ అయ్యేలా చేసిందని చెప్పిన రోజా.. తాను ఎక్కి ఎక్కి ఏడుస్తూ, అందరు జబర్దస్త్ కమేడియన్లని ఏడిపించింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
రోజా మొదట టీడీపీలో ఉన్నారు. అందులో రెండు సార్లు ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో జగన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీలో చేరారు. 2014లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపారు. 2019లో మరోసారి ఆమె ఎమ్మెల్యేగా గెలిపారు. ఎమ్మెల్యేగా ఉంటూనే `జబర్దస్త్` వంటి పలు టీవీ షోస్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో రోజాకి మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం ఆమె టూరిజం మినిస్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు.
మంత్రిగా ఉన్నప్పుడు టీవీ షోలో చేయకూడదనే నిబంధనలు నేపథ్యంలో రోజా తప్పుకుంటుంది. ఆమె స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తిగా మారింది. ఆమని ఇప్పటికే కంటిన్యూ అవుతున్నారు. మనో ఒక జడ్జ్ గా ఉన్నారు. వీరితోపాటు ఇంద్రజని కూడా టెస్ట్ చేశారు. మరోవైపు పూర్ణని కూడా బరిలోకి దించుతున్నట్టు తెలుస్తుంది. `ఢీ` షోకి పూర్ణ జడ్జ్ గా చేసిన విషయం తెలిసిందే.