- Home
- Entertainment
- చందాలు వసూలు చేసి కూతురు పెళ్లి చేశా, కన్నీరు పెట్టించిన జబర్దస్త్ రైజింగ్ రాజు కామెంట్స్
చందాలు వసూలు చేసి కూతురు పెళ్లి చేశా, కన్నీరు పెట్టించిన జబర్దస్త్ రైజింగ్ రాజు కామెంట్స్
కమెడియన్లు కడుబుబ్బా నవ్విస్తారు కాని.. వారి వెనకు విషాదాలు చాలామందికి తెలియవు. ఆకోవలోకే వస్తారు జబర్ధస్త్ కమెడియన్ రైజింగ్ రాజు. తన కూతురు పెళ్లి కోసం చందాలు వసూలు చేసుకున్నాని, తనను కాపాడిన దేవుడి గురించి చెపుతూ కన్నీరు పెట్టించాడు రాజు.

జబర్దస్త్ లో రైజింగ్ రాజుది స్పెషల్ మార్క్. ఆయన చేసిన కామెడీ ఇతరులకు సాధ్యం కాదు. తనపై ఎన్ని రకాల పంచులు పడుతున్నా. ముసలివాడు, కాటికి కాళ్లు చాపుకున్నాడు, ఇలా రకరకాలు పంచులను భరిస్తూ.. తన శక్తికి మించి కామెడీ పండించి కడుపుబ్బా నవ్వించాడు, నవ్విస్తూనే ఉన్నాడు. జబర్థస్త్ లో నవ్వులు పంచే రైజింగ్ రాజు వెనుక ఎంతో విషాద కథ ఉంది. అది చాలామందికి తెలియదు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తను పడ్డ కష్టాల గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టాడు రాజు, అందరిచేత కంటతడి పెట్టించాడు.
Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్
రైజింగ్ రాజు చాలా ఏళ్ల నుంచే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమాల్లో చిన్న చిన్నపాత్రలు చేశాడు. కాని గుర్తింపు రాలేదు. డబ్బులు కూడా అంతంతమాత్రంగానే వచ్చేవి. దాంతో ప్యామిలీ పోషణ అతనికి భారంగామారింది. అదే సమయంలో జబర్దస్త్ అతనికి కాస్త ఊపిరి పోసింది. జబర్థస్త్ లో డిఫరెంట్ కామెండీతో రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హైపర్ ఆది తో కలిసి టీమ్ లీడర్ గా అద్భుతమైన స్కిట్లు చేశాడు రాజు.
Also Read: 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార - విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?
జబర్థస్త్ వల్ల రాజుకు సినిమా అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు రాజు. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన రైజింగ్ రాజు తన కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కూతురి పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోతే చందాలు వసూలు చేసి పెళ్లి చేశాను అన్నారు. ఈ విషయం చెపుతూ ఎమోషనల్ అయ్యాడు రాజు. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ ఇలా కొందరు తలా ఓ ఐదు వేలు ఇచ్చారు. ఆ డబ్బులతోనే నా కూతురి పెళ్లి చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు రైజింగ్ రాజు.
Also Read: ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
ఇక తన జీవితంలో హైపర్ ఆది దేవుడిలా వచ్చాడు. ఎప్పుడు నన్ను కనిపెట్టుకుని ఉన్నాడు. స్కిట్లు చేసినా చేయకపోయినా పేమెంట్ మాత్రం ఇంటికి పంపించేవాడు అన్నారు రాజు. అంతే కాదు కరోనా టైమ్ లో ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఆటైమ్ లో నాకు మనవడు పుట్టాడు. అప్పుడు బయటు వెళ్లే పరిస్థితి లేదు. నేను ఒక్కడిని వెళ్ళి ఏదైనా చేద్దాం అంటే.. చిన్నపిల్లోడికి నా వల్ల ఆరోగ్య సమస్యలు రాకూడదు. అందుకే ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది.
Also Read: రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?
ఆ టైమ్ లో కూడా హైపర్ ఆది నెల నెల ఇంటికి డబ్బులు పంపించేవాడు. ఇలా తనను దేవుడిలా ఆదుకున్నాడు హైపర్ ఆది. ఎప్పుడు డబ్బులు ఆపలేదు. ఆర్ధికంగా నిలబడేలా చేశాడు అని చెపుతూ ఎమోషనల్ అయ్యాడు రాజు. ప్రస్తుతం రాజు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక జబర్థస్త్ నుంచి స్టార్స్ అంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. హైపర్ ఆది సినిమాలతో బిజీ అయ్యాడు. రాజు కూడా జబర్థస్త్ లో ఎక్కువగా కనిపించడంలేదు.
Also Read: 100 కోట్ల క్లబ్‌లో 10 సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?