MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం

Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం

దునియా విజయ్ దర్శకత్వంలో వస్తున్న 'సిటీ లైట్స్' సినిమాతో ఆయన కూతురు మోనిషా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ టైంలో బెంగళూరు మెజెస్టిక్‌లో తనకు ఎదురైన ఓ దారుణ అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ఆడవాళ్ల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 07 2026, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సిటీ లైట్స్​ సినిమా
Image Credit : Asianet News

సిటీ లైట్స్​ సినిమా

'భీమ' సక్సెస్ తర్వాత నటుడు-దర్శకుడు దునియా విజయ్ 'సిటీ లైట్స్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. ఇందులో వినయ్ రాజ్‌కుమార్ మాస్ రోల్‌లో నటిస్తుండగా, దునియా విజయ్ రెండో కూతురు మోనిషా విజయ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దునియా విజయ్ కూతురికి చేదు అనుభవం
Image Credit : Asianet News

దునియా విజయ్ కూతురికి చేదు అనుభవం

ఈ సందర్భంగా, బెంగళూరులోని మెజెస్టిక్‌లో తనకు ఎదురైన ఓ చెడు అనుభవాన్ని నటి మోనిషా పంచుకున్నారు. షూటింగ్ టైంలో జరిగిన ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ, సమాజంలో ఆడవాళ్ల భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
36
నేను షాక్‌కు గురయ్యాను
Image Credit : others

నేను షాక్‌కు గురయ్యాను

'సిటీ లైట్స్' షూటింగ్ కోసం మా నాన్న నన్ను మెజెస్టిక్‌లోని ప్రతీ మూలకు తీసుకెళ్లారు. మామూలు జనం ఎలా బతుకుతారో చూపించాలన్నది ఆయన ఉద్దేశం. ఆ అనుభవం తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. నేను పుట్టి పెరిగిన బెంగళూరు ఇదేనా అనిపించింది' అని మోనిషా చెప్పారు.
46
ఉద్దేశం ఏంటో నాకు క్లియర్‌గా తెలిసింది
Image Credit : our own

ఉద్దేశం ఏంటో నాకు క్లియర్‌గా తెలిసింది

ఆ అనుభవం గురించి మోనిషా వివరిస్తూ.. 'సిటీ లైట్స్' షూటింగ్ జరుగుతోంది. నేను నా మానాన నేను నడుచుకుంటూ వస్తున్నాను. ఎవరో మధ్యవయసు వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏదో చెప్పారు. ఆయన ఏం చెప్పారో నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ, ఆయన ఉద్దేశం ఏంటో నాకు క్లియర్‌గా తెలిసింది' అని ఆందోళన చెందారు.
56
నేను రియాక్ట్ అయ్యేలోపే..
Image Credit : Asianet News

నేను రియాక్ట్ అయ్యేలోపే..

'ఒంటరిగా వెళ్తుండటంతో నన్ను అప్రోచ్ అయ్యి, వేరే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు. నేను రియాక్ట్ అయ్యేలోపే, వెంటనే మా టీమ్ వాళ్లంతా వచ్చి పరిస్థితిని హ్యాండిల్ చేశారు. అప్పుడు నేను షాక్ అయ్యాను' అని మోనిషా చెప్పారు.
66
ఆడవాళ్లు ఒంటినిండా బట్టలు వేసుకున్నా వదలరు
Image Credit : our own

ఆడవాళ్లు ఒంటినిండా బట్టలు వేసుకున్నా వదలరు

'ఆ రోజు నాకు అనిపించింది, ఆడవాళ్లు ఒంటినిండా బట్టలు వేసుకున్నా వదలరు. ఏ చోటుకి వెళ్లినా ఇంతే. వాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే, కచ్చితంగా వచ్చి ఇబ్బంది పెడతారు' అని మోనిషా విజయ్ అన్నారు. మోనిషా తండ్రి దునియా విజయ్ కన్నడ నాట స్టార్ హీరో. తెలుగులో వీర సింహారెడ్డి చిత్రంలో ఆయన విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?
Recommended image2
Uyir OTT: భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్, క్లైమాక్స్ లో పోలీస్ మానవత్వానికి కన్నీళ్లు ఆగవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved