MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై

Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై

'కొరియన్ కనకరాజు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించారంటూ వచ్చిన విమర్శలపై వరుణ్ తేజ్, దర్శకుడు మెర్లపాక గాంధీ స్పందించారు. తమ ఉద్దేశం ఎప్పుడూ అవమానించడం కాదని స్పష్టం చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 07 2026, 10:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొరియన్ కనకరాజు
Image Credit : Asianet News

కొరియన్ కనకరాజు

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి ఆరంభం లభించినప్పటికీ, మరోవైపు ఓ వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది. సినిమాలో నటుడు సత్య, దివంగత మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ను అనుకరిస్తూ కనిపించిన సన్నివేశంపై కొందరు నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని ఉద్దేశపూర్వకంగానే సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించేలా చిత్రీకరించారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన వీడియోను కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లని కూడా ఇమిటేట్ చేశారు
Image Credit : X/@UV_Creations

కృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లని కూడా ఇమిటేట్ చేశారు

ఈ వివాదంపై తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వరుణ్ తేజ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ఆ సన్నివేశాన్ని గత ఏడాది నవంబర్‌లోనే ఇదే డైలాగ్‌తో చిత్రీకరించాం. ట్రోలింగ్‌కు, అనుకరణకు చాలా తేడా ఉంటుంది. ఎవరైనా సరే గొప్ప నటుల్ని మాత్రమే ఇమిటేట్ చేస్తారు కదా అని వరుణ్ తేజ్ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఉదాహరణకు నేను 'ఎఫ్3' సినిమాలో పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' పాత్రను అనుకరించాను. అది సరదాగా చేసిన ప్రయత్నమే. అలాగే సినిమా ప్రచారంలో కూడా సత్య కృష్ణ గారిని, చిరంజీవి గారిని అనుకరించారు" అని చెప్పారు.

35
వినోదం కోసమే
Image Credit : X/@UV_Creations

వినోదం కోసమే

వరుణ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ, "ఇది పూర్తిగా వినోదం కోసమే చేశాం. వారు గొప్ప నటులు కాబట్టే వారిని అనుకరిస్తాం. ఎవ్వరినీ కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. సోషల్ మీడియాలో వచ్చే స్పందనలు మా నియంత్రణలో ఉండవు. థియేటర్లలో ప్రేక్షకులు ఆ సన్నివేశాలను ఆస్వాదిస్తున్నారు. సత్య తన గత సినిమాల్లో కూడా చాలా మంది నటులను అనుకరించారు. ఇందులో ఎలాంటి అగౌరవ భావం లేదు" అని స్పష్టం చేశారు.

45
దర్శకుడు మెర్లపాక గాంధీ
Image Credit : X/@UV_Creations

దర్శకుడు మెర్లపాక గాంధీ

దర్శకుడు మెర్లపాక గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. "మేము ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్‌ను సినిమాల్లో ఉపయోగించడం సాధారణ విషయమే. అలాంటి అంశాలు థియేటర్లలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని భావించాం. ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేక్షకులు కూడా వెంటనే దానితో అనుసంధానం చేసుకున్నారు" అని వివరించారు.

55
సోషల్ మీడియాలో చర్చ
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో చర్చ

'కొరియన్ కనకరాజు' బృందం మాత్రం సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ సన్నివేశం పూర్తిగా వినోదం కోసమే రూపొందించబడిందని, గొప్ప నటులపై తమకు ఎప్పుడూ గౌరవమే ఉంటుందని వరుణ్ తేజ్, దర్శకుడు మెర్లపాక గాంధీ ఇద్దరూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?
Recommended image2
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved