నేషనల్ అవార్ట్స్ బరిలో ఎన్టీఆర్, చరణ్.. ఒత్తిడిగా ఫీలయ్యాడా? అల్లు అర్జున్ ఆన్సర్ ఏంటంటే?
69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు సాధించి రికార్డు క్రియేట్ చేశారు అల్లు అర్జున్. అయితే ఈ రేసులో రామ్ చరణ్, తారక్ కూడా ఉన్నారు. వారు పోటీనివ్వడంపై బన్నీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా ‘పుష్ప : ది రైజ్’తో బన్నీ రికార్డు క్రియేట్ చేశారు. 69 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) ఉత్తమ నటుడి కేటగిరీలో జాతీయ అవార్డును సొంతం చేసుకుని సంచలనంగా మారారు. 2021వ సంవత్సరానికి గాను సినీ జాతీయ అవార్డ్స్ (National Film Awards 2021)ను కేంద్ర ప్రభుత్వం ఈనెల 24న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రాలు సత్తా చాటాయి.
ఆర్ఆర్ఆర్ కు ఆయా కేటగిరీల్లో ఆరు అవార్డులు దక్కగా.. పుష్ప చిత్రం మాత్రం ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ కు, బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డులను అందింది. అయితే, తొలిసారిగా బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డును అల్లు అర్జున్ అందుకోవడంతో సినీ ప్రముఖు ప్రశంసల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీతో పాటు సెలబ్రెటీలు, అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీతోనూ బన్నీ ఎమోషనల్ అయిన దృశ్యాలను వీడియోల ద్వారా చూసే ఉన్నాం.
ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, తదితర స్టార్ క్యాస్ట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి లో విడుదల చేయబోతున్నారు.
నేషనల్ అవార్డు దక్కిన సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయా అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో నేషనల్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr. NTR) పోటీనివ్వడంపై ప్రశ్న ఎదురైంది. వారు కూడా రేసులో ఉండటంతో మీరేమైనా ఇబ్బంది పడ్డారా? అని ప్రశ్నించగా.. బన్నీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
బన్నీ మాట్లాడుతూ.. వాళ్లు పోటీలో ఉండటం నేను ఒత్తిడిగా ఏం ఫీలవ్వలేదు. ఉత్తమ నటుడి కేటగిరీలో నేషనల్ వైడ్ గా మొత్తం 20కి పైగా నామినేషన్స్ వచ్చాయి. ఇందులో సౌత్ స్టార్స్ పాటు, నార్త్ నుంచి కూడా ఉన్నారు. దక్షిణాది నుంచ కాకుండా హిందీ నుంచి కూడా నలుగురు స్టార్స్ గట్టిగా పోటినిచ్చారు. కానీ నేను మాత్రం లోకల్ కంటే.. ఓవరాల్ నేషనల్ పోటీ గురించే ఆలోచించాను.... అంటూ బదులిచ్చారు. బన్నీ ఇచ్చిన ఆన్సర్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ కామెంట్స్ తో Pushpa 2 The Ruleపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో వరల్డ్ మార్కెట్ పై బన్నీ ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఆ స్థాయిలోనే ప్రతి అప్డేట్ ను ప్రమోట్ చేస్తున్నారు. గతంలో విడుదలైన Where is pushpa వీడియో ప్రమోషన్ కోసమే మేకర్స్ రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. అప్పటికే పుష్ప క్రేజ్ మామూలుగా లేకపోవడం, ప్రమోషన్స్ నూ గ్రాండ్ గా చేయడంతో ‘పుష్ప2’పై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి.