అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను రేప్ చేశాడు, ఆరునెలలకే చచ్చాడు.. సీనియర్ నటి జయలలిత షాకింగ్ కామెంట్స్
తెలుగు సీనియర్ నటి జయలలిత దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోదగ్గ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
తెలుగు సీనియర్ నటి జయలలిత దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. గుర్తుంచుకోదగ్గ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
అందరిలాగే తనకి కూడా తెరవెనుక కన్నీటి కష్టాలు ఉన్నట్లు జయలలిత తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కెరీర్ ఆరంభంలో తనకి వచ్చిన అవకాశాలు చేజారకుండా ఉండిఉంటే ఇప్పటికంటే బెటర్ పొజిషన్ లో హీరోయిన్ గా ఉండేదాన్ని అని తెలిపారు.
ఇండస్ట్రీలో కాసింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఉంటాయి అని చెప్పడానికి నాకు ఎదురైన భయానక సంఘటనే ఉదాహరణ అని జయలలిత పేర్కొంది. ఒక మలయాళీ చిత్రంలో తొలిసారి అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో నటించేందుకు అక్కడికి వెళ్లాను. మలయాళీ ఇండస్ట్రీకి నేను కొత్త కావడంతో కాస్త భయపడేదాన్ని.
ఆ చిత్రానికి పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు ఇప్పుడు రేప్ సీన్ లో నటించాలి. సీన్ వివరిస్తా రా అంటూ గదిలోకి తీసుకువెళ్లాడు. గడిపెట్టి సీన్ వివరించే నెపంతో నన్ను రేప్ చేశాడు. తప్పించుకుందాం అనుకున్నా కుదర్లేదు. చిత్ర హింసలు పెట్టాడు. తాను అతడి చేతిలో నిజంగానే అత్యాచారానికి గురయ్యానని జయలలిత వాపోయింది. ఇంతవరకు ఎప్పుడూ ఈ విషయాన్ని బయటపెట్టలేదని నాలోనే దాచుకుని కుమిలిపోయినట్లు జయలలిత అన్నారు.
నన్ను రేప్ చేసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలలకే చచ్చాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. నేను వ్యాంప్ పాత్రలు చేయడం పట్ల కూడా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాను. నా పేరు జయలలిత కావడంతో.. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అభిమానులు అమ్మ పేరు పెట్టుకుని ఇలాంటి పాత్రల్లో నటిస్తావా అంటూ దాడికి ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయని వాపోయింది.
చిరంజీవి ఖైదీ చిత్రంలో అవకాశం చేజారడం, కుటుంబ సమస్యలు ఇలా తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలని జయలలిత తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. తన కుటుంబాన్ని పోషించడం కోసమే తానూ వ్యాంప్ రోల్స్ చేసినట్లు తెలిపింది.