ధనుష్ vs అర్జున్, యాక్షన్ కింగ్ తో పోటీపడబోతున్న స్టార్ హీరో
విజయ్ దళపతి, అజిత్, లాంటి స్టార్ హీరోలకు విలన్ గా నటించి మెప్పించిన మరో స్టార్ హీరో అర్జున్.. తాజాగా ధనుష్ తో తలపడటానికి రెడీ అవుతున్నాడు.

ధనుష్ సినిమాలు
తమిళ సినీ పరిశ్రమలో బిజీ హీరో ధనుష్. ఆయన దర్శకత్వం వహించిన ‘నీలవుక్కు ఎన్నమేలెన్నడి కోపం’ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేనంత బిజీగా ఉన్నారు ధనుష్. ప్రస్తుతం ఆయన హిందీలో రాంఝనా 2 లో నటిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలోని ఓ కాలేజీలో జరుగుతోంది.
Also Read: రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ డైెరెక్టర్
ధనుష్ నెక్ట్స్ సినిమా
ఆ సినిమా పూర్తయ్యాక, ఆయన దర్శకత్వం వహించి నటించిన ఇడ్లీ కడై సినిమా విడుదల పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు అరుణ్ విజయ్, నిత్య మీనన్ నటించారు.
ఇవి కాకుండా తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, విగ్నేష్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా, లప్పర్ బంతు దర్శకుడు తమిళరసన్ పచ్చైముత్తు దర్శకత్వంలో ఒక సినిమా, ఇళయరాజా బయోపిక్ ఇలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయబోతున్నాడు ధనుష్.
Also Read:వర్జిన్ వైఫ్ కావాలని కోరుకోకండి, మగవారికి మహేష్ బాబు హీరోయిన్ సంచలన సలహాలు, ఏమంటుందంటే?
విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్
ఇందులో విగ్నేష్ రాజా దర్శకత్వం వహించే సినిమాలోనే ధనుష్ తదుపరిగా జాయిన్ అవ్వబోతున్నాడు. ఈ సినిమాను వేల్స్ ఫిలింస్ బ్యానర్ పై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ తో పాటు నటించే నటులు, నటీమణుల ఎంపిక పూర్తి స్థాయిలో జరుగుతోందట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ధనుష్ కి విలన్ గా నటించనున్న నటుడి గురించి అప్డేట్ వచ్చింది.
Also Read:10 ఏళ్లకే ఇండస్ట్రీలొకి ఎంట్రీ, 36 ఏళ్లకే మరణం, 70 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ధనుష్ కి విలన్ గా అర్జున్
విగ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్న సినిమాలో ధనుష్ కి విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నారట. ఇప్పటికే లియో సినిమాలో విజయ్ కి,రీసెంట్ గా రిలీజ్ అయిన పట్టుదల సినిమాలో అజిత్ కి విలన్ గా నటించి అలరించారు అర్జున్. ఈ రెండు పెద్ద సినిమాలకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో ధనుష్ కి విలన్ గా నటించడానికి అంగీకరించారట అర్జున్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read:బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?