MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?

70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?

అతను ఇండియన్ స్టార్ యాక్టర్, 70 ఏళ్ల ఈ నటుడు ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగో పెళ్ళి మాత్రం తనకంటే 30 ఏళ్ళు చిన్నదైన అమ్మాయిని చేసుకున్నాడు. తన మనవరాలి వయస్సున్న అమ్మాయిని పెళ్లాడిన నటుడు ఎవరు?   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 06 2025, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అదేదో సినిమాలో చూసినట్టే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోకే నటుడి జీవితం. ఏ సినిమాకు తీసిపోని విధంగా బతుకుతున్న నటుడు కబీర్ బేడి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. బాలీవుడ్, దక్షిణ భారతదేశంలో పేరు తెచ్చుకున్న కబీర్, 'కూన్ భారీ మాంగ్', 'మే హూ నా' వంటి సినిమాల ద్వారా గుర్తింపు పొందాడు. లవ్ లైఫ్ గురించి కబీర్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. 

Also Read: 4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?
​

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కబీర్ 1969లో మోడల్, ఒడిస్సీ డ్యాన్సర్ ప్రతిమా గుప్తాను పెళ్లాడాడు. ఆ కాలంలోనే ప్రతిమ హాట్ నటిగా పేరు తెచ్చుకుంది. ఇంకా హాట్ హాట్ గా కనిపించే యాడ్స్ లోనే ఆమె ఎక్కువగా కనిపించేది. కబీర్ బేడీని మొదటిసారి కలిసినప్పుడే ప్రతిమ నాటకాల్లో పేరు తెచ్చుకుంది. ఈ పెళ్లికి ప్రతిమ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఈ జంట కోర్టు మ్యారేజ్ చేసుకుంది. 

Also Read: 30 కోట్లు రెమ్యునరేషన్ తో నయనతారకు షాక్ ఇచ్చిన హీరోయిన్, సౌత్ లో టాప్ ఆమేనా?

36

మొదట్లో వీరి సంసారం సంతోషంగా సాగినప్పటికీ, 1970 తర్వాత మనస్పర్థలు వచ్చి 1977లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు పూజా, సిద్ధార్థ్ అనే పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో సిద్ధార్థ్ 1977లో చనిపోయాడు. కొడుకు మరణం ప్రతిమను డిప్రెషన్ లోకి నెట్టింది.

ఆ తర్వాత ఆమె హిమాలయాలకు తీర్థయాత్రకు వెళ్లింది. ఉత్తరాఖండ్ లో 1998లో ప్రతిమ చనిపోయిందని చెబుతారు. గతంలో విడాకుల గురించి మాట్లాడుతూ ప్రతిమ, "కబీర్ జీవితంలో మహిళ అంటే చాలా చిన్న భాగం.

నా జీవితంలో మొదట కెరీర్, ఆ తర్వాత కుటుంబం, స్నేహితులు, చివరలో భార్య అని అతను నాకు ముందే చెప్పాడు. కబీర్ అలాగే ఉన్నాడు. సక్సెస్ కోసం అతను కష్టపడ్డాడు. కబీర్ ఎప్పటికీ నా రాజు. నా జీవితంలో కబీర్ బదులు వేరెవరూ రాలేరు" అని చెప్పింది. 

Also Read: గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో

46
Kabir Bedi and Parveen Babi

Kabir Bedi and Parveen Babi

ప్రతిమా గుప్తాతో సంసారం చేస్తున్నప్పుడే 1970 ప్రాంతంలో కబీర్, పర్వీన్ బాబీతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. పర్వీన్ లో ఏదో లోపం ఉండడంతో వాళ్లిద్దరూ దూరమయ్యారు. కబీర్ జీవితంలోకి పర్వీన్ ఎంట్రీ ఇవ్వగానే మొదటి భార్యను కాస్త దూరం పెట్టాడట కబీర్.

 కబీర్ గురించి మాట్లాడుతూ పర్వీన్ "కబీర్ పని వల్ల మా లైఫ్ స్టైల్ మారిపోయింది. నేను కబీర్ తో పెళ్లి చేసుకునే ఆలోచన చేయకుండా, నాతోనే ఉంచుకున్నాను" అని చెప్పింది. 1977లో పర్వీన్, కబీర్ దూరమయ్యారు.

Also Read: కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

56

కబీర్ బేడి అమెరికాలో మోడలింగ్ చేస్తున్నప్పుడు Susan Humphreysను కలిశాడు. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి, 1980లో పెళ్లి చేసుకుని 1990లో వీరు విడిపోయారు. ఈ జంటకు అదామ్ బేడి అనే కొడుకు ఉన్నాడు. 

ఇక కబీర్ మూడో పెళ్లి లండన్ లో జరిగింది.  1991లో కబీర్ బీబీసీ రేడియో ప్రెజెంటర్ నిక్కీ మూల్గావ్కర్ ను కలిశాడు. 1992లో ఈ జంట పెళ్లి చేసుకుంటుంది. కబీర్ కంటే నిక్కీ 20 ఏళ్లు చిన్నది. నిక్కీ లండన్ లో ఉంటే, కబీర్ ఇండియాలో ఉండేవాడు. ఇలా వీరిమధ్య దూరం పెరిగి.. మనస్పర్థలు వచ్చి 2004లో ఈ జంట విడిపోతుంది. 

Also Read: అంతరంగాలు హీరోయిన్ కి లైంగిక వేధింపులు, అశ్విని ని రూమ్ కు పిలిచిన దర్శకుడు ఎవరు?

66

2004లో విడాకులు తీసుకున్న తర్వాత కబీర్ బేడి లండన్ కు చెందిన ఇండియన్ సోషల్ రీసెర్చర్ పర్వీన్ దుసాంజ్ తో మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఈ జంట మధ్య 29 ఏళ్ల గ్యాప్ ఉంది.

కూతురు పూజా పేరు మీద ఉన్న ఫ్లాట్ లోనే ఈ జంట కలిసి జీవిస్తున్నారు. పర్వీన్ కంటే పూజా మూడు సంవత్సరాలు పెద్దది. కూతురి కంటే చిన్న వయసున్న అమ్మాయితో కబీర్ జీవిస్తున్నాడు. 2011లో కబీర్ పర్వీన్ కు ప్రపోజ్ చేశాడు. 70 ఏళ్ల వయసులో ఈ జంట పెళ్లి చేసుకుంది. 

ప్రతి రిలేషన్షిప్ లోనూ ఆర్థికంగా నేను వారిని నిలబెట్టాను అని అంటారు కబీర్.  పర్వీన్ తో  పదేళ్లు కలిసి ఉన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం సహజం" అని కబీర్ .అన్నాడు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Recommended image2
Peddi Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ పడిపోయిందా, నిలబడిందా.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
Recommended image3
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved