- Home
- Entertainment
- కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?
కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?
సంగీతం ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు ఇళయరాజా.. ఎన్నో రికార్డ్ లు సృష్టించారు. ఇక ఆయన కథ వినకుండాసే సంగీతం అందించి సూపర్ హిట్ పాటలు అందించిన సినిమా ఏదో తెలుసా?

Ilaiyaraaja Song Secret : ఇళయరాజా తన సోదరుడు గంగై అమరన్ దర్శకత్వం వహించిన సినిమాకి కథ వినకుండానే పాటలు కంపోజ్ చేసి అదరగొట్టారు. సంగీత ప్రపంచానికి దేవుడిగా కొలవబడేది సంగీత జ్ఞాని ఇళయరాజా. ఆయన సంగీతం అందిస్తే సినిమా కన్ఫార్మ్ హిట్టే అనే పరిస్థితి 80, 90 దశకాల్లో ఉండేది.
ఇళయరాజా సంగీతం కోసం, ఆయన పాటల కోసం ప్రజలు థియేటర్లకు క్యూ కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సంగీత జ్ఞాని కథే వినకుండా ఒక సినిమాకి సంగీతం అందించారు అంటే నమ్మగలరా.. కానీ అదే నిజం.
Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి
Ilaiyaraaja
ఒక సినిమాకి సంగీతం అందించాలి అంటే ఆ సినిమా కథని సంగీత దర్శకులు ముందుగా వింటారు. ఎందుకంటే సీన్ ఏంటి, ఎందుకు ఆ చోట పాట వస్తుంది అని డైరెక్టర్ వివరంగా చెప్తేనే దానికి తగ్గ సంగీతాన్ని సంగీత దర్శకుడు ఇస్తారు. కానీ ఇళయరాజా సినిమా కథ వినకుండా కేవలం టైటిల్ మాత్రమే విని సంగీతం అందించిన సినిమా, పాటల కోసమే ఏడాదికి పైగా థియేటర్లో ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Also Read: రోజా భర్త మాటలు విని కోట్లు నష్టపోయిందా.?
Gangai Amaran, Ilaiyaraaja
ఆ సినిమాకి దర్శకత్వం వహించింది మరెవరో కాదు; ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్. ఆ సినిమా పేరు కరగాట్టక్కారన్. ఈ సినిమా గురించి ఇళయరాజాతో డిస్కస్ చేయడానికి వెళ్లిన గంగై అమరన్, సినిమా టైటిల్ చెప్పగానే ఇది అస్సలు బాలేదు... ఇలా పేరు పెడితే ఆడదు అని చెప్పారట సంగీత జ్ఞాని.
దానికి గంగై అమరన్, అదంతా నేను చూసుకుంటాను మీరు పాట మాత్రం ఇవ్వండి అని అడిగారట. ఆ విధంగా కరగాట్టక్కారన్ అంటే పల్లెటూరి కథాంశం ఉన్న సినిమా అని ఊహించి 9 పాటలకు ట్యూన్ వేసి గంగై అమరన్ కి ఇచ్చారట.
Also Read:సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?
Secret Behind karagattakaran Movie Songs
ఆ తర్వాత ఆ పాటలకు గంగై అమరన్ పాటల సాహిత్యం రాయగా ఈ కలయికలో వచ్చిన మ్యాజిక్ కరగాట్టక్కారన్ సినిమా. తమిళనాడులో ఆ రోజుల్లో ఈ సినిమా పాటలు వినడానికి థియేటర్ కి రిపీట్ మోడ్ లో వచ్చి సినిమా చూసిన వాళ్ళు ఎంతోమంది.
ఆ సినిమాలో ఉండే మాంగుయిలే పూంగుయిలే, కుడగు మలై కాట్రిల్ వరుమ్, ఈ మాన్ ఉందన్ సొంత మాన్, ఊరు విట్టు ఊరు వందు వంటి పాటలు ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నాయి.
Also Read:60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?