- Home
- Entertainment
- గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?
గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?
టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో.. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. కాని ఇంత వరకూ స్టార్ డమ్ మాత్రం అందుకోలేదు. ఇంతకీ ఎవరా హీరో?
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో చాలామంది యంగ్ హీరోలు ఉన్నారు. హిట్టు.. ప్లాప్ అన్న తేడా లేకుండా మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకునిసినిమాలు చేసేవారు ఎంతో మంది. కాని వారిలో చాలామంది స్టార్ డమ్ కు చాలా దూరంగానే ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా.. సాలిడ్ హిట్ పడక కెరీర్ లాస్ అవుతున్న హీరోలు కొందరు.
అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే యంగ్ హీరో కూడా ఉన్నాడు. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. ఈ హీరో..వందల కోట్ల ఆస్తి ఉంది కాని స్టార్ హీరో స్టేటస్ మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో?
Also Read: 4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?
ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్. అవును శర్వానంద్ కు సాలిడ్ హిట్ పడటంలేదు. కాని అతను సెలక్ట్ చేసుకునే కథలు మాత్రం అంద్భుతంగా ఉంటాయి. మొత్తంగా కమర్షియల్ ఆలోచనలు లేకుండా.. ఆడియన్స్ కు మంచి సినిమాను ఇవ్వాలన్న ఉద్ద్యేశ్యంతో సినిమాలు చేస్తుంటాడు శర్వానంద్. అందుకే చాలాసెన్సిబుల్ గా ఉండే జర్ని, శనతమానం భవతి, రన్ రాజా రన్, మహానుభావుడు లాంటి సినిమాలు శర్వానంద్ నుంచి వచ్చాయి.
Also Read:30 కోట్లు రెమ్యునరేషన్ తో నయనతారకు షాక్ ఇచ్చిన హీరోయిన్, సౌత్ లో టాప్ ఆమేనా?
Sharwanand
అయితే ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్నాయి. పాన్ ఇండియా హీరోల మధ్య ఈయంగ్ స్టార్ సినిమాలు కనిపించడంలేదు. చాలా కాలంగా శర్వానంద్ సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ ఖాతాలో క్లీన్ హిట్ లేదు అనే చెప్పాలి.
Also Read:100 కోట్లు కలెక్ట్ చేసిన అర్జున్ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న మూవీ ఏదో తెలుసా?
శర్వానంద్ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. చాలా పెద్ద బిజినెస్ కుటుంబంలో పుట్టాడు. కోట్ల వ్యాపారాలు వారి ఫ్యామిలీకి ఉన్నాయి. అయినా సరే అవన్నీ తమ పేరెట్స్ వే కాని నావి కాదు కదా అంటుంటాడు శర్వానంద్. తాను తన స్వశక్తి మీదనే లైఫ్ లీడ్ చేస్తానంటాడు.
ఇన్నేళ్ళు అవుతున్నా శర్వానంద్ కు మాత్రంస్టార్ డమ్ వరించడంలేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు సినిమాల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈసారి అయినా శర్వానంద్ హిట్ కొడతాడో లేదో.
Also Read:ఫస్ట్ టైమ్ రామ్ గోపాల్ వర్మ కు భయం పట్టుకుందా? కాపాడాలని కోర్టును ఆశ్రయించిన ఆర్జీవి