- Home
- Entertainment
- Balakrishna Movies: వరస్ట్ మూవీస్ కి చెక్ పెట్టి జైత్ర యాత్ర కొనసాగిస్తున్న బాలయ్య.. చివరి 5 సినిమాలు ఇవే
Balakrishna Movies: వరస్ట్ మూవీస్ కి చెక్ పెట్టి జైత్ర యాత్ర కొనసాగిస్తున్న బాలయ్య.. చివరి 5 సినిమాలు ఇవే
బాలకృష్ణ నటించిన చివరి 5 సినిమాల రిజల్ట్స్ ఈ కథనంలో ఉన్నాయి. అఖండతో జైత్ర యాత్ర ప్రారంభించిన బాలయ్యకి అఖండ 2 ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దాదా అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలకృష్ణ గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు. అఖండ నుంచి అఖండ 2 వరకు బాలయ్య 5 సినిమాల్లో నటించారు. అందులో 4 సూపర్ హిట్స్ ఉన్నాయి. అఖండ 2 ఒక్కటీ లేకుంటే బావుండేది అని అభిమానుల అభిప్రాయం. అంతకు ముందు బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ లాంటి చెత్త సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలయ్య జైత్ర యాత్ర మొదలైంది. ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అఖండ
అంతకు ముందు వర్కౌ చెత్త సినిమాలు చేసిన బాలయ్య.. అఖండతో సంచలన విజయం అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య, బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.
వీర సింహారెడ్డి
ఇది రొటీన్ మాస్ ఫార్ములా చిత్రం. అయినప్పటికీ సంక్రాంతి అడ్వాంటేజ్ కారణంగా మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ గా నిలిచింది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. హనీ రోజ్, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటించారు.
భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటించింది. బాలయ్య స్టైల్ మంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే చక్కటి సందేశంతో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
డాకు మహారాజ్
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలయ్యని బాబీ పర్ఫెక్ట్ మాస్ స్టైల్ లో ప్రెజెంట్ చేశారు. దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది.
అఖండ 2
అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు బాలయ్య వరుస చిత్రాలతో హిట్లు కొట్టారు. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన అఖండ 2 మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రెండవసారి నటిస్తున్న దాదా చిత్రంతో బాలయ్య తన జైత్ర యాత్రని తిరిగి ప్రారంభించాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.















