30 కోట్లు రెమ్యునరేషన్ తో నయనతారకు షాక్ ఇచ్చిన హీరోయిన్, సౌత్ లో టాప్ ఆమేనా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అంటే నయనతార గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆమె సినిమాకు 12 కోట్లకు పైనే వసూలు చేస్తోంది. కాని తాజాగా నయనతారకు షాక్ ఇచ్చింది మరో హీరోయిన్, డబుల్ రెమ్యునరేషన్ తో దూసుకుపోతోంది. ఎవరామె?

గతంలో హీరోయిన్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కావు. హీరోలు కోట్లలో తీసుకున్నా.. హీరోయన్లకు మాత్రం లక్షల్లోనే ఇచ్చేవారు. బాలీవుడ్ లో మాత్రమే హీరోయిన్లకు కాస్త ఎక్కువగా రెమ్యునరేషన్లు గిట్టేవి.
కాని పాన్ ఇండియా సినిమాలు పుణ్యంతో సౌత్ లో కూడా హీరోయిన్లకు టైమ్ వచ్చింది. వారు కూడా గట్టిగా డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారి లిస్ట్ లో నయనతార ముందుంది.
Also Read: 4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?
Nayanthara, Prabhas
వయస్సు పెరుగుతున్నా కొద్ది నయనతారకు కూడా డిమాండ్ పెరిగింది. నిజానికి హీరోయిన్లకు 30 దాటితే డిమాండ్ తగ్గుతుంది. కాని నయనతార మాత్రం 40 ఏళ్లు వచ్చినా.. నయనతారకు గ్లామర్, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 1000 కోట్ల కలెక్షన్లు సాధించి జవాన్ సినిమాతో అక్కడ కూడా డిమాండ్ పెంచుకుంది. ఇక సినిమాకు 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తుంది నయనతార. కాని రీసెంట్ గా నయనతారకు షాక్ ఇచ్చింది మరో హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు..?
Also Read: అంతరంగాలు హీరోయిన్ కి లైంగిక వేధింపులు, అశ్విని ని రూమ్ కు పిలిచిన దర్శకుడు ఎవరు?
Sai Pallavi
ఆమె మరెవరో కాదు సాయి పల్లవి. సౌత్ లో తిరుగులేని నయనతార సూపర్ స్టార్ ఇమేజ్ కు.. తన పవర్ స్టార్ ఇమేజ్ తో చెక్ పెట్టేసింది. రీసెంట్ గా అమరన్ సినిమాతో 3000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిన సాయి పల్లవి.. తండేల్ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టి.. దూసుకుపోతోంది.
దాంతో సాయి పల్లవి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఎక్కువ రెమ్యునరేషన ఇవ్వడానికి కూడా మేకర్స్ రెడీగా ఉన్నారట. తండేల్ కోసం ఆమె 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరన్, తండేల్ హిట్ అవ్వడంతో సాయి పల్లవి రేటు కూడా పెరిగిపోయిందట.
Also Read:చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?
ప్రస్తుతం సాయిపల్లవి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న బాలీవుడ్ రామాయణంలో నటిస్తోంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురిడిగా నటిస్తుండగా..సీతగా సాయి పల్లవి నటిస్తోంది.
ఈ సినిమా షూగింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే రామాయణం సినిమాకు సాయి పల్లవి 30 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటుందట. అయితే ఈ లెక్క ఒక్క సినిమాకు కాదు. రామాయణం రెండు భాగాలకు కలిపి 30కోట్లు ఇస్తున్నారట.
Also Read:కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?
report says Actress Nayanthara
ఒక్కో సినిమాకు 15 కోట్లు తీసుకుంటుందట సాయి పల్లవి. ఈలెక్కన నయనతారను మించిపోయింది బ్యూటీ. నేచురల్ నటిగా పేరున్న సాయి పల్లవికి ఈరేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పులేదంటున్నారు నెటిజన్లు.
సాయి పల్లవి కూడా వరుససినిమాలో ఫుల్ బిజీ కాబోతోంది. మరి సీతగా రామాయణంలో ఎలాంటినటన చూపిస్తుందో చూడాలి. అంతే కాదు రామాయణం సూపర్ హిట్ అయితే మటుకు సాయి పల్లవి రేంజ్ ను పట్టుకోవడం కష్టమనే చెప్పాలి.