MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • ఆడాళ్లు మీకు జోహార్లు... దాయాదులపై కసి తీరా ప్రతీకారం తీర్చుకున్న మిథాలీసేన...

ఆడాళ్లు మీకు జోహార్లు... దాయాదులపై కసి తీరా ప్రతీకారం తీర్చుకున్న మిథాలీసేన...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నాటి సంగతి. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత పురుషుల జట్టు, దాయాది పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటకట్టుకుంది. అయితే ఐదు నెలల గ్యాప్‌లో పాక్‌పై కసి తీరా ప్రతీకారం తీర్చుకుంది మిథాలీ సేన...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 06 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

భారత పురుషుల జట్టులాగే వన్డే వరల్డ్ కప్ 2022 వార్మప్ మ్యాచుల్లో మిథాలీసేన, రెండు అద్భుత విజయాలను అందుకుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

దీంతో టోర్నీ మొదలయ్యేసరికి మనోళ్ల పర్ఫామెన్స్, పురుషుల టీమ్‌లాగే ఊసురుమనిపిస్తుందేమోనని అనుమానించారు క్రికెట్ ఫ్యాన్స్...

312

అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ దాయాది పాకిస్తాన్‌పై అద్భుత పర్ఫామెన్స్ ఇచ్చి, ఘన విజయంతో టోర్నీని మొదలెట్టింది భారత మహిళా జట్టు...
 

412

114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత స్నేహ్ రాణా, పూజా వస్తాకర్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ కారణంగా 244 పరుగుల స్కోరు చేయగలిగింది...
 

512

ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంతో భారత బౌలర్లు అద్భుతమే చేశారు. 28 పరుగుల దగ్గర తొలి వికెట్ తీసిన భారత బౌలర్లు, వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్‌ను కోలుకోనివ్వలేదు...

612

రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీయగా స్నేహ్ రాణా, జులన్ గోస్వామి రెండేసి వికెట్లు తీశారు. 137 పరుగులకే పాక్‌ను చుట్టేసిన భారత జట్టు 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని, టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది...

712

పాకిస్తాన్‌పై భారత జట్టుకి ఇది వరుసగా 11వ విజయం... వుమెన్స్ వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో వరుసగా నాలుగో విజయం...

812

పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచిన 11 వన్డేలు కూడా మిథాలీ రాజ్ కెప్టెన్సీలో ఆడినవే కావడం విశేషం. 2005 నుంచి పాక్‌పై ఓటమి లేకుండా వరుస విజయాలు అందుకుంటోంది భారత మహిళా జట్టు...

912

2017 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, పాక్‌పై 4 వికెట్లు తీసి వరల్డ్ కప్ టోర్నీలో రెండు సార్లు 4+ వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా నిలిచింది...

1012

నేటి మ్యాచ్‌లో నాలుగు క్యాచులు అందుకున్న వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. 

1112

భారత పురుషుల జట్టు, పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తీయలేక చిత్తుగా ఓడిత, భారత మహిళా జట్టు, ఒక్క పాక్ బ్యాటర్‌ని కూడా 40+ స్కోరు చేయనివ్వకుండా దుమ్మురేపింది...

1212

10 వికెట్ల తేడాతో టీమిండియాని ఓడించామని తెగ విర్రవీగిన పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఈ విజయంతో దిమ్మతిరిగే సమాధానం చెప్పేసిన మిథాలీ సేనకు ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అంటూ పోస్టులు పెడుతున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved