MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ టీమ్‌ని ఓడించడం అంత ఈజీ కాదు, ప్లేఆఫ్స్ చేరడం పక్కా... ఇర్ఫాన్ పఠాన్ జోస్యం...

ఆ టీమ్‌ని ఓడించడం అంత ఈజీ కాదు, ప్లేఆఫ్స్ చేరడం పక్కా... ఇర్ఫాన్ పఠాన్ జోస్యం...

ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్లుగా ప్రారంభించిన జట్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ సీఎస్‌కేని ఓడించిన కేకేఆర్, ఆ తర్వాత ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 04 2022, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఆర్‌సీబీతో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో ఓడిపోయినప్పటికీ, ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్‌ని తీసుకెళ్లి... బెంగళూరు శిబిరంలో గుబులు రేపింది కేకేఆర్...

29

మూడింట్లో రెండు మ్యాచులు గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, టాప్‌లో ఉంది...

39

గత సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన కేకేఆర్, మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది...  అయ్యర్ అంచనాలకు తగ్గట్టుగా జట్టును నడిపిస్తున్నాడు..

49

‘శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. అతను 2018లోనే కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు. కుర్రాడు, చాలా నేర్చుకోవాల్సిన వాడు...

59

అయినా అద్బుతంగా జట్టును నడిపిస్తున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్ చూసినా, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ చూసినా... శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు....

69

రాజపక్ష 9 బంతుల్లో 31 పరుగులు చేసిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఈజీగా 180+ స్కోరు చేస్తుందని అనుకున్నా. కానీ ఉమేశ్ యాదవ్‌ని చక్కగా వాడుకున్న అయ్యర్, అద్భుతమైన రిజల్ట్ రాబట్టాడు...

79

బ్యాటర్లను సెటిల్ అవ్వకుండా వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్‌లను తీసుకొచ్చి రిజల్ట్ రాబట్టాడు. పంజాబ్ కింగ్స్ కంటే ఎక్కువగా మ్యాచ్‌పై పట్టు సాధించాలనే కసి అయ్యర్‌లో కనిపించింది...

89

9వ ఓవర్‌లో ఉమేశ్ యాదవ్‌ని తీసుకొచ్చిన అయ్యర్, డేంజర్ లివింగ్‌స్టోన్‌ వికెట్ సాధించాడు. ఆ తర్వాత బ్యాటర్లను బట్టి వారి వీక్‌నెస్‌కు తగ్గ బౌలర్‌ను వాడాడు... 
 

99

శ్రేయాస్ అయ్యర్ లాంటి కెప్టెన్ ఉండడంతో కేకేఆర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. నా ఉద్దేశంలో కేకేఆర్ కచ్ఛితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. అయ్యర్ చాలా స్మార్ట్ కెప్టెన్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : జైలర్ దెబ్బ.. సీఎస్‌కేకు కోటి రూపాయల షాక్.. ధోని భాయ్ ఇప్పుడెలా !
Recommended image2
IPL : వార్నీ.. 5 పరుగులకే 5 వికెట్లు.. ఐపీఎల్ హిస్టరీలో టాప్ 5 బౌలింగ్ స్పెల్స్ ఇవే
Recommended image3
T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved