MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • అప్పుడు కెప్టెన్‌గా సచిన్ విషయంలో, ఇప్పుడు కోచ్‌గా జడేజా విషయంలో... రాహుల్ ద్రావిడ్‌ని ట్రోల్ చేస్తూ..

అప్పుడు కెప్టెన్‌గా సచిన్ విషయంలో, ఇప్పుడు కోచ్‌గా జడేజా విషయంలో... రాహుల్ ద్రావిడ్‌ని ట్రోల్ చేస్తూ..

టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించడం అంటే టీ20ల్లో సెంచరీ కొట్టడం కంటే గొప్ప విషయమే.. చాలామంది లెజెండరీ క్రికెటర్లకు కూడా ఈ డబుల్ సెంచరీ కోరిక తీరనేలేదు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులోనూ రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 05 2022, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జడ్డూతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, 96 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

రిషబ్ పంత్ సెంచరీ ముంగిట అవుటై నిరాశగా పెవిలియన్ చేరితే, రవీంద్ర జడేజా మాత్రం 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు...
 

310

కారణం రవీంద్ర జడేజా 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా...

410

జడ్డూకి డిక్లేర్ గురించి చెబితే, డబుల్ సెంచరీకి కావాల్సిన 25 పరుగులను ఒకే ఒక్క ఓవర్‌లో కొట్టేసేవాడే. లేదా మరో నాలుగైదు, ఓవర్లు ఆగి ఉంటే జడ్డూ ఖాతాలో ఆ ద్విశతకం చేరి ఉండేది...

510

అలా కాకుండా 130వ ఓవర్‌లో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే, ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.

610

అయితే ఈ నిర్ణయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పైనే ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ ఇలాగే డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు...

710

2004లో ముల్తాన్ టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేసి అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 348 బంతుల్లో 21 ఫోర్లతో 194 పరుగులతో క్రీజులో ఉన్నాడు...

810

మరో 6 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ అందుకుంటాడని అనుకుంటున్న సమయంలో వచ్చేయమంటూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు రాహుల్ ద్రావిడ్...

910

క్రీజులో ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా రాహుల్ ద్రావిడ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీ మిస్ అయినందుకు బాగా ఫీల్ అయ్యాడు...

1010

తాజాగా రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉండడంపై ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved