MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Shami : అనిల్ కుంబ్లే,జ‌హీర్ ఖాన్ రికార్డులు బ్రేక్.. చ‌రిత్ర సృష్టించిన ష‌మీ

Shami : అనిల్ కుంబ్లే,జ‌హీర్ ఖాన్ రికార్డులు బ్రేక్.. చ‌రిత్ర సృష్టించిన ష‌మీ

Mohammed Shami: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు గురువారం త‌న తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడింది. యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో మ‌హ్మ‌ద్ ష‌మీ అద్భుత‌మైన బౌలింగ్ తో రికార్డుల మోత మోగించాడు. 

3 Min read
Mahesh Rajamoni
Published : Feb 20 2025, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit: Getty Images

Image Credit: Getty Images

Mohammed Shami: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ టీమ్ తో ఆడింది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బంగ్లా టీమ్ పెద్ద స్కోర్ చేయ‌లేక‌పోయింది. చాలా కాలం త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చిన మ‌హ్మ‌ద్ ష‌మీ అద్భుత‌మైన బౌలింగ్ లో అద‌ర‌గొట్టాడు. బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకున్న ష‌మీ 5 వికెట్లు తీసుకుని రికార్డుల మోత మోగించాడు.

26
Mohammed Shami (Photo: ICC)

Mohammed Shami (Photo: ICC)

అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న భార‌త ప్లేయ‌ర్ గా ష‌మీ 

గురువారం (ఫిబ్రవరి 20) ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ వన్డే ఇంటర్నేషనల్స్‌లో (ODIs) 200 వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన భారత బౌలర్‌గా ఘ‌న‌త సాధించాడు. లెజెండ‌రీ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. 

కేవ‌లం 104వ వన్డే మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల మైలురాయిని సాధించాడు. గతంలో 133 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్న అజిత్ అగార్కర్ పేరిట ఉన్న జాతీయ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ లను అధిగమించాడు. పాకిస్తాన్‌కు చెందిన సక్లైన్ ముష్తాక్‌తో కలిసి షమీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ తన 102వ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Rohit Sharma: అయ్యో అక్ష‌ర్ హ్యాట్రిక్.. ఎంత‌ప‌నిచేశావ్ రోహిత్ భాయ్ !

36
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ష‌మీ 200వ వికెట్ గా జాకర్ అలీ

మ‌హ్మ‌ద్ ష‌మీ ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన ప్ర‌యాణంలో అనేక రికార్డులు న‌మోదుచేశాడు. 2019 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ష‌మీ తన 56వ మ్యాచ్‌లో 100 వన్డే వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. త‌ర్వాత 2022 జూలైలో 150 వన్డే వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన భారతీయుడిగా తన అద్భుతమైన ఫామ్‌ను ష‌మీ కొనసాగించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్‌లను అవుట్ చేయడంతో భారత పేసర్ తొలి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జాకర్ అలీని అవుట్ చేసి తన 200వ వికెట్‌ను అందుకున్నాడు. ఆ త‌ర్వాత కూడా త‌న బౌలింగ్ జోరును కొన‌సాగిస్తూ మ‌రో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో ష‌మీ 53 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. 

46
Mohammed Shami

Mohammed Shami

ఐసీసీ ట్రోఫీలంటే ష‌మీకి పూన‌కాలే ! 

2023 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో షమీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. త‌న బౌలింగ్ విశ్వ‌రూపం చూపిస్తూ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. 2023 ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా అతను 14 నెలలు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. భారత జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుండి తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చి అదే జోరును కొన‌సాగిస్తున్నాడు.

Glenn Philips: సూపర్‌మ్యాన్‌లా ఒంటిచేత్తో క‌ళ్లు చెదిరే క్యాచ్

56
Image Credit: Getty Images

Image Credit: Getty Images

అతి తక్కువ బంతులతో 200 వన్డే వికెట్లు తీసిన మహమ్మద్ షమీ

మిచెల్ స్టార్క్ అతి తక్కువ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించాడు. అయితే, షమీ అతి తక్కువ బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. భారత పేసర్ 5126 బంతుల్లో 200 వికెట్లు సాధించాడు. ఇది  స్టార్క్ కంటే 114 బంతులు త‌క్కువ‌, అలాగే సక్లైన్ ముష్తాక్ కంటే 325 తక్కువ.

66
Image Credit: Getty Images

Image Credit: Getty Images

వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్లు వీరే 

వన్డేల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 8వ భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. ప్రస్తుతం, అనిల్ కుంబ్లే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

అనిల్ కుంబ్లే - 334
జవగల్ శ్రీనాథ్ - 315
అజిత్ అగార్కర్ - 288
జహీర్ ఖాన్ - 269
హర్భజన్ సింగ్ - 265
కపిల్ దేవ్ - 253
రవీంద్ర జడేజా - 226
మహ్మద్ షమీ - 202
వెంకటేష్ ప్రసాద్ - 196
కుల్దీప్ యాదవ్ - 174

Champions Trophy: తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ఇజ్జ‌త్ అంతా పాయే !

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved