MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: అయ్యో అక్ష‌ర్ హ్యాట్రిక్.. ఎంత‌ప‌నిచేశావ్ రోహిత్ భాయ్ !

Rohit Sharma: అయ్యో అక్ష‌ర్ హ్యాట్రిక్.. ఎంత‌ప‌నిచేశావ్ రోహిత్ భాయ్ !

Rohit Sharma drops Jaker Ali's catch: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జాకర్ అలీ క్యాచ్‌ను డ్రాప్ చేయడంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 20 2025, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Rohit Sharma Drops Catch

Rohit Sharma Drops Catch

Rohit Sharma drops Jaker Ali's catch: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు గురువారం త‌న తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడుతోంది. యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

అద్భుత‌మైన బౌలింగ్ తో భార‌త ప్లేయ‌ర్లు అద‌ర‌గొట్టారు. బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. వ‌రుస వికెట్లు తీసుకుని బంగ్లాకు షాక్ ఇచ్చారు. మ‌రీ ముఖ్యంగా అక్ష‌ర్ ప‌టేల్ త‌న స్పిన్ మాయాజాలంలో అద్భుత‌మే చేశాడు. వ‌రుస‌గా వికెట్లు తీసుకున్నాడు. అయితే, రోహిత్ శ‌ర్మ చేసిన మిస్టేక్ కార‌ణంగా అక్ష‌ర్ ప‌టేల్ హ్యాట్రిక్ మిస్స‌య్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
Image Credit: Getty Images

Image Credit: Getty Images

అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ 

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి తాంజిద్ హసన్ (25)ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. ఆ బంతి బ్యాట్ కు తగిలిన సౌండ్ కూడా అక్షర్ పటేల్ వినిపించలేదు. దీంతో అప్పీల్ కూడా చేయలేదు. కానీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అప్పీల్ చేయడంలో అంపైర్ కొద్ది సేపటికి ఔట్ ఇచ్చారు.

ఆ తర్వాత ఎంత స్పీడ్ గా వచ్చాడో అంతే వేగంగా క్రీజును వదిలాడు ముష్ఫికర్ ర‌హీమ్. అద్భుతమైన బాల్ తో అక్ష‌ర్ పటేల్ రహీమ్ ను బోల్తా కొట్టించాడు. అతను కూడా కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ అకాశం వచ్చింది. 

ఆ తర్వాత జాకర్ అలీ క్రీజులోకి వ‌చ్చాడు. అక్ష‌ర్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌గా బంతి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దగ్గరకు వెళ్లింది.  సింపుల్ గా వచ్చిన క్యాచ్‌ను రోహిత్ శ‌ర్మ జార‌విడిచాడు. దీంతో అక్ష‌ర్ ప‌టేల్ హ్యాట్రిక్ మిస్ అయింది. రోహిత్ శ‌ర్మ సైతం క్యాచ్ మిస్ కావ‌డంతో త‌న చేతిని గ్రౌండ్ పై కొడుతూ ఆగ్రహంగా కనిపించాడు. ఆ తర్వాత వెంటనే చేతులు జోడించి అతనికి క్షమాపణ చెప్పాడు. 22 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. 

రోహిత్ శర్మ మిస్ చేసిన క్యాచ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
పాకిస్తాన్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved