Champions Trophy: తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ఇజ్జత్ అంతా పాయే !
Pakistan vs New Zealand: కరాచీలోని నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్-న్యూజిలాండ్ తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్ లో చేసిన ఒక పనితో పాక్ తన ఇజ్జత్ పోగొట్టుకుంది.

Image Credit: Getty Images
Pakistan vs New Zealand: పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగింది. సొంత గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ తన వక్రబుద్దిని చూపించి ఇజ్జత్ అంతా పోగొట్టుకుంది.
లైవ్ మ్యాచ్‌లో ఆ జట్టు తొండాటను చూసి అభిమానులే కాదు, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కూడా షాక్ అయ్యారు. బంతి బౌండరీ తాడును తాకినప్పటికీ ఫోర్ గా ఒప్పుకోలేదు. పాకిస్తాన్ స్టార్ హారిస్ రౌఫ్ కూడా బౌండరీ వద్ద తన చేతితో బంతిని తాకినట్లు అంగీకరించడానికి నిరాకరించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
అసలు ఏం జరిగింది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ఆ తర్వాత విల్ యాంగ్ న్యూజిలాండ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అతను 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు అద్భుతమైన షాట్ ఆడాడు, అది హారిస్ రవూఫ్‌కి బాల్ ను పట్టుకోవడం ఛేజింగ్‌గా మారింది. ఇంతలో విల్ యంగ్ 3 పరుగులు చేసారు. అయితే, రివ్యూలో చూసినప్పుడు ఫీల్డర్ చేసిన పనితో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అది బౌండరీ లైన్ ను తాకింది.
Pakistan vs New Zealand
రివ్యూలో హారిస్ రౌఫ్ బాల్ ను పట్టుకోవడానికి పరుగుపెట్టాడు. బౌండరీ లైన్ వద్ద బాల్ ను తీసుకుని విసిరాడు. కానీ బంతిని అందుకునే సమయంలో రవూఫ్ చేయి, బాల్ బౌండరీ తాడును తాకాయి. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పాకిస్తాన్ తన వక్రబుద్దిని ఇక్కడ కూడా చూపించిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది.
పాక్ ను చిత్తుచేసిన న్యూజిలాండ్
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ సూపర్ విక్టరీ అందుకుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌తో ఈ ఐసీసీ టోర్నీలో తొలి మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ బౌలింగ్ ను చిత్తు చేశారు.
విల్ యంగ్, టామ్ లాథమ్ లు సూపర్ బ్యాటింగ్ తో సెంచరీలు, గ్లెన్ ఫిలిప్స్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాకిస్తాన్ పై కీవీస్ జట్టు 50 ఓవర్లలో 320/5 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై కివీస్ విజయం సాధించింది. బాబార్ ఆజం ఏకంగా 90 బంతులు ఆడి 64 పరుగులు, ఫఖర్ జమాన్ 41 బంతులు ఆడి 21 పరుగులతో పెవిలియన్ కు చేరారు. దీంతో సాధించాల్సిన రన్ రేటు పెరిగిపోయింది. సల్మాన్ ఆఘా 42 పరుగులు, ఖుష్దిల్ షా 69 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మరో ఎండ్ లో వికెట్లు పడటం కొనసాగింది. దీంతో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది.