MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • టీమిండియా సీనియర్లకు టీ20 వరల్డ్ కప్ దెబ్బ... ఈ ఐదుగురి రిటైర్మెంట్ ఖాయం..!

టీమిండియా సీనియర్లకు టీ20 వరల్డ్ కప్ దెబ్బ... ఈ ఐదుగురి రిటైర్మెంట్ ఖాయం..!

టీీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత టీమిండియా సీనియర్లకు తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం… యంగ్ ప్లేయర్స్ కే ఇకపై ఎక్కువగా అవకాశాలు దక్కవచ్చు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్లు రిటైర్మెంట్ కు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 16 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రిటైర్ కాబోయే టీమిండియా ప్లేయర్స్..
Image Credit : AFP

రిటైర్ కాబోయే టీమిండియా ప్లేయర్స్..

Team India Players Retirement : టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 విజయం చాలా ప్రత్యేకమైంది. గతంతో గెలిచిన రెండు టీ20 వరల్డ్ కప్స్ విదేశీ గడ్డలపైనే... కానీ ఇప్పుడు గెలిచింది స్వదేశంలో... సొంత ప్రేక్షకుల మధ్య ట్రోఫీని అందుకోవడం కంటే ఆనందం ఇంకేముంటుంది. అందుకే ఈ విజయం ఆటగాళ్లకే కాదు అభిమానులకు కూడా చాలా స్పెషల్.

అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కొందరు టీమిండియా ఆటగాళ్ళ పీడకలలా మారింది. వాళ్ల కెరీర్ ను దాదాపు ఖతం చేసింది... రిటైర్మెంట్ కు బాటలు వేసింది. ఇలా యువ టీమిండియాతో పోటీ పడలేక కొందరు సీనియర్లు రిటైర్మెంట్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ తో రిటైరయ్యే అవకాశాలున్న ఆటగాళ్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. మహ్మద్ షమీ...
Image Credit : Getty

1. మహ్మద్ షమీ...

ఇటీవల కాలంలో మహ్మద్ షమీ రిటైర్మెంట్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి... ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ప్రచారం మరింత పెరిగింది. తీవ్ర గాయాలు, ఫామ్ కోల్పోవడంతో అతడు ఇబ్బందిపడతున్నాడు... వ్యక్తిగత సమస్యలూ అతడిని వెంటాడుతున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇకపై కూడా అతడు మైదానంలో కనిపించే అవకాశాలు లేవనే ప్రచారం జోరుగా సాగుతోంది.

టీ20 వరల్డ్ కప్ 2026 విజయంతో టీమిండియా మేనేజ్మెంట్ కు యువ జట్టుపై నమ్మకం పెరిగింది.. ఈ క్రమంలోనే సీనియర్లను పక్కనబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఒకరిద్దరు స్టార్ ప్లేయర్లు మినహా పూర్తిగా యువకులనే ఆడించాలని భావిస్తోందట. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన షమీ తిరిగివచ్చే అవకాశాలు కనిపించడంలేదు... అందుకే అతడు గౌరవప్రదంగా రిటైర్మెంట్ ఇచ్చి తప్పుకుంటాడనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

Related image1
T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
Related image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
36
2. ఇషాంత్ శర్మ
Image Credit : Getty

2. ఇషాంత్ శర్మ

టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇంటర్నేషన్ కెరీర్ కు కూడా ఈ టీ20 వరల్డ్ కప్ ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి. ఈ ఫాస్ట్ బౌలర్ గతంలో భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు... కానీ ప్రస్తుతం గాయాలు, ఫామ్ కోల్పోయి జట్టుకు దూరంగా ఉన్నాడు. 2021 నుండి అంటే దాదాపు ఐదేళ్ళుగా అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు... కేవలం ఐపిఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొనసాగాలని... తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడట ఇషాంత్ శర్మ. కానీ టీ20 వరల్డ్ కప్ లో యువకులతో కూడిన జట్టు అద్భుత విజయం సాధించడంతో వన్డే వరల్డ్ కప్ టీంలో చోటుపై ఆశలు ఆవిరయ్యాయి. అందుకే ఇషాంత్ శర్మ త్వరలోనే అన్ని ఫార్మాట్స్ కి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

46
అజింక్య రహానే..
Image Credit : Getty

అజింక్య రహానే..

టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే కూడా రిటైర్మెంట్ ప్లాన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం చాలా మంది యంగ్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు... వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు... ఇందుకు ఈ టీ20 వరల్డ్ కప్ ప్రదర్శనే నిదర్శనం. సెలక్టర్లు కూడా జట్టు భవిష్యత్తు కోసం యంగ్ ప్లేయర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య మళ్లీ రహానేకు టీమిండియాలో చోటు అంటే కష్టమే. కాబట్టి అతడే రిటైర్మెంట్ ప్రకటించి గౌరప్రదంగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

అజింక్య రహానే భారత జట్టు తరపున మూడు ఫార్మాట్లలో కలిపి 8 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్ లో 85 మ్యాచ్ లలో 12 సెంచరీలతో 5,077 పరుగులు, వన్డే క్రికెట్ లో 90 మ్యాచ్ లలో 3 సెంచరీలతో 2,962 పరుగులు చేశారు. టీ20 ఇంటర్నేషనల్ లో 20 మ్యాచుల్లో 375 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ లో రహానే 198 మ్యాచ్‌లు ఆడి 5,032 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

56
భువనేశ్వర్ కుమార్...
Image Credit : Getty

భువనేశ్వర్ కుమార్...

టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2022 నుండి జట్టుకు దూరంగా ఉన్నాడు... కానీ 2027 వన్డే వరల్డ్ కప్ లో చోటుకోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2026 లో యంగ్ ఇండియన్ టీం విజయం సాధించడంతో అతడి ఆశలు ఆవిరయ్యాయి.. అందుకే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐపిఎల్ లో మాత్రం భువనేశ్వర్ కొనసాగనున్నాడు.

66
సూర్యకుమార్ యాదవ్...
Image Credit : Getty

సూర్యకుమార్ యాదవ్...

టీమిండియాకు మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ తర్వాత మూడో టీ20 వరల్డ్ కప్ అందించిన ఘనత సూర్యకుమార్ యాదవ్ ది. కానీ ఇదే అతడి చివరి వరల్డ్ కప్ అని... త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఈ రిటైర్మెంట్ ప్రచారాన్ని సూర్య ఖండించాడు. 

అయితే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సూర్యను టీమిండియా మేనేజ్మెంట్ తప్పించే అవకాశాలున్నాయని... అతడు ఆడాలనుకున్నా ఆడించపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఒత్తిడి తీసుకువచ్చి రిటైర్మెంట్ ప్రకటించేలా చేశారు... ఇదే పరిస్థితి సూర్యకుమార్ యాదవ్ కు కూడా వస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
Recommended image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved