MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్ల తప్పేం లేదు, అందుకే డిక్లేర్ చేయమని చెప్పాను... క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా...

వాళ్ల తప్పేం లేదు, అందుకే డిక్లేర్ చేయమని చెప్పాను... క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా...

రవీంద్ర జడేజా 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నిర్ణయం తీసుకోవడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెడ్ కోచ్ ద్రావిడ్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు చేశారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...  

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 05 2022, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, 25 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

రవీంద్ర జడేజా 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా...

310

జడ్డూకి డిక్లేర్ గురించి చెబితే, డబుల్ సెంచరీకి కావాల్సిన 25 పరుగులను ఒకే ఒక్క ఓవర్‌లో కొట్టేసేవాడని, లేదా మరో నాలుగైదు, ఓవర్లు ఆగి ఉంటే జడ్డూ ఖాతాలో ఆ ద్విశతకం చేరి ఉండేదని కామెంట్లు చేశారు నెటిజన్లు..

410

ఇన్నింగ్స్ 130వ ఓవర్‌లో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే, డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.

510

ఈ నిర్ణయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పైనే ఎక్కువ విమర్శలు వినిపించాయి. కారణం ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ ఇలాగే డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు...

610

2004లో ముల్తాన్ టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేసి అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 348 బంతుల్లో 21 ఫోర్లతో 194 పరుగులతో క్రీజులో ఉన్నాడు...

710

మరో 6 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ అందుకుంటాడని అనుకుంటున్న సమయంలో వచ్చేయమంటూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు రాహుల్ ద్రావిడ్...

810

క్రీజులో ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా రాహుల్ ద్రావిడ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీ మిస్ అయినందుకు బాగా ఫీల్ అయ్యాడు...

910

జడేజా మాత్రం తాను డబుల్ సెంచరీ కోసం చూడలేదని, తానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సిందిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి సందేశం పంపినట్టు కామెంట్ చేశాడు...

1010

‘ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సిందిగా నేనే చెప్పాను. అప్పటికే శ్రీలంక ప్లేయర్లు బాగా అలిసిపోవడాన్ని గమనించాను. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, త్వరగా వికెట్లు తీయవచ్చని చెప్పాను...’ అంటూ క్లారిటీ ఇచ్చాడు రవీంద్ర జడేజా...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved