MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 9 ఏళ్ల తర్వాత తొలిసారిగా... అజింకా రహానే, పూజారా లేకుండా టెస్టు బరిలో టీమిండియా...

9 ఏళ్ల తర్వాత తొలిసారిగా... అజింకా రహానే, పూజారా లేకుండా టెస్టు బరిలో టీమిండియా...

భారత టెస్టు టీమ్‌లో కీలక ప్లేయర్లుగా మారిపోయారు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా. అయితే రెండేళ్లుగా ఈ ఇద్దరి పర్ఫామెన్స్ దారుణంగా పడిపోతూ ఉండడంతో లంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి అజింకా రహానే, పూజారాలను తప్పించిన విషయం తెలిసిందే..

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Mar 03 2022, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఇద్దరూ లేకుండా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి...

210

2012లో ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో చివరిసారిగా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా లేకుండా టెస్టు మ్యాచ్ బరిలో దిగింది భారత జట్టు...

310

ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, టెస్టుల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. 213 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్...

410

భారత తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 272 పరుగులకి ఆలౌట్ కాగా, వృద్ధిమాన్ సాహా 35, గౌతమ్ గంభీర్ 34 పరుగులు చేసి విరాట్ తర్వాత టాప్ స్కోరర్లుగా నిలిచారు..

510

ఆ మ్యాచ్‌లో భారత జట్టు 298 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడినా, టెస్టుల్లో విరాట్ కోహ్లీ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోగలిగాడు...

610

2013, మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన అజింకా రహానే, 82 టెస్టుల్లో 38.52 సగటుతో 4931 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి...

710

కెరీర్ ఆరంభంలో 45+ సగటుతో టెస్టుల్లో పరుగులు చేసిన అజింకా రహానే, గత మూడేళ్లుగా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఈ కారణంగా రహానే టెస్టు సగటు పడిపోతూ వచ్చింది...

810

2010లో ఆస్ట్రేలియాపైనే టెస్టు ఆరంగ్రేటం చేసిన ఛతేశ్వర్ పూజారా, ఇప్పటిదాకా 95 టెస్టు మ్యాచులు ఆడి 43.88 సగటుతో 6,713 పరుగులు చేశాడు...

910

18 టెస్టు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా కెరీర్‌లో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి...

1010

చివరిసారిగా పూజారా, రహానే లేకుండా భారత జట్టు ఆడిన టెస్టులో కోహ్లీ సెంచరీ చేయడంతో ఈసారి కూడా విరాట్ బ్యాటు నుంచి అలాంటి ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Recommended image3
SRH : సన్‌రైజర్స్ కావ్యా మారన్ షాకింగ్ డెసిషన్.. పాక్ ప్లేయర్‌కు రూ. 2.34 కోట్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved