MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Careers
  • 8th Pay Commission : ఉద్యోగుల శాలరీ డబుల్ కాదు ట్రిపుల్.. ఇప్పుడు ఎంతుంటే పెరిగాక ఎంతొస్తుంది..? కొత్త లెక్కలివే

8th Pay Commission : ఉద్యోగుల శాలరీ డబుల్ కాదు ట్రిపుల్.. ఇప్పుడు ఎంతుంటే పెరిగాక ఎంతొస్తుంది..? కొత్త లెక్కలివే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఈ డిమాండ్లను ఒప్పుకుంటే జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 16 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిట్మెంట్ 3.83 ఇస్తే బేసిక్ శాలరీ ఎంతవుతుంది..?
Image Credit : Gemini

ఫిట్మెంట్ 3.83 ఇస్తే బేసిక్ శాలరీ ఎంతవుతుంది..?

ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83గా ఉంచాలని ఉద్యోగ సంఘాలు (NC-JCM) ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. 7వ వేతన సంఘంలో ఇది 2.57గా ఉండేది.. దానితో కనీస జీతం రూ.18,000 అయింది. ఒకవేళ 8వ వేతన సంఘం 3.83 ఫ్యాక్టర్ అమలుచేస్తే ప్రభుత్వ ఉద్యోగి కనీస బేసిక్ జీతం రూ.18,000 నుంచి నేరుగా రూ.69,000కి పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎంత శాలరీ ఎంతవుతుంది..?
Image Credit : Gemini

ఎంత శాలరీ ఎంతవుతుంది..?

రూ.18,000 (కనీస జీతం) : మీ బేసిక్ పే ఇప్పుడు రూ.18,000 అయితే అది రూ.69,000కి పెరుగుతుంది.

రూ.25,000 బేసిక్ పే : ప్రస్తుతం రూ.25,000 బేసిక్ జీతం ఉన్నవారికి కొత్త జీతం రూ.95,750 అవుతుంది.

రూ.30,000 బేసిక్ పే : మీ ప్రస్తుత బేసిక్ పే రూ.30,000 అయితే 8వ వేతన సంఘం తర్వాత ఇది రూ.1,14,900 అవుతుంది.

రూ.40,000 బేసిక్ పే : రూ.40,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగుల కొత్త జీతం రూ.1,53,200కి చేరుకుంటుంది.

రూ.50,000 బేసిక్ పే : ప్రస్తుతం రూ.50,000 బేసిక్ పే ఉన్నవారి కొత్త జీతం రూ.1,91,500కి పెరుగుతుంది.

35
ఒకేసారి లక్షలకు లక్షలు..
Image Credit : Getty

ఒకేసారి లక్షలకు లక్షలు..

8వ వేతన సంఘంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ప్రభుత్వం 2026 చివర్లో లేదా 2027లో ప్రకటించినా, జనవరి 2026 నుంచి అమలు తేదీ వరకు పూర్తి డబ్బు మీకు ఏకమొత్తంలో అరియర్స్ (బకాయిలు) రూపంలో వస్తుంది. ఈ మొత్తం లక్షల్లో ఉండొచ్చు..!

45
పెన్షనర్లకూ లాభమే..
Image Credit : ChatGPT

పెన్షనర్లకూ లాభమే..

కేవలం ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా శుభవార్తే. చివరి జీతంలో 67% పెన్షన్‌గా ఇవ్వాలనేది డిమాండ్. ఇది నిజమైతే ఈ ద్రవ్యోల్బణ కాలంలో వృద్ధులకు పెన్షన్ భారీగా పెరిగి, పెద్ద ఆసరాగా నిలుస్తుంది.

55
ఉద్యోగుల డిమాండ్స్ ఇవే...
Image Credit : Gemini AI

ఉద్యోగుల డిమాండ్స్ ఇవే...

వార్షిక ఇంక్రిమెంట్ : ప్రతి సంవత్సరం జీతంలో 3% బదులు 6% పెంపు ఉండాలి.

 HRA : ఇంటి అద్దె భత్యం (HRA) కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

OPS: పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది.

రిపోర్టుల ప్రకారం.. ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రభుత్వం నుంచి పిట్ మెంట్ స్పష్టమైన సమాచారం వెలువడవచ్చు. అయితే ప్రభుత్వం 3.83 ఫ్యాక్టర్‌కు బదులుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కొంచెం తగ్గించవచ్చు. అయినప్పటికీ జీతాల్లో చారిత్రక పెరుగుదల ఖాయమని భావిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ప్రభుత్వ పథకాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
8th Pay Commission Jobs : నెలకు 6 రోజులే పని, లక్షల్లో శాలరీ.. ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ విభాగంలో జాబ్
Recommended image2
8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved