MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Jobs
  • Bank Jobs
  • SBI Jobs: ఎస్‌బీఐ లో 7150 జాబ్స్.. సొంత జిల్లాలోనే పోస్టింగ్.. వెంటనే అప్లై చేయండి

SBI Jobs: ఎస్‌బీఐ లో 7150 జాబ్స్.. సొంత జిల్లాలోనే పోస్టింగ్.. వెంటనే అప్లై చేయండి

SBI Recruitment 2026: డిగ్రీ అర్హతతో 7150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు జూన్ 8 లోగా అప్లై చేసుకోండి. సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. పూర్తి వివరాలు మీకోసం..

4 Min read
Author : Mahesh Rajamoni
Published : May 24 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్‌బీఐలో బంపర్ ఆఫర్.. సొంత ఊర్లోనే బ్యాంక్ జాబ్
Image Credit : Gemini

ఎస్‌బీఐలో బంపర్ ఆఫర్.. సొంత ఊర్లోనే బ్యాంక్ జాబ్

బ్యాంకింగ్ రంగంలో సెటిల్ అవ్వాలని కలలు కనే యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీ దగ్గర ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో కెరీర్ స్టార్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఇది.

మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు ఇందులో భారీగా ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే 2026 మే 19న స్టార్ట్ అయింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జూన్ 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే మొత్తం 7,150 పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దభాగం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో 709 ఖాళీలు, తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి. మన లోకల్ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు:

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 97 పోస్టులు ఉన్నాయి. అలాగే కృష్ణా 61, ఏలూరు 53, పశ్చిమ గోదావరి 53, విశాఖపట్నం 45, అనకాపల్లి 35, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు 32, తూర్పు గోదావరి 30, చిత్తూరు 30, వైఎస్ఆర్ కడప 27, తిరుపతి 26, గుంటూరు 20, విజయనగరం 20, కాకినాడ 19, అన్నమయ్య 19, శ్రీకాకుళం 18, పల్నాడు 17, కర్నూలు 16, ప్రకాశం 15, అనంతపురం 14, నంద్యాల 13, శ్రీ సత్య సాయి 12, కోనసీమ 11, పార్వతీపురం మన్యం 10, అల్లూరి సీతారామ రాజు 8, బాపట్ల లో 8 ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణ జిల్లాలు:

నల్గొండ జిల్లాలో అత్యధికంగా 75 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఖమ్మం 64, సూర్యాపేట 53, మహబూబ్‌నగర్ 50, నాగర్ కర్నూల్ 26, రంగారెడ్డి 22, వనపర్తి 21, నారాయణపేట 17, యాదాద్రి 16, నిజామాబాద్ 16, జోగులాంబ గద్వాల్ 15, మేడ్చల్ మల్కాజ్‌గిరి 12, హైదరాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 8, కరీంనగర్ 8, హనుమకొండ 6, వరంగల్ 6, సిద్దిపేట 6, మంచిర్యాల 6, నిర్మల్ 5, ఆదిలాబాద్ 5, కామారెడ్డి 5, సంగారెడ్డి 4, మెదక్ 4, జగిత్యాల 4, వికారాబాద్ 4, మహబూబాబాద్ 3, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 2, జనగాం 2, రాజన్న సిరిсиల్ల 2, వరంగల్ అర్బన్ 2, జయశంకర్ భూపాలపల్లి 1, ములుగు 1, వరంగల్ రూరల్ లో 1 ఖాళీ ఉన్నాయి.

Related Articles

Related image1
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Related image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
35
SBI Jobs:అర్హతలు, వయస్సు ఎంత ఉండాలి? స్టైపెండ్ ఎంత ఇస్తారు?
Image Credit : Getty

SBI Jobs:అర్హతలు, వయస్సు ఎంత ఉండాలి? స్టైపెండ్ ఎంత ఇస్తారు?

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు విషయానికి వస్తే.. కనీసం 20 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈవయోపరిమితి అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యుబీడీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ఇక సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో అప్రెంటిస్‌లకు ప్రతి నెల రూ.15,000 స్టైపెండ్ ఇస్తారు. ఒక ఏడాది పాటు మాత్రమే ఈ స్టైపెండ్ లభిస్తుంది. ఇది ప్యూర్ గా అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కాబట్టి, ఇతర అలవెన్సులు లేదా అదనపు ప్రయోజనాలు ఏవీ ఉండవు. కానీ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోవడానికి ఇది సూపర్ అప్డేట్.

45
సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి?
Image Credit : stockPhoto

సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి?

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీని కోసం రెండు స్టేజీల ప్రాసెస్ ఉంటుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ 2026 జూలై నెలలో జరిగే అవకాశం ఉంది.

ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎగ్జామ్ రాయడానికి కేవలం 60 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి..

1. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్‌నెస్

2. జనరల్ ఇంగ్లీష్

3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

4. రీజనింగ్ అబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్

ఈ రాత పరీక్ష పాసయ్యాక, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు స్థానిక భాష అయిన తెలుగుపై ఉన్న పట్టును పరిశీలించడానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. ఒకవేళ మీ టెన్త్ లేదా ఇంటర్ లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే, ఈ లాంగ్వేజ్ టెస్ట్ నుండి మినహాయింపు లభించే ఛాన్స్ ఉంది.

ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ అంటే:

• ఆంధ్రప్రదేశ్‌లో: చిరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు.

• తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

55
SBI Jobs:ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా? అప్లికేషన్ ఫీజు ఎంత?
Image Credit : Getty

SBI Jobs:ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా? అప్లికేషన్ ఫీజు ఎంత?

ఈ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒక ముఖ్యమైన రూల్ ఫాలో అవ్వాలి. నేరుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో అప్లై చేయడానికి కుదరదు. మొదట కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఏపీఎస్ (NAPS) పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

1.NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్:మొదటి స్టెప్.

ఎన్‌ఏపీఎస్ పోర్టల్ https://apprenticeshipindia.gov.in లో మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.

2.ఎస్‌బీఐ కెరీర్స్ పోర్టల్ విజిట్:రెండో స్టెప్.

ఎన్‌ఏపీఎస్ రిజిస్ట్రేషన్ ఐడీ వచ్చిన తర్వాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ కెరీర్స్ వెబ్‌సైట్ https://www.sbi.co.in/careers లేదా sbi.co.in సందర్శించండి.

3.లింక్ క్లిక్ చేయడం:మూడో స్టెప్.

హోంపేజీలో ఉన్న ‘Join SBI’ సెక్షన్‌లోకి వెళ్లి, అక్కడ కనిపించే ‘SBI Apprentice Recruitment 2026’ లింక్‌పై క్లిక్ చేయాలి.

4.దరఖాస్తు ఫారమ్ నింపడం:నాల్గో స్టెప్.

మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎన్‌ఏపీఎస్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ కంప్లీట్ చేయండి. మీ ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి.

5.ఫీజు చెల్లింపు & సబ్మిట్:చివరి స్టెప్.

మీ కేటగిరీని బట్టి ఆన్‌లైన్ మోడ్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించండి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ రసీదును ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి.

అప్లికేషన్ ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు, వీరికి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
విద్య
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్
Recommended image2
Bank Jobs : తెలుగు యువతకు ఈ అర్హతలుంటే చాలు... ప్రభుత్వరంగ బ్యాంకులో ఈజీగా ఉద్యోగాలు
Recommended image3
Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
Related Stories
Recommended image1
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Recommended image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved