MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Jobs
  • 8th Pay Commission Jobs : నెలకు 6 రోజులే పని, లక్షల్లో శాలరీ.. ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ విభాగంలో జాబ్

8th Pay Commission Jobs : నెలకు 6 రోజులే పని, లక్షల్లో శాలరీ.. ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ విభాగంలో జాబ్

8th Pay Commission Jobs : 8వ వేతన సంఘం తాత్కాలిక ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల అర్హతలు, జీతం వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 14 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
8వ పే కమిషన్‌లో ఉద్యోగావకాశాలు
Image Credit : Getty

8వ పే కమిషన్‌లో ఉద్యోగావకాశాలు

మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? మంచి జీతం కూడా కావాలా.? అయితే ఈ వార్త మీకోసమే. 8వ వేతన సంఘం (పే కమిషన్‌)లో పనిచేసే అద్భుతమైన అవకాశం వచ్చింది. నెలకు కేవలం 6 రోజులు పనిచేసినా చాలు.. చేతినిండా డబ్బులు సంపాదించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
Image Credit : Getty

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఏప్రిల్ 10, 2026 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులపై అధ్యయనం చేయడానికి నిపుణులు అవసరం. అనుభవం, వయసు ఆధారంగా మూడు కేటగిరీలలో నియామకాలు చేపడుతున్నారు. మీ వయసు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటే, అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.

37
ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
Image Credit : Getty

ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి?

8వ పే కమిషన్‌లో సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. సీనియర్ కన్సల్టెంట్‌కు 10 ఏళ్ల అనుభవం, గరిష్ట వయసు 45 ఏళ్లు. కన్సల్టెంట్‌కు 6 ఏళ్ల అనుభవం, గరిష్ట వయసు 40 ఏళ్లు. యంగ్ ప్రొఫెషనల్‌కు 4 ఏళ్ల అనుభవం, గరిష్ట వయసు 32 ఏళ్లు. వయసు, అనుభవాన్ని ఏప్రిల్ 1, 2026 నాటికి లెక్కిస్తారు.

47
జీతం ఎంత ఉంటుంది?
Image Credit : Getty

జీతం ఎంత ఉంటుంది?

ఈ ఉద్యోగంలో జీతం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఫుల్-టైమ్ లేదా పార్ట్-టైమ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సీనియర్ కన్సల్టెంట్‌కు ఫుల్-టైమ్ జాబ్‌కు నెలకు ₹1,80,000 జీతం. నెలకు 12 రోజులు పనిచేస్తే ₹90,000, 6 రోజులు పనిచేస్తే ₹45,000 ఇస్తారు. కన్సల్టెంట్‌కు ఫుల్-టైమ్ జీతం ₹1,20,000. పార్ట్-టైమ్‌కు వరుసగా ₹60,000 (12 రోజులు), ₹30,000 (6 రోజులు). యంగ్ ప్రొఫెషనల్స్‌కు ఫుల్-టైమ్‌కు ₹90,000, 12 రోజులకు ₹45,000, 6 రోజులకు ₹22,500 చెల్లిస్తారు.

57
ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికమే
Image Credit : X

ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికమే

ఈ ఉద్యోగాలకు మీరు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కమిషన్‌లోని సీనియర్ అధికారుల బృందం మీ దరఖాస్తును పరిశీలిస్తుంది. అర్హులైన వారిని నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే, పర్మనెంట్ కాదని గుర్తుంచుకోండి.

67
మీరు చేయాల్సిన పని ఏంటి?
Image Credit : Gemini

మీరు చేయాల్సిన పని ఏంటి?

ఎంపికైన ప్రొఫెషనల్స్ 8వ పే కమిషన్‌కు సహాయం చేయాలి. ఉద్యోగుల జీతాల స్వరూపాన్ని విశ్లేషించడం, పాత డేటాను అధ్యయనం చేయడం, న్యాయపరమైన అంశాలను పరిశీలించడం, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి డేటా సేకరించడం వంటి పనులు ఉంటాయి. అంటే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెంచాలో నిర్ణయించడంలో మీరు సహాయపడతారు.

77
ఇతర సదుపాయాలు ఏంటి?
Image Credit : Gemini

ఇతర సదుపాయాలు ఏంటి?

ఈ ఉద్యోగంలో జీతం తప్ప ఇతర అలవెన్సులు ఉండవు. డీఏ, ఇంటి అద్దె (HRA), వైద్య ఖర్చులు, ఫోన్ బిల్లు వంటివి ఇవ్వరు. కమిషన్ ఆఫీసులో పనిచేయడానికి స్థలం మాత్రమే ఇస్తారు, ల్యాప్‌టాప్, ఫోన్ వంటివి మీరే సమకూర్చుకోవాలి. మీ పనితీరు బాగాలేకపోయినా, క్రమశిక్షణ తప్పినా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే కమిషన్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. రీసెర్చ్, డేటా అనాలిసిస్‌లో అనుభవం ఉంటే, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి వెంటనే అప్లై చేయండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్
Recommended image3
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Related Stories
Recommended image1
Govt Jobs : టెన్త్ పాస్ అయితే చాలు.. ఆర్మీ, నేవీలో భారీ ఉద్యోగాల జాతర! వెంటనే అప్లై చేయండి
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved