MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • 8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?

8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?

8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రశ్నపత్రంపై నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) 9 కీలక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. పాత పెన్షన్ పునరుద్ధరణ, మహిళా ఉద్యోగుల సంక్షేమం, గడువు పెంపు వంటి ప్రధాన డిమాండ్లను లేఖలో పేర్కొంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 03 2026, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
8వ పే కమిషన్ బిగ్ అప్‌డేట్: ఉద్యోగుల కోసం 9 కీలక మార్పులు
Image Credit : Gemini

8వ పే కమిషన్ బిగ్ అప్‌డేట్: ఉద్యోగుల కోసం 9 కీలక మార్పులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Central Pay Commission) పక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో, నేషనల్ కౌన్సిల్ (స్టాఫ్ సైడ్) జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కీలక అడుగు వేసింది. జీతాలు, పెన్షన్లు, ఉపాధికి సంబంధించి 8వ వేతన సంఘం జారీ చేసిన 18 ప్రశ్నల ప్రశ్నావళిపై NC-JCM తన అభ్యంతరాలను, పలు ప్రతిపాదనలను తెలిపింది.

ఏప్రిల్ 1న నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా, 8వ వేతన సంఘం మెంబర్ సెక్రటరీ పంకజ్ జైన్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మొత్తం 9 ప్రధాన ఆందోళనలను ప్రస్తావించారు. ఉద్యోగుల సంయుక్త మెమోరాండం సమర్పించే ముందు ఈ మార్పులు చేయాలని కోరారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పెన్షనర్ల సమస్యల గుర్తింపు
Image Credit : ChatGPT

పెన్షనర్ల సమస్యల గుర్తింపు

కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయిన పెన్షనర్ల పాత్రను, వారి ఆర్థిక భద్రతను తక్కువ అంచనా వేయలేమని NC-JCM పేర్కొంది. ప్రస్తుత ప్రశ్నావళిలో పెన్షనర్ల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని కోరింది. ముఖ్యంగా పెన్షన్ రివిజన్, పెన్షన్లలో సమానత్వం, కమ్యూటెడ్ పెన్షన్ విలువ పునరుద్ధరణ, పెన్షనర్ల సంక్షేమ చర్యల కోసం ప్రత్యేక నిబంధనలను చేర్చాలని డిమాండ్ చేసింది.

Related Articles

Related image1
Gratuity : ఉద్యోగులకు పండగే.. ఇక ఐదేళ్లు అక్కర్లేదు, ఏడాదికే గ్రాట్యుటీ.. కొత్త రూల్స్ ఇవే
Related image2
57 వేల కోట్ల అప్పుల దివాలా కంపెనీ కోసం అదానీ, వేదాంత ఎందుకు ఫైట్ చేస్తున్నాయి?
37
పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ
Image Credit : Gemini

పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ

ప్రస్తుతం అమలులో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), కొత్తగా ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలకు వ్యతిరేకంగా ఉన్నారని, పెన్షన్ రూల్స్ 1972 (ప్రస్తుతం 2021) ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని బలంగా కోరుతున్నారు. దీనిపై అభిప్రాయాలను సేకరించేందుకు ప్రశ్నావళిలో అవకాశం కల్పించాలని కోరారు.

47
మహిళా ఉద్యోగుల సంక్షేమం.. రక్షణ కోసం డిమాండ్లు
Image Credit : Social Media

మహిళా ఉద్యోగుల సంక్షేమం.. రక్షణ కోసం డిమాండ్లు

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించాలని NC-JCM కోరింది. వారి భద్రత, ప్రసూతి ప్రయోజనాలు, నెలసరి సంక్షేమం, చైల్డ్ కేర్ లీవ్ సమస్యలు, పని ప్రదేశంలో సమానత్వం వంటి అంశాలపై చర్చించేందుకు వీలుగా ప్రశ్నావళిని రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. మహిళా ఉద్యోగుల అవసరాలను గుర్తించడం ద్వారా మరింత సమగ్రమైన పాలసీని రూపొందించవచ్చని అభిప్రాయపడింది.

57
విభాగాల వారీ సమస్యలు ఉంటాయి..
Image Credit : AI generated

విభాగాల వారీ సమస్యలు ఉంటాయి..

కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే వివిధ విభాగాలకు భిన్నమైన సవాళ్లు, క్యాడర్ సమస్యలు ఉంటాయని NC-JCM తెలిపింది. అందుకే విభాగాల వారీగా సమస్యలను నివేదించడానికి అవకాశం ఇవ్వాలని కోరింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు, ఫెడరేషన్లతో చర్చలు జరపడానికి సమయం పడుతుందని, కాబట్టి ప్రత్యేక మెమోరాండం సమర్పించడానికి గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని అభ్యర్థించింది.

67
సాంకేతిక పరిమితుల మార్పులు.. ఈ-మెయిల్ అవకాశం
Image Credit : Pixabay

సాంకేతిక పరిమితుల మార్పులు.. ఈ-మెయిల్ అవకాశం

ప్రస్తుతం ఆన్‌లైన్ సబ్మిషన్ కోసం ఉన్న 3500 క్యారెక్టర్ల (సుమారు 500 పదాలు) పరిమితి చాలా తక్కువ అని ఉద్యోగ సంఘం పేర్కొంది. సంక్లిష్టమైన అంశాలను వివరించడానికి కనీసం 1000 పదాల పరిమితి ఉండాలని కోరింది. అలాగే, అటాచ్‌మెంట్ ఫైల్ సైజును 2 MB నుండి 10 MBకి పెంచాలని డిమాండ్ చేసింది. కేవలం ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ఈ మెయిల్, హార్డ్ కాపీల ద్వారా కూడా వినతులు సమర్పించే అవకాశం కల్పించాలని, దీనివల్ల సాంకేతిక ఇబ్బందులు తొలగి అందరికీ అందుబాటులో ఉంటుందని లేఖలో వివరించారు.

77
పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులు ఎందుకు కోరుతున్నారు?
Image Credit : Google

పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులు ఎందుకు కోరుతున్నారు?

పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులు బలంగా కోరుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. దీనిలోని ముఖ్య అంశాలు గమనిస్తే..

• స్థిరమైన ఆదాయం: రిటైర్మెంట్ సమయంలో తీసుకున్న చివరి జీతంలో 50% పెన్షన్‌గా వస్తుంది. ఇది మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా జీవితాంతం హామీతో కూడిన ఆదాయాన్ని ఇస్తుంది.

• కాంట్రిబ్యూషన్ లేదు: OPS కోసం ఉద్యోగి తన జీతం నుండి ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా NPS లో ఉద్యోగి 10% వాటా చెల్లించాలి.

• కుటుంబ రక్షణ: ఉద్యోగి మరణానంతరం భార్య/భర్తకు ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.

• డీఏ పెంపు: ధరల పెరుగుదలకు అనుగుణంగా ఏటా రెండుసార్లు  డీఏ పెరుగుతుంది, దీనివల్ల పెన్షన్ మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది.

• గ్రాట్యుటీ & కమ్యుటేషన్: పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే, రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన, రిస్క్ లేని జీవితం కోసం ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ ను బెస్ట్ గా భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఉద్యోగాలు, కెరీర్
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Recommended image2
దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
Gratuity : ఉద్యోగులకు పండగే.. ఇక ఐదేళ్లు అక్కర్లేదు, ఏడాదికే గ్రాట్యుటీ.. కొత్త రూల్స్ ఇవే
Recommended image2
57 వేల కోట్ల అప్పుల దివాలా కంపెనీ కోసం అదానీ, వేదాంత ఎందుకు ఫైట్ చేస్తున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved