MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !

Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి? ఈ పెంపు వెనుక ఉన్న అంతర్జాతీయ కారణాలు, యుద్ధ మేఘాలు, మీ జేబుపై పడే ప్రభావం వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2026, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల షాక్.. హైదరాబాద్‌లో రూ. 110 దాటిన పెట్రోల్
Image Credit : X

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల షాక్.. హైదరాబాద్‌లో రూ. 110 దాటిన పెట్రోల్

దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇవాళ తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బాంబ్ పేలింది. దాదాపు నాలుగేళ్లుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరుకు రూ. 3 మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 110.89కి చేరగా, ఏపీలో మరికొంత ఎక్కువగా రూ. 113.03 వద్ద ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.110.89, డీజిల్‌ రూ.98.70
  • ఢిల్లీ: పెట్రోల్‌ రూ.97.77, డీజిల్‌ రూ.90.67
  • ముంబై: పెట్రోల్‌ రూ.106.54, డీజిల్‌ రూ.93.03
  • కోల్‌కతా: పెట్రోల్‌ రూ.108.45, డీజిల్‌ రూ.95.02
  • చెన్నై: పెట్రోల్‌ రూ.103.80, డీజిల్‌ రూ.95.39
  • బెంగళూరు: పెట్రోల్‌ రూ.105.96, డీజిల్‌ రూ.93.99

అయితే, పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పుడు ఎందుకు పెంచారు? ఈ పెంపు వెనుక ఉన్న కారణాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గ్లోబల్ పాలిటిక్స్: అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ
Image Credit : ANI

గ్లోబల్ పాలిటిక్స్: అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ

పెట్రోల్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణాల్లో పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు. గత మూడు నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసివేయడం లేదా అక్కడ ఆంక్షలు విధించడం వల్ల సముద్ర మార్గంలో జరగాల్సిన చమురు రవాణా ఆగిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్లాలి. సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. భారత్ తన అవసరాలకు 80% దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, ఆ గ్లోబల్ మంట ఇక్కడ పెట్రోల్ బంకులను తాకింది.

34
చమురు కంపెనీల నష్టాలు కూడా ఒక కారణం
Image Credit : Asianet News

చమురు కంపెనీల నష్టాలు కూడా ఒక కారణం

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి కంపెనీలు ఇప్పటివరకు ధరలను పెంచకుండా భరించాయి. దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీగా నష్టపోయాయి. 

రూపాయి విలువ పడిపోవడం కూడా దిగుమతి వ్యయాన్ని పెంచింది. ప్రధాని మోదీ గత రెండు రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మనం ఎంత తక్కువ ఇంధనం వాడితే, దేశానికి అంత తక్కువ విదేశీ మారకం నిల్వలు ఖర్చవుతాయి.

44
పెట్రోల్ ధరల మంట.. మీ జేబుపై పడే ప్రభావం ఎంత?
Image Credit : ChaGPT

పెట్రోల్ ధరల మంట.. మీ జేబుపై పడే ప్రభావం ఎంత?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం బైకులు, కార్ల వాడకం ఖరీదవ్వడం మాత్రమే కాదు. డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చులు భారమవుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. 

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పశ్చిమాసియాలో యుద్ధం సద్దుమణిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదు. కాబట్టి సామాన్యుడు మరింత కాలం పెట్రో మంటను భరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ ధరులు పెరిగే అవకాశముంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
హైదరాబాద్
అమరావతి
తెలంగాణ
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Weather Update: రెడ్ అలర్ట్.. ఇటు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు !
Recommended image2
IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved