MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather Update: రెడ్ అలర్ట్.. ఇటు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు !

Weather Update: రెడ్ అలర్ట్.. ఇటు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు !

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం షాకిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒకవైపు 45 డిగ్రీల ఎండలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలతో విచిత్ర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2026, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణలో క్లైమేట్ మామూలుగా లేదుగా
Image Credit : Gemini AI

తెలంగాణలో క్లైమేట్ మామూలుగా లేదుగా

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక పట్టాన అర్థం కావడం లేదు. పొద్దున లేస్తే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు.. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో మారుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించి షాకిచ్చింది. ఈ హాట్ అండ్ కూల్ క్లైమేట్ విషయాల గురించి ఐఎండీ చెప్పిన విషయాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
45 డిగ్రీల మంట.. అదిలాబాద్‌లో రికార్డు బ్రేక్
Image Credit : 2026 Heatwave In India Extreme North India Summer Hot Weather IMD Alert Delhi temperature to rise Mega El Nino Fears

45 డిగ్రీల మంట.. అదిలాబాద్‌లో రికార్డు బ్రేక్

ప్రస్తుతం గతేడాది కంటే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డుల మోత మోగిస్తోంది. అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఏకంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 4.7 డిగ్రీలు ఎక్కువ. 

నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా 44 డిగ్రీలు దాటేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు పలు జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. ముఖ్యంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మధ్యాహ్నం పూట వడగాల్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

34
వడగాల్పుల మధ్యలో వానలు
Image Credit : Gemini AI

వడగాల్పుల మధ్యలో వానలు

మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. క్యుములోనింబస్‌ మేఘాల కదలికల వల్ల మే 15, 16 తేదీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు జనాలను వణికించనున్నాయి. పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున పొలాల్లో ఉండే రైతులు చెట్ల కిందకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

44
జర భద్రం.. ఇలా చేస్తే సేఫ్!
Image Credit : X/APSDMA

జర భద్రం.. ఇలా చేస్తే సేఫ్!

ఈ విచిత్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ టిప్స్ పాటించాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

  • హైడ్రేషన్ ముఖ్యం: దాహం వేసినా వేయకపోయినా మంచి నీళ్లు తాగుతూ ఉండండి.
  • ఔటింగ్ టైమింగ్: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడం మానుకోండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ మస్ట్.
  • డ్రెస్ కోడ్: లైట్ కలర్ కాటన్ బట్టలకే ప్రాధాన్యం ఇవ్వండి. గాలి ఆడేలా చూసుకోండి.
  • అలర్ట్‌గా ఉండండి: కళ్లు తిరగడం, అధిక నీరసం అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Flash Flood Alert: తీరం దాటుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image3
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Related Stories
Recommended image1
Virat Kohli: రిటైర్మెంట్ పై కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ !
Recommended image2
Parking Rules: రోడ్డుపై బండి పార్క్ చేస్తే ఇక అమ్మేస్తారు జాగ్రత్త.. తెలంగాణలో కొత్త పార్కింగ్ రూల్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved