MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !

IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !

MI vs PBKS : ఐపీఎల్ 2026లో తిలక్ వర్మ వీరవిహారం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ను గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ టీమ్ ప్లేఆఫ్ అవకాశాల పై దెబ్బపడింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ముంబై ఇండియన్స్ మాస్ విక్టరీ.. ధర్మశాలలో తిలక్ విధ్వంసం
Image Credit : ANI

ముంబై ఇండియన్స్ మాస్ విక్టరీ.. ధర్మశాలలో తిలక్ విధ్వంసం

ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ 58వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ ఉంచిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. పంజాబ్ బౌలర్లను తిలక్ వర్మ ఓ ఆటాడుకోవడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో తిలక్ చేసిన విధ్వంసం అభిమానులకు పూనకాలు తెప్పించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పంజాబ్ భారీ స్కోరు.. ఒమర్జాయ్ మెరుపులు
Image Credit : ANI

పంజాబ్ భారీ స్కోరు.. ఒమర్జాయ్ మెరుపులు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఒక దశలో పంజాబ్ 170-180 పరుగులకే పరిమితమవుతుందని భావించినా, అజ్మతుల్లా ఒమర్జాయ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశాడు. అయితే చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు పుంజుకోవడంతో ముంబై ముందు భారీ టార్గెట్ నిలిచింది.

36
ర్యాన్ రికెల్టన్, రోహిత్ దూకుడు
Image Credit : ANI

ర్యాన్ రికెల్టన్, రోహిత్ దూకుడు

201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (48) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు రోహిత్ శర్మ (25) కూడా ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అయితే, ఒకేసారి మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. రోహిత్‌ను యజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి స్కోరు 88/3గా ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.

46
తిలక్ వర్మ మాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు
Image Credit : ANI

తిలక్ వర్మ మాస్ ఇన్నింగ్స్.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తిలక్ వర్మ ఎక్కడా తగ్గలేదు. ఒత్తిడిలో కూడా అద్భుతమైన షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే తిలక్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహల్ ఓవర్లో 106 మీటర్ల భారీ సిక్సర్ బాదడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే రూథర్‌ఫోర్డ్ ఔటైనా, తిలక్ మాత్రం పట్టు వదలకుండా సునామీ రేపాడు.

56
చివరి 3 ఓవర్ల డ్రామా.. ముంబై సంచలనం
Image Credit : ANI

చివరి 3 ఓవర్ల డ్రామా.. ముంబై సంచలనం

చివరి 18 బంతుల్లో ముంబై గెలవడానికి 50 పరుగులు కావాలి. అసాధ్యం అనుకున్న ఈ లక్ష్యాన్ని తిలక్ తన బ్యాటింగ్‌తో సుసాధ్యం చేశాడు. మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో తిలక్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా, విల్ జాక్స్ ఒక సిక్సర్ బాదాడు. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదిన తిలక్ వర్మ, ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు.

66
బూమ్రా కెప్టెన్సీలో అదిరిపోయే బోణీ
Image Credit : stockPhoto

బూమ్రా కెప్టెన్సీలో అదిరిపోయే బోణీ

ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన జస్ప్రీత్ బూమ్రాకు ఇది మంచి ఆరంభం. మ్యాచ్ అనంతరం బూమ్రా మాట్లాడుతూ.. తిలక్ వర్మ ఇన్నింగ్స్ అద్భుతమని, తన మీద తనకు ఉన్న నమ్మకమే ఈ విజయాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడాడు. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీసింది. పంజాబ్ వరుసగా ఐదో ఓటమిని చవిచూడటంతో వారి ప్లేఆఫ్ అవకాశాల పై దెబ్బపడింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Virat Kohli: రిటైర్మెంట్ పై కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ !
Recommended image2
‎Catch of IPL 2026: మనీష్ పాండే సూపర్ మ్యాన్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved