MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Airline Rules: విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ చనిపోతే వెంటనే ల్యాండింగ్ చేస్తారా? చేయరా?

Airline Rules: విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ చనిపోతే వెంటనే ల్యాండింగ్ చేస్తారా? చేయరా?

Airline Rules: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ పక్కన కూర్చున్న ప్రయాణికుడు చనిపోతే..? విమానాన్ని వెంటనే దగ్గర్లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేస్తారా? లేక గమ్యస్థానం చేరుకొనేదాకా ఆ శవాన్ని అలాగే ఉంచుతారా? లేదా అక్కడి నుంచి తీసేస్తారా? అసలు ఫ్లైట్ లో వ్యక్తి మరణిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎయిర్‌లైన్స్ రూల్స్ ఏం చెబుతున్నాయో  ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Mar 26 2025, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా విమానం ఎక్కే ముందు ఎయిర్ లైన్స్ ఇచ్చే రూల్స్ లో ప్రయాణికుల ఆరోగ్య రక్షణ మా బాధ్యత కాదు. ఎవరికి వారు సంరక్షించుకోవాలని ఉంటుంది. అందుకే విమానయాన సంస్థలు సాధారణంగా విమానంలో సంభవించే మరణాలకు బాధ్యత వహించవు. అయితే వారి నిర్లక్ష్యం వల్ల ప్యాసింజర్ చనిపోతే కచ్చితంగా వారికి బాధ్యత ఉంటుంది. కాని మినిమం రెస్పాన్సిబులిటీ తీసుకుంటాయి. అంటే.. అనుకోకుండా విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే, ఫ్లైట్ అటెండెంట్ వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. అప్పుడు విమానంలో ఎవరైనా డాక్టర్లు లేదా వైద్య నిపుణులు ఉంటే వారి సహాయం తీసుకుంటారు. ప్యాసింజర్ ని కాపాడటానికి ప్రయత్నిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోతే విమాన సిబ్బంది ఎవరూ కూడా ప్రయాణికుడు చనిపోయాడని ప్రకటించలేరు. ఈ విషయాన్ని అధికారిక వైద్యులు లేదా వైద్య నిపుణులు మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. ఫ్లైట్‌లో వైద్యులు ఎవరూ లేకపోతే, ఎవరైనా చనిపోయినప్పుడు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందిస్తారు. వారి నిర్ణయంపై విమాన ప్రయాణం ఆధారపడి ఉంటుంది. 

ఇది కూడా చదవండి మధురై నుండి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసు: టికెట్ ధర ఇంత తక్కువా?

35

ఒకవేళ ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంటే సమీప విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవచ్చు. ప్రయాణికుడు అప్పటికే మరణించి ఉంటే, ఆ విషయాన్ని విమానంలో ఉన్న ఎవరైనా డాక్టర్లు నిర్ధారిస్తే ల్యాండింగ్ చేయడానికి లేదు. 

మరి ఆ శవాన్ని అలాగే ఉంచి విమానం గమ్యస్థానం చేరుకొనే వరకు ప్రయాణించాల్సిందేనా అంటే.. అవసరం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని హైటెక్ విమానాలలో కార్ప్స్ లాకర్ అనే ప్లేస్ ఉంటుంది. ఇలా ఎవరైనా విమానం గాల్లో ఉండగా చనిపోతే ఆ శవాన్ని గౌరవంగా కార్ప్స్ లాకర్ లో ఉంచుతారు. అది లేని విమానాల్లో సిబ్బంది వచ్చి ఆ శవాన్ని ప్రయాణికులకు దూరంగా ఖాళీ సీటులో ఉంచుతారు. లేదా బిజినెస్ క్లాస్‌లో పడుకోబెడతారు.

45

ఒక్కో సారి మృతుల పక్కన కూర్చున్న ప్రయాణికులను అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే సీట్ లో కూర్చోబెడతారు. కానీ చాలా సందర్భాలలో వ్యక్తి చనిపోతే ఆ శవంతోనే మిగిలిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ అధికారులు, వైద్య సిబ్బందికి ప్రయాణికుడి మరణం గురించి సమాచారం ఇస్తారు. తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలియజేస్తారు. చట్ట ప్రకారం ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. 

55

విమానంలో మరణం జరగడం చాలా అరుదు. ఎందుకంటే ప్రతి ఎయిర్ లైన్ కచ్చితంగా ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తాయి. అనుకోకుండా జరిగే సంఘటనలకు ఎవరూ బాధ్యత వహించలేరు. కానీ ఇటీవల సౌదీ అరేబియా నుండి లక్నో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తి ఒకరు మరణించారు. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఫ్లైయిట్ ల్యాండ్ అయిన తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
జీవనశైలి
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Recommended image2
మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే.. నెలకు రూ. 20 వేల ఆదాయం మీ సొంతం
Recommended image3
Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved