MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • IndiGo Service: మధురై నుండి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసు: టికెట్ ధర ఇంత తక్కువా?

IndiGo Service: మధురై నుండి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసు: టికెట్ ధర ఇంత తక్కువా?

IndiGo Service: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా విజయవాడ వాసులకు గుడ్ న్యూస్. మధురై నుండి బెంగళూరు మీదుగా విజయవాడకు ఇండిగో విమాన సర్వీసు మొదలైంది. ఈ విమానంలో టికెట్ ధర ఎంత? స్టార్టింగ్ టైమ్, తదితర మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 25 2025, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా విజయవాడ రావడం కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే విజయవాడ అన్ని ప్రాంతాలకు సెంటర్ లో ఉంటుంది. ఇటు రాయలసీయ, నెల్లూరు సైడ్ వెళ్లొచ్చు. మరో వైపుగా కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం వెళ్లొచ్చు. రెండు వైపులకు వెళ్లే వారు విజయవాడ వరకు ఫ్లైట్ లో వస్తే అక్కడి నుంచి బస్సు గాని, కారులో గాని ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అందుకే ఇండిగో విమాన సంస్థ కొత్తగా ఓ ఫ్లైట్ ని స్టార్ట్ చేసింది. ఇది బెంగళూరు మీదుగా మధురై టు విజయవాడ వరకు వెళుతుంది. ముఖ్యంగా మధురై నుంచి స్టార్ట్ చేయడానికి  కారణం.. టూరిస్టులను ఆకర్షించేందుకు. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఈ సమయంలో ఎక్కువ మంది విహార యాత్రలకు వెళతారు. ముఖ్యంగా తమిళనాడులో అనేక దేవాలయాలను చూడటానికి ఫ్యామిలీలతో సహా వెళుతుంటారు. అందుకే ఇండిగో విమాన సంస్థ ఒక కొత్త ఫ్లైట్ ని మధురై నుంచి ప్రారంభించింది. 

 

35

ఎప్పటి నుంచి ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

చెన్నై, కోయంబత్తూరు తర్వాత మధురై పెద్ద నగరం. మధురైని దేవాలయాల నగరం, నిద్రించని నగరం అని కూడా పిలుస్తారు. మధురై నుండి బెంగళూరు మీదుగా విజయవాడకు ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త విమాన సర్వీసును మార్చి 30 నుండి ప్రారంభించనుంది. 

ఇది కూడా చదవండి అయోధ్య వెళ్తే ఈ 10 అద్భుతమైన ప్రదేశాలు తప్పక చూడండి

45

ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి..

కొత్త ఇండిగో విమాన సర్వీసులో ప్రయాణికులు బెంగళూరులో అదే విమానంలో 30 నిమిషాలు ఉండి తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 8.15 గంటలకు మధురై నుండి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి రాత్రి 7:25 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ విమానం టికెట్ ధర రూ.6,000 నుండి ప్రారంభమవుతుంది.

 

55

ఈ విమానం నడపడం వల్ల పర్యాటకులు, భక్తులు, టూరిస్టులు మధురై నుంచి బెంగలూరు వచ్చి అక్కడి నుంచి విజయవాడకు ఫ్లైట్ మారాల్సిన అవసరం లేదు. నేరుగా ఆంధ్రప్రదేశ్ కు రావచ్చు. ఇలాంటి మరిన్ని దేశీయ విమాన కనెక్షన్‌ను మెరుగుపరిచేందుకు ఇండిగో సంస్థ ప్లాన్ చేస్తోంది. 

ఇది కూడా చదవండి మహిళలకు గుడ్ న్యూస్! ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్ ఈజీగా పొందొచ్చు! ఎలాగంటే..

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved