MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Prices: మీ వంటింటి బ‌డ్జెట్ ఎందుకు పెరిగిందో తెలుసా.? నెల‌కు రూ. 1500 అద‌నంగా

Prices: మీ వంటింటి బ‌డ్జెట్ ఎందుకు పెరిగిందో తెలుసా.? నెల‌కు రూ. 1500 అద‌నంగా

Prices: వంటింటి బడ్జెట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. బియ్యం నుంచి పప్పుధాన్యాలు, కూరగాయల వరకు పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కొన్ని నిత్యావసరాల ధరలు 5 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగాయి. దీనికి కార‌ణం ఏంటంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 13 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్‌నినోతో వ్యవసాయంపై ప్రభావం.. తగ్గిన పంటల దిగుబడులు
Image Credit : Gemini AI

ఎల్‌నినోతో వ్యవసాయంపై ప్రభావం.. తగ్గిన పంటల దిగుబడులు

ఎల్‌నినో పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వ్యవసాయ రంగంపై ఆందోళన నెలకొంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నీటి వసతి పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పంటల పెరుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు తక్కువగా చేరితే సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయి. అయితే అన్ని ప్రాంతాల్లో ధరల పెరుగుదలకు ఎల్‌నినో ఒక్కటే కారణం కాదు. పంటల నిల్వలు, మార్కెట్‌లో డిమాండ్, సరఫరా వ్యవస్థ వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బియ్యం, పప్పుల ధరలతో పెరుగుతున్న వంటింటి ఖర్చు
Image Credit : Gemini AI

బియ్యం, పప్పుల ధరలతో పెరుగుతున్న వంటింటి ఖర్చు

ప్రతిరోజూ వినియోగించే బియ్యం, పప్పుల ధరలు పెరగడం కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. గతంలో రూ.1,200కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ధర ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.2,000కు చేరింది. అంటే ఒక బస్తాపై రూ.800 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇదే సమయంలో కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ధరలు కూడా పెరగడంతో నెలవారీ సరుకుల కొనుగోలు ఖర్చు అధికమవుతోంది. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడే కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు ఖర్చులను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ఇతర అవసరాలకు కేటాయించే డబ్బును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

35
ఉల్లిపాయల ధరలు రెట్టింపు.. కిలోకు రూ.80
Image Credit : Gemini AI

ఉల్లిపాయల ధరలు రెట్టింపు.. కిలోకు రూ.80

వంటల్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయల ధరలు కూడా వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో కిలో రూ.40 ఉన్న ఉల్లిపాయలు ప్రస్తుతం రూ. 60 నుంచి రూ. 80 వ‌ర‌కు పలుకుతున్నాయి. దీంతో తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసినా కుటుంబాల నెలవారీ ఖర్చు పెరుగుతోంది. ఉల్లిపాయల ధరలపై పంట దిగుబడులు, నిల్వలు, వివిధ మార్కెట్లకు సరఫరా అయ్యే పరిమాణం ప్రభావం చూపుతాయి. పప్పుధాన్యాలు, బియ్యం, ఉల్లిపాయలు వంటి ముఖ్యమైన సరుకుల ధరలు ఒకేసారి పెరిగితే సామాన్యులకు బడ్జెట్ నిర్వహణ మరింత కష్టమవుతుంది. అందుకే వినియోగదారులు కొనుగోళ్ల సమయంలో ధరలను పోల్చి చూడాల్సిన అవసరం ఏర్పడుతోంది.

45
కూరగాయల ధరలు కూడా..
Image Credit : Gemini AI

కూరగాయల ధరలు కూడా..

కూరగాయల మార్కెట్‌లోనూ ధరలు వినియోగదారులకు భారంగా మారాయి. ప్ర‌స్తుతం కిలో పెద్ద చిక్కుళ్లు: రూ.100, క్యాప్సికం: రూ.65, పచ్చిమిర్చి: రూ.55, వంకాయ: రూ.49, బీరకాయ: రూ.45, దోసకాయ: రూ.36, టమాటా: రూ.33, దొండకాయ: రూ.30 ప‌లుకుతోంది.

కూరగాయల ధరలు ప్రాంతాన్ని బట్టి, మార్కెట్‌ను బట్టి మారవచ్చు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే నీటి లభ్యత తగ్గి సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి తోడు పంటలు మార్కెట్లకు చేరే సమయంలో రవాణా ఖర్చులు పెరిగితే వినియోగదారులు చెల్లించే ధరలపైనా ఆ ప్రభావం కనిపించవచ్చు.

55
ప్రతి కుటుంబంపైనా రూ.1,500 అదనపు భారం..
Image Credit : Gemini AI

ప్రతి కుటుంబంపైనా రూ.1,500 అదనపు భారం..

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కొన్ని వస్తువుల ధరలు 5 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగిన‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో కుటుంబం నెలకు సుమారు రూ.1,500 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే సరఫరా మెరుగుపడి పంటల దిగుబడులు పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటివరకు కుటుంబాలు నెలవారీ సరుకుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవడం, స్థానిక మార్కెట్లలో ధరలను పోల్చడం, అవసరానికి తగినంత మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ఖర్చులను నియంత్రించుకోవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
జీవనశైలి
 
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
New Rules From December 1: గ్యాస్ సిలిండర్ నుంచి ఆధార్ వరకు.. డిసెంబర్ 1 నుంచి 7 కీలక రూల్స్ ఛేంజ్
Recommended image2
Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? సరైన ఎఫ్‌డీ ఎలా ఎంచుకోవాలో తెలుసా?
Recommended image3
Gold Silver Price: రెండ్రోజుల తర్వాత మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
Related Stories
Recommended image1
రోడ్డుపై ఎప్పుడైనా ఈ సింబల్‌ని గ‌మ‌నించారా.? చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved