- Home
- Business
- New Rules From December 1: గ్యాస్ సిలిండర్ నుంచి ఆధార్ వరకు.. డిసెంబర్ 1 నుంచి 7 కీలక రూల్స్ ఛేంజ్
New Rules From December 1: గ్యాస్ సిలిండర్ నుంచి ఆధార్ వరకు.. డిసెంబర్ 1 నుంచి 7 కీలక రూల్స్ ఛేంజ్
New Rules From December 1: డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ ధరలు, ఆర్బీఐ నిర్ణయాలు, ఆధార్ ఈమెయిల్ అప్డేట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, సెబీ రూల్స్ మారనున్నాయి. ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గ్యాస్ రేట్ల నుంచి లోన్ ఈఎంఐ వరకు.. డిసెంబర్లో బిగ్ అప్డేట్స్ ఇవే
ప్రతి నెలా ఒకటో తేదీన దేశంలో చాలా నియమాలు, ధరలు మారుతుంటాయి. డిసెంబర్ 1 నుంచి కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారీ ఖర్చులపై డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫైనాన్షియల్ రూల్స్‌లో కూడా మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. నెల మొదలయ్యే ముందే ఈ 7 నియమాల గురించి తెలుసుకుంటే ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ 7 మార్పుల వివరాలు గమనిస్తే..
ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు
ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ రేట్లపై రివ్యూ చేస్తాయి. డిసెంబర్ 1న కూడా డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలపై హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపారులు ఫోకస్ పెడతారు. అదే సమయంలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగినా లేదా అలాగే ఉన్నా, ఫ్యామిలీ కిచెన్ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది.
ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌లో రెపో రేటుపై నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్ డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరుగుతుంది. ఇందులో రెపో రేటు గురించి చర్చిస్తారు. గత అక్టోబర్‌లో ఆర్బీఐ రెపో రేటును 0.25% పెంచి 5.50% చేసింది. దీని ప్రభావం నేరుగా మన జేబుపై పడుతుంది.
ఎఫ్డీ, లోన్ రూల్స్‌లో మార్పులు
ఆర్బీఐ కనుక రెపో రేటును మళ్లీ పెంచితే, బ్యాంకుల వడ్డీ రేట్లపై ఆ ఎఫెక్ట్ పడుతుంది. హోమ్ లోన్లు, ఇతర ఫ్లోటింగ్ రేట్ లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. దీనివల్ల కస్టమర్ల ఈఎంఐ (EMI) పెరగవచ్చు లేదా లోన్ కట్టే కాలపరిమితి పెరగవచ్చు. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లలో (FD) ఇన్వెస్ట్ చేసేవారికి ఇది పాజిటివ్ న్యూస్ కావచ్చు. బ్యాంకులు కొత్త ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసే అవకాశం ఉంది.
అయితే ఎఫ్డీ, లోన్ వడ్డీ రేట్లు మార్చాలా వద్దా అనేది బ్యాంకులు తమ అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాయి.
ఆధార్‌లో ఈమెయిల్ అప్డేట్ రూల్
ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీ యాడ్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి తీసుకునే 75 రూపాయల ఫీజును యూఐడీఏఐ (UIDAI) తాత్కాలికంగా తీసేసింది. ఈ బెనిఫిట్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. కానీ అఫీషియల్ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ అప్డేట్ చేస్తేనే ఈ ఫ్రీ బెనిఫిట్ దొరుకుతుంది.
మీ ఆధార్‌లో కొత్త ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలనుకున్నా లేదా పాతది మార్చాలనుకున్నా డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలి. ఆ తర్వాత నార్మల్ ఫీజు మళ్లీ రావచ్చు.
కమోడిటీ ట్రేడింగ్, ఎస్బీఐ కార్డ్, ఎన్ఆర్ఐ కేవైసీ అప్డేట్స్
కమోడిటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేసేవారి కోసం సెబీ (SEBI) డిసెంబర్ 1 నుంచి కొత్త మార్జిన్ రూల్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా ట్రేడర్లు ఇనిషియల్ మార్జిన్‌గా 6%, 8% లేదా 10% అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ అనాలసిస్ కోసం 2 నుంచి 3 రోజుల టైమ్ పీరియడ్ ఫిక్స్ చేస్తారు. అగ్రికల్చర్, నాన్-అగ్రికల్చర్ కమోడిటీస్ రెండింటికీ ఈ రూల్స్ వర్తిస్తాయి.
ఇక ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ యూజర్లకు డిసెంబర్ 1 నుంచి కొన్ని స్పెషల్ ట్రాన్సాక్షన్లపై ఎక్స్ట్రా ఛార్జీ పడుతుంది. ఒకేసారి 30,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ పేమెంట్ చేస్తే 1% ఛార్జీ, వర్తించే ట్యాక్స్ కట్టాలి. ఫ్యూయల్ విషయంలో అయితే, ఒక బిల్లింగ్ సైకిల్లో మొత్తం ఖర్చు 50,000 రూపాయలు దాటితే మొత్తం ఫ్యూయల్ ఖర్చుపై 1% ఎక్స్ట్రా ఛార్జీ పడుతుంది. అంటే లిమిట్ దాటిన అమౌంట్‌పై కాకుండా, మొత్తం ఫ్యూయల్ బిల్లుపై ఆ ఛార్జీ వర్తిస్తుంది.
మరోవైపు డిసెంబర్ నుంచి ఎన్ఆర్ఐలు (NRI), ఓసీఐ (OCI) కార్డ్ హోల్డర్లు, విదేశాల్లో ఉండే ఇండియన్ ఇన్వెస్టర్లు కేవైసీ కోసం ఇండియాకు రావాల్సిన అవసరం లేదు. సెబీ కొత్త రూల్స్ ప్రకారం, ఎఫ్ఏటీఎఫ్ (FATF) నిబంధనలు పాటించే దేశాల్లో ఉండేవారు ఇంటి నుంచే డిజిటల్ కేవైసీ చేసుకోవచ్చు. దీనికి సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సహాయం తీసుకోవాలి. దీనివల్ల విదేశాల్లో ఉండే భారతీయులు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మరింత సులభమవుతుంది.















