- Home
- Business
- Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? సరైన ఎఫ్డీ ఎలా ఎంచుకోవాలో తెలుసా?
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? సరైన ఎఫ్డీ ఎలా ఎంచుకోవాలో తెలుసా?
Fixed Deposit: కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా దాచుకోవడంతో పాటు వడ్డీ ద్వారా కొంత ఆదాయం పొందాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. మరి ఎఫ్డీ చేయాలనుకునేవారు ఏ విషయాలను పరిశీలించాలి? సరైన ఎఫ్ డీ ఎలా ఎంచుకోవాలి?

బ్యాంక్ ఎఫ్డీ పెట్టుబడి రూల్స్
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఎప్పుడూ నమ్మకమైన సేవింగ్స్ ఆప్షన్. పెట్టిన డబ్బు సేఫ్‌గా ఉంటుందనే నమ్మకంతో చాలామంది ఎఫ్‌డీల వైపు మొగ్గుచూపుతారు. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలపై ఫోకస్ పెట్టడం అవసరం. ముఖ్యంగా మీ గోల్స్ ఏంటి? ఎప్పుడు డబ్బు కావాలి అనే దాన్ని బట్టి బెస్ట్ ఎఫ్డీని సెలెక్ట్ చేసుకోవాలి. కేవలం వడ్డీ ఎక్కువగా వస్తుందనే ఆశతో ఎఫ్డీ స్కీమ్ తీసుకోకూడదు. మీకు ఆ డబ్బు ఎప్పుడు అవసరం అవుతుందనేదే ఇక్కడ కీలకం.
గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు
ఒకవేళ మీకు రెండేళ్ల తర్వాత డబ్బు అవసరం అవుతుందనుకోండి. కానీ, ఎక్కువ వడ్డీ వస్తుందని ఐదేళ్ల ఎఫ్డీలో వేస్తే.. మధ్యలోనే ఎఫ్డీ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ముందే క్లోజ్ చేస్తే బ్యాంకులు పెనాల్టీ వేస్తాయి.
అందుకే, రెండేళ్లలో ఇల్లు కట్టుకోవడానికో లేదా ఇతర ఖర్చులకో డబ్బు కావాలంటే కచ్చితంగా రెండేళ్లకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీనే ఎంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, లాంగ్ టర్మ్ ఎఫ్డీలకే ఎక్కువ వడ్డీ వస్తుందన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు ఐదేళ్ల ఎఫ్డీ కంటే రెండేళ్ల ఎఫ్డీకే మంచి వడ్డీ రావొచ్చు.
సరైన ఎఫ్డీ ఎంచుకునే విధానం
అవసరం & టైమ్‌లైన్: బ్యాంక్ ఎఫ్డీలో డబ్బు వేసే ముందు అసలు ఆ డబ్బు దేనికి, ఎప్పుడు కావాలి అనేది డిసైడ్ అవ్వాలి. మీకు ఏడాదిలో డబ్బు కావాలంటే, మూడేళ్ల ఎఫ్డీకి వచ్చే 0.50% ఎక్స్ట్రా వడ్డీకి టెంప్ట్ అవ్వకూడదు. డైరెక్ట్‌గా ఏడాది ఎఫ్డీ స్కీమ్ తీసుకోవడమే బెటర్.
ముందే తీస్తే పెనాల్టీ: చాలా బ్యాంకులు మెచ్యూరిటీ కంటే ముందే ఎఫ్డీ బ్రేక్ చేస్తే ఆ టెన్యూర్‌కు ఉన్న వడ్డీ రేటులో నుంచి 0.50% నుంచి 1% దాకా వడ్డీ కోత విధిస్తాయి. ఉదాహరణకు 7% వడ్డీతో మూడేళ్ల ఎఫ్డీ చేసి, దాన్ని ఏడాదిలోపే బ్రేక్ చేస్తే.. అప్పటికి ఏడాది వడ్డీ రేటు 6% ఉంటే, అందులో 1% పెనాల్టీ కట్ చేసి మీకు కేవలం 5% వడ్డీనే ఇస్తాయి.
విడదీసి ఇన్వెస్ట్ చేయడం బెస్ట్
మీ దగ్గర రూ.5 లక్షల పొదుపు ఉంటే దాన్ని ఒకే ఎఫ్డీలో పెట్టకూడదు. రూ.1 లక్ష చొప్పున ఐదు వేర్వేరు ఎఫ్‌డీల్లో (ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టెన్యూర్‌తో) డివైడ్ చేయాలి. దీనివల్ల ఏటా ఒక ఎఫ్డీ మెచ్యూర్ అయి మీ చేతికి డబ్బులు వస్తాయి. మిగిలిన మొత్తానికి వడ్డీ కంటిన్యూ అవుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జాగ్రత్త
అత్యవసరానికి వాడుకునే డబ్బును ఈజీగా తీసుకునేలా ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్‌ను లాక్-ఇన్ పీరియడ్ ఉండే నాన్-కాలబుల్ ఎఫ్‌డీల్లో అస్సలు పెట్టొద్దు. ఏ బ్యాంకులో ఎఫ్డీ చేసినా డీఐసీజీసీ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే, ముందస్తుగా డబ్బు తీసుకుంటే వర్తించే రూల్స్ పూర్తిగా తెలుసుకోవడం మంచిది.















