MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రిటైర్మెంట్ తర్వాత ఎవ‌రిపై ఆధార ప‌డొద్ద‌నుకుంటున్నారా.? ఇలా చేస్తే ప్ర‌తీ నెల మీ ఖాతాలో రూ. 10 వేలు

రిటైర్మెంట్ తర్వాత ఎవ‌రిపై ఆధార ప‌డొద్ద‌నుకుంటున్నారా.? ఇలా చేస్తే ప్ర‌తీ నెల మీ ఖాతాలో రూ. 10 వేలు

Post Office: స్థిరమైన ఆదాయం రావాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా రిటైర్మెంట్ త‌ర్వాత స్థిర‌మైన ఆదాయం కావాలనుకునే చాలా మంది ఉంటారు. అలాంటి వారికి పోస్టాఫీస్ అందిస్తోన్న మంథ్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 21 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రస్తుత వడ్డీ రేటు ఎంత.?
Image Credit : Gemini AI

ప్రస్తుత వడ్డీ రేటు ఎంత.?

ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 7.40%గా ఉంది. ఈ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అవసరాన్ని బట్టి పెంపు లేదా తగ్గింపు ఉంటుంది. ఈ ప‌థ‌కంలో కనీస పెట్టుబడి రూ. 1,000గా, గరిష్ఠ పెట్టుబడి (ఒకరి పేరుతో): రూ. 9 లక్షలుగా నిర్ణ‌యించారు. ఇక జాయింట్ అకౌంట్ విష‌యానికొస్తే గ‌రిష్టంగా రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. వడ్డీని ప్రతి నెలా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల పెన్షన్‌లా రెగ్యులర్‌గా డబ్బు వస్తుంది.

25
5 ఏళ్ల కాలపరిమితి
Image Credit : Getty

5 ఏళ్ల కాలపరిమితి

ఈ పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు. ఖాతా ప్రారంభించిన రోజు నుంచి ఐదేళ్లు పూర్తి అయ్యే వరకు ప్రతి నెలా వడ్డీ అందుతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యాక మీరు పెట్టిన అసలు మొత్తం తిరిగి పొందుతారు. అంటే పెట్టుబడి కూడా సురక్షితమే, వడ్డీ కూడా నిరంతరం వస్తూనే ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల రిస్క్ చాలా తక్కువ.

Related Articles

Related image1
ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్‌తో ఇంత అద్భుతం చేయొచ్చా.? నెల‌కు మినిమం రూ. 50 వేలు ఏటూ పోవు..
Related image2
Viral News: రూ. 38 వేల కోట్లు.. ముకేష్ అంబానీ ఇంటిని ఈరోజు నిర్మిస్తే అయ్యే ఖ‌ర్చు ఇదే
35
నెలకు రూ. 5,550 ఎలా వస్తుంది?
Image Credit : Getty

నెలకు రూ. 5,550 ఎలా వస్తుంది?

పెట్టుబడి ఎంత పెడితే అంత మేరకు వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు రూ. 4 లక్షలు పెట్టితే నెలకు సుమారు రూ. 2,467 వరకు వస్తుంది.. ఒకరి పేరుతో గరిష్ఠ పరిమితి అయిన రూ. 9 లక్షలు పెట్టితే నెలకు సుమారు రూ. 5,550 వడ్డీ లభిస్తుంది. ఇది పూర్తిగా 7.40% వడ్డీ రేటు ఆధారంగా లెక్కించినది.

45
నెలకు రూ. 9,250 రావాలంటే..
Image Credit : Social Media

నెలకు రూ. 9,250 రావాలంటే..

జాయింట్ అకౌంట్ తీసుకుని గరిష్ఠంగా రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తం మీద 7.40% వడ్డీ ప్రకారం నెలకు సుమారు రూ. 9,250 వరకు ఆదాయం లభిస్తుంది. అంటే దాదాపు రూ. 10 వేలు అన్న‌మాట‌. అంటే భార్యాభర్తలు కలిసి లేదా ఇద్దరు పెద్దలు కలిసి ఖాతా తెరిస్తే ఈ గరిష్ఠ పరిమితిని ఉపయోగించుకోవచ్చు. ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఈ మొత్తం వస్తుంది. కాలపరిమితి పూర్తయ్యాక రూ. 15 లక్షల అసలు మొత్తం తిరిగి అందుతుంది.

55
ఈ ప‌థ‌కం ఎవ‌రికి స‌రిపోతుంది.
Image Credit : Getty

ఈ ప‌థ‌కం ఎవ‌రికి స‌రిపోతుంది.

రిటైర్డ్ ఉద్యోగులు, సురక్షిత పెట్టుబడి కోరుకునే వారు, నెలనెలా స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారు, స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఇక ఎలాంటి రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం పొందాలనుకుంటే POMIS ఒక సరైన ఎంపికగా చెప్పవచ్చు. పెట్టుబడి భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!
Recommended image2
ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్‌తో ఇంత అద్భుతం చేయొచ్చా.? నెల‌కు మినిమం రూ. 50 వేలు ఏటూ పోవు..
Recommended image3
Multibagger Stock : రూ. 2 షేరుతో జాక్‌పాట్.. లక్ష పెడితే రూ. 62 లక్షల లాభం ! ఎలాగో తెలుసా?
Related Stories
Recommended image1
ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్‌తో ఇంత అద్భుతం చేయొచ్చా.? నెల‌కు మినిమం రూ. 50 వేలు ఏటూ పోవు..
Recommended image2
Viral News: రూ. 38 వేల కోట్లు.. ముకేష్ అంబానీ ఇంటిని ఈరోజు నిర్మిస్తే అయ్యే ఖ‌ర్చు ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved