ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌తో ఇంత అద్భుతం చేయొచ్చా.? నెలకు మినిమం రూ. 50 వేలు ఏటూ పోవు..
Business Ideas: ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పట్టణాలకే పరిమితం కాకుండా చిన్న చిన్న గ్రామాల వరకు విస్తరించింది. యువత, ఉద్యోగులు, విద్యార్థులు వేగంగా లభించే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాభదాయకమైన బిజినెస్ ఐడియాగా మారింది.

మార్కెట్‌లో డిమాండ్, సరైన లొకేషన్ ఎంపిక
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ విజయానికి ముఖ్య కారణం సరైన ప్రదేశం. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా:
* కాలేజీలు, స్కూల్స్ సమీపంలో
* బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు దగ్గర
* మార్కెట్ ప్రాంతాలు
* మెయిన్ రోడ్ల పక్కన
పిల్లలు, యువత, ఉద్యోగులు, కుటుంబాలు అనే తేడా లేకుండా అందరూ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా వంటి వంటకాలను ఇష్టపడుతున్నారు. అందువల్ల సరైన లొకేషన్ ఎంచుకుంటే రోజువారీ అమ్మకాలు స్థిరంగా ఉంటాయి.
మెనూ ఎంపిక, ధరల విధానం
సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే ఐటమ్స్:
వెజ్ మంచూరియా
చికెన్ మంచూరియా
ఎగ్ ఫ్రైడ్ రైస్
చికెన్ ఫ్రైడ్ రైస్
వెజ్ / ఎగ్ నూడిల్స్
ప్రస్తుతం మార్కెట్‌లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
సింగిల్ ప్లేట్: రూ. 60 – 70
ఫుల్ ప్లేట్: రూ. 90 – 100
ప్రారంభ దశలో సరసమైన ధరలు పెట్టడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. రుచి, పరిమాణం, నాణ్యత బాగుంటే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు.
ఎంత పెట్టుబడి అవసరం.?
ఈ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన ముఖ్య అంశాలు:
* ఫుడ్ స్టాల్ / షెడ్: రూ. 40,000 – 80,000 (ప్రాంతాన్ని బట్టి మారుతుంది)
* వంట సామగ్రి: స్టౌవ్, గ్యాస్ సిలిండర్, పెద్ద పాత్రలు, కట్టింగ్ టేబుల్, ప్లేట్లు, స్పూన్లు మొదలైనవి – రూ. 30,000 – 50,000
* రా మెటీరియల్ (ప్రారంభ స్టాక్): బియ్యం, కూరగాయలు, చికెన్, మసాలాలు – రూ. 15,000 – రూ. 20,000 అవసరపడతాయి.
* చెఫ్ / లేబర్ జీతం: ఒక చెఫ్‌కు నెలకు రూ. 12,000 – 18,000 ఇవ్వొచ్చు.
షాప్ రెంట్ (ఉంటే): రూ. 5,000 – 15,000 (ప్రాంతాన్ని బట్టి)
మొత్తంగా ప్రారంభ పెట్టుబడి సుమారు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు అవసరం కావచ్చు.
రోజుకు 100 ప్లేట్లు అమ్మితే లాభాలు ఎలా?
రోజుకు 100 ప్లేట్లు అమ్మారనుకుందాం. ఒక్క ప్లేట్ సగటు ధర: రూ. 70గా తీసుకుంటే. రోజువారీ ఆదాయం రూ. 7000 వరకు ఉంటుంది. రోజువారీ ఖర్చు సుమారుగా రూ. 3000 నుంచి రూ. 3500 అవుతుంది. లేబర్‌తో పాటు ఇతర ఖర్చులకు రోజుకు రూ. 1000 అనుకుంటే ఒక్క రోజుకు మొత్తం రూ. 4500 ఖర్చు అవుతుంది. అంటే రోజుకు తక్కువలో తక్కువ రూ. 2000 నుంచి రూ. 2500 వరకు లాభం పొందొచ్చు. అంటే నెలకు సుమారు రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు ఆదాయం పొందొచ్చు. ఇతర అన్ని ఖర్చులు కలిపినా కనీసం నెలకు రూ. 50 వేల ఆదాయం పొందొచ్చు.
వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి?
ఈ బిజినెస్‌ను మరింత అభివృద్ధి చేయాలంటే. రుచి, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడకూడదు. పరిశుభ్రత పాటించాలి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి, కస్టమర్లకు కూపన్లు, ఆఫర్లు ఇవ్వాలి, హోమ్ డెలివరీ సర్వీస్ ప్రారంభించాలి. భవిష్యత్తులో చిన్న రెస్టారెంట్‌గా విస్తరించుకోవచ్చు. నిరంతర కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ మార్పులు చేస్తే వ్యాపారం వేగంగా ఎదుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు ఈ రంగంలో ఇంతకు ముందే అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదించడం ఉత్తమం.

