MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? ఏప్రిల్ 1 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే

Credit card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? ఏప్రిల్ 1 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే

Credit card: దేశంలో క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల సంఖ్య పెరుగుతోంది. అయితే త్వరలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే వినియోగదారులపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌నుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 27 2026, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సమాచారం తప్పనిసరి
Image Credit : Asianet News

భారీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సమాచారం తప్పనిసరి

కొత్త నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించిన క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే ఆ వివరాలు ఆదాయపన్ను శాఖకు చేరుతాయి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా చెక్ ద్వారా చెల్లించినా ఈ సమాచారం నమోదు అవుతుంది. అలాగే రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదుగా చెల్లిస్తే కూడా అది ఆదాయపన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పెద్ద లావాదేవీలపై పర్యవేక్షణ పెరుగుతుంది.

25
అడ్రస్ ప్రూఫ్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
Image Credit : Gemini

అడ్రస్ ప్రూఫ్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్

పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే స్టేట్‌మెంట్ మూడు నెలల కంటే పాతది కాకూడదు. మూడునెలల కంటే పాత స్టేట్‌మెంట్‌ను చెల్లుబాటు అయ్యే పత్రంగా పరిగణించరు. కాబట్టి పాన్ దరఖాస్తు చేసే వారు తాజా స్టేట్‌మెంట్ ఇవ్వాలి.

Related Articles

Related image1
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Related image2
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?
35
క్రెడిట్ కార్డ్‌తో ట్యాక్స్ చెల్లింపులు
Image Credit : Getty

క్రెడిట్ కార్డ్‌తో ట్యాక్స్ చెల్లింపులు

కొత్త నిబంధనల ప్రకారం ఆదాయపన్ను చెల్లించేందుకు క్రెడిట్ కార్డ్‌ను అధికారిక చెల్లింపు విధానంగా అనుమతించనున్నారు. క్రెడిట్ కార్డ్‌తో పాటు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ట్యాక్స్ చెల్లించవచ్చు. దీంతో పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. డిజిటల్ చెల్లింపులు పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది.

45
క్రెడిట్ కార్డ్‌కు పాన్ నంబర్ తప్పనిసరి
Image Credit : x

క్రెడిట్ కార్డ్‌కు పాన్ నంబర్ తప్పనిసరి

క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి చేయనున్నారు. పాన్ లేకుండా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేయలేవు. ఈ నిబంధన వల్ల లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ట్యాక్స్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

55
వినియోగదారులపై ప్రభావం
Image Credit : Getty

వినియోగదారులపై ప్రభావం

ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డ్ వినియోగం చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భారీ బిల్లులు చెల్లించే వారు తమ ఆదాయం, ఖర్చుల వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే ఈ మార్పులు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే కాకుండా పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా తీసుకున్న చర్యలుగా భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: గుడ్ న్యూస్.. పసిడి ధర ఎంత తగ్గిందంటే...?
Recommended image2
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image3
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Related Stories
Recommended image1
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Recommended image2
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved