Asianet News TeluguAsianet News Telugu

Gold Vs Real Estate: బంగారంలో పెట్టుబడి పెడితే మంచిదా, రియల్ఎస్టేట్ లో పెట్టుబడి మంచిదా..రెండింట్లో ఏది లాభం ?

మీ పెట్టుబడి బంగారంలో పెడితే మంచిదా లేక రియల్ ఎస్టేట్లో పెడితే మంచిదా అనే సందేహం ఇప్పుడు కడుగుతోందా? అయితే ఇది సరైన సమయం అనే చెప్పాలి.  ఎందుకంటే బంగారం ప్రస్తుతం రాకెట్ కన్నా వేగంగా పెరుగుతోంది. ఇంత వేగంగా బంగారం పెరుగుతున్న నేపథ్యంలో మీరు లాభాలను ఒడిసి పట్టుకోవాలని ఆలోచించడం సహజమే. 

Is it better to invest in gold... is it better to invest in real estate.. which of the two is more profitable MKA
Author
First Published May 29, 2023, 12:02 AM IST

బంగారం ధరను గడచిన 20 సంవత్సరాలుగా గమనించినట్లయితే చాలా వేగంగా పెరిగింది అని చెప్పాలి 2003 సంవత్సరంలో బంగారం ధర ఒక తులం అంటే 10 గ్రాములు ఐదువేల రూపాయలు మాత్రమే ఉంది అంటే ఆ రోజుల్లో ఐదు లక్షలు ఖర్చుపెట్టి ఉంటే మీరు కేజీ బంగారం కొనుగోలు చేయగలరు అని అర్థం.  కానీ ప్రస్తుతం బంగారం ధర దాదాపు 62 వేలకు చేరింది.  అంటే మీ 5 లక్షల రూపాయలు ఈరోజు 62 లక్షలు అయి ఉండేవి అని అర్థం. నిజానికి బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినా కూడా  ఇంత డబ్బు మీరు పొంది ఉండేవారు కాదు.

రియల్ ఎస్టేట్ బెస్టా..? బంగారం బెస్టా..?

 అయితే మరోవైపు రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలను గడచిన 20 సంవత్సరాలుగా మనం చేస్తుంది.  కానీ రియల్ ఎస్టేట్ రంగంలో భూమి అన్ని ప్రదేశాల్లోనూ ఒకే రకంగా పెరగదు అదే బంగారం మాత్రం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతం దేశంలో ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉన్న ఒకే తరహాలో పెరుగుతూ ఉంటుంది.  బంగారాన్ని లిక్విడ్ గా లిక్విడ్ క్యాష్ గా మార్చుకోవాలి అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు.  అదే మీరు భూమిని లిక్విడ్ క్యాస్ట్ గా మార్చుకోవాలంటే చాలా తతంగం ఉంటుంది. 

బంగారం వల్ల లాభాలు ఇవే...

 ఇక బంగారు నగలను తనఖా పెట్టి లోన్ పొందడం అనేది క్షణాల్లో పని అనే చెప్పాలి.  మీరు భూమిని తనకా పెట్టి అంత సులభంగా లోన్ పొందలేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. . అయితే పెట్టుబడి విషయానికి వస్తే భూమి అనేది మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు కానీ భూమి కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది.  అదే మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి భూమిని కొనుగోలు చేస్తే అది డెవలప్ అవుతుందో కాదు అన్న సందేహం మీకు కలుగుతుంది.  ఫలితంగా మీరు రిస్క్ తీసుకునేందుకు వెనకాడే అవకాశం ఉంటుంది. 

ఇల్లు కొనాలంటే హోం లోన్ అయితేనే బెస్ట్..? ఎందుకంటే...?

ఇక మీ పెట్టుబడి విషయానికి వస్తే సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అలాంటివారు సొంత ఇంటి కలలు నిజం చేసుకోవడానికి.  బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసుకుంటే మంచిది. . తద్వారా మీరు చాలా లాభం పొందే అవకాశం ఉంది ఎందుకంటే,  లోన్ ద్వారా మీరు ఇల్లు కొన్నట్లయితే,  భవిష్యత్తులో చాలా రెట్లు లాభాన్ని పొందే ఇంటిని ఈరోజు ధరకే మీరు కొంటున్నారు అని అర్థం.  అందుకు మీరు వడ్డీ చెల్లిస్తున్నారు కదా అనే సందేహం మీకు కలగవచ్చు కానీ,  పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చుల నేపథ్యంలో భవిష్యత్తులో మీరు చెల్లించే రుణ వాయిదాలు తక్కువగా అనిపించే అవకాశం ఉంది.  అదే సందర్భంలో మీ ఆదాయం కూడా భవిష్యత్తులో పెరుగుతూ ఉంటుంది అన్న సంగతి గుర్తించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల లోన్ పీరియడ్ తో  అంటే మీరు కట్టే ఇంటికి బ్యాంకు నుంచి రుణం పొంది నెల వాయిదాలు చెల్లిస్తున్నట్లయితే, 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి విలువ చాలా రెట్లు పెరిగి ఉంటుంది అని గమనించాలి. ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాటు డబ్బులు కూడ బెట్టి,  ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం.  ఆ 20 ఏళ్ల కాలంలో ఇళ్ల ధరలు  మీ సేవింగ్స్ కన్నా కూడా చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. 

అందుకే మీకు లభించే ఆదాయంలో రుణం తీసుకొని ఇల్లు కొనాలి.  మీ సేవింగ్స్ లో కొంత భాగం బంగారం కొనుగోలు చేయాలి అన్న సంగతి గుర్తుంచుకోండి.  అలాగే భవిష్యత్తు కోసం NPS, PPF లాంటి పథకాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచిది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios