MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Districts News
  • Hyderabad
  • Real estate: 'రెరా' చట్టం అంటే ఏంటి.? అపార్ట్‌మెంట్ కొనే ముందు ఇది కచ్చితంగా ఎందుకు ఉండాలి.?

Real estate: 'రెరా' చట్టం అంటే ఏంటి.? అపార్ట్‌మెంట్ కొనే ముందు ఇది కచ్చితంగా ఎందుకు ఉండాలి.?

'పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు'. దీనిబట్టే సొంతింటికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చిన్నదో, పెద్దదో ఇల్లు నిర్మించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో అపార్ట్‌మెంట్ కల్చర్‌ భారీగా పెరుగుతోంది.. 

1 Min read
Author : Narender Vaitla
| Updated : Mar 22 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
What is RERA

What is RERA

ల్యాండ్ కొనుగోలు చేసి, ఇంటిని నిర్మించాలంటే చాలా ఖర్చు, సమయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇటీవల చాలా మంది అపార్ట్‌మెంట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండిపెండెంట్‌ ఇంటితో పోల్చితే భద్రత ఎక్కువగా ఉండడం, ఖర్చు తక్కువ అవుతుండడంతో చాలా మంది అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రడీ టూ మూవ్‌ అయితే నిర్మాణంలో ఉండేవి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
rera

rera

సాధరణంగా రడీ టూ మూవ్‌ అపార్ట్‌మెంట్‌ ధరలు ఎక్కువగా ఉంటాయి. అదే అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ అపార్ట్‌మెంట్‌ల ధరలు తక్కువగా ఉంటాయి. అయితే నిర్మాణంలో ఉన్న ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే సమయంలో 'రెరా' అనుమతులు ఉన్నాయా.? లేదా అన్న విషయాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని రియల్ ఎస్టేట్‌ నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ రెరా అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

34
rera

rera

'RERA అంటే ఏంటి.? 

రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిదే RERA (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులరేటరీ అథారిటీ). అపార్ట్‌మెంట్‌లను నిర్మించే బిల్డర్స్‌ కచ్చితంగా రెరా అనుమతులు తీసుకోవాల్సిందే. సాధారణంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణం మొదలైన కొత్తలోనే కస్టమర్ల నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తుంటారు. అయితే బిల్డర్స్‌ చెప్పిన సమయానికి ఫ్లాట్‌ను అందించాల్సి ఉంటుంది. 

44

ఇందులో ఆలస్యమైతే రెరా చట్టం ప్రకారం బిల్డర్‌పై చర్యలు తీసుకుంటారు. ఒకవేళ చెప్పిన సమయానికి మించి ఎక్కువ ఆలస్యమైతే మీరు అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని బిల్డర్‌ తిరిగి చెల్లిస్తారు. అంతేకాకుండా మీరు చెల్లించిన మొత్తానికి 10 శాతం చొప్పున వడ్డీని కూడా తిరిగి చెల్లించాలని రెరా చట్టం చెబుతోంది. ఒకవేళ మీరు అదే అపార్ట్‌మెంట్‌ కావాలనుకుంటే బిల్డర్‌ నుంచి వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లిస్తారు. అందుకే అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసే ముందు రెరా అనుమతులు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని కచ్చితగా తెలుసుకోవాలి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
భారత దేశం
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bitter Gourd: ఇలా చేస్తే కాకరకాయ ఎలా వండినా చేదనిపించదు
Recommended image2
Black Pepper: రోజూ 2 మిరియాలు తింటే...ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Snakes : హైదరాబాద్ లో పాములే పాములు.. ఏకంగా 55,467..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved