MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

Badam Sabudana Kheer: వచ్చేవన్నీ పండగలే. దేవీనవరాత్రులు, పూజల సమయంలో రకరకాల స్వీట్స్ తయారుచేస్తుంటారు. అయితే ఒకసారి స్పెషల్ బాదం సగ్గుబియ్యం పాయసం బెస్ట్ ఆప్షన్. చిక్కగా, క్రీమీగా ఉంటుంది. సరే రెసిపీ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 10 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేవీ నవరాత్రి స్పెషల్ బాదం సగ్గుబియ్యం పాయసం
Image Credit : vismai food/Youtube

దేవీ నవరాత్రి స్పెషల్ బాదం సగ్గుబియ్యం పాయసం

నవరాత్రులు, పండుగలు, పూజల సమయంలో స్పెషల్ స్వీట్ చేయాలనుకుంటున్నారా? అయితే బాదం సగ్గుబియ్యం పాయసం చాలా బెస్ట్ ఆప్షన్. బాదం పప్పుల రుచి, సగ్గుబియ్యం మెత్తదనం కలిసిన ఈ పాయసం చిక్కగా, క్రీమీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నవరాత్రి ఉపవాస సమయంలో మీ ఆచారాలకు అనుగుణంగా తీసుకోవాలనుకునేవారు కూడా ఈ రెసిపీని ప్రయత్నించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాదం సగ్గుబియ్యం పాయసం స్పెషల్ ఏంటీ?
Image Credit : vismai food/Youtube

బాదం సగ్గుబియ్యం పాయసం స్పెషల్ ఏంటీ?

సాధారణ పాయసానికి భిన్నంగా బాదం, సగ్గుబియ్యంతో తయారుచేసే ఈ స్వీట్‌కు ప్రత్యేకమైన రుచి, చిక్కదనం ఉంటాయి. బాదం పప్పులు పాయసానికి మంచి రుచిని అందిస్తే..సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మెత్తగా మారి పాయసానికి క్రీమీ టెక్స్చర్‌ను ఇస్తుంది. నవరాత్రి వేడుకలు, పూజలు, ప్రసాదం, కుటుంబ వేడుకల సమయంలో దీన్ని తయారు చేసుకోవచ్చు.

35
బాదం సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం
Image Credit : vismai food/Youtube

బాదం సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం

ఈ పాయసం తయారు చేసేటప్పుడు సగ్గుబియ్యాన్ని సరిగ్గా ఉడికించడం, పాలు చిక్కబడే వరకు తగినంత సమయం మరిగించాలి. బాదం పప్పులను ముందుగా నానబెట్టి పొట్టు తీసి, దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. మధ్యలో సగ్గుబియ్యం, పాలు మరుగుతున్నప్పుడు బాదం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పాలు, సగ్గుబియ్యం, బాదం, చక్కెరతో పాటు మీ రుచికి తగినట్లు యాలకుల పొడి కలిపితే పాయసానికి మంచి సువాసన వస్తుంది.

ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి కొంతసేపు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిలో లేదా పాలలో మెత్తగా ఉడికించాలి. మరోవైపు పాలను వేడి చేసి అందులో సిద్ధం చేసుకున్న బాదం పేస్ట్ లేదా బాదం ముక్కలు కలపాలి. అనంతరం ఉడికిన సగ్గుబియ్యాన్ని పాలలో వేసి, చక్కెర వేసి తక్కువ మంటపై మరిగించాలి. పాయసం కావాల్సిన చిక్కదనానికి వచ్చిన తర్వాత యాలకుల పొడి కలిపి దించుకోవాలి. వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు.

45
బాదం సగ్గుబియ్యం పాయసం ప్రత్యేకత ఏమిటి?
Image Credit : vismai food/Youtube

బాదం సగ్గుబియ్యం పాయసం ప్రత్యేకత ఏమిటి?

సాధారణ పాయసానికి భిన్నంగా బాదం, సగ్గుబియ్యంతో తయారుచేసే ఈ స్వీట్‌కు ప్రత్యేకమైన రుచి, చిక్కదనం ఉంటాయి. బాదం పప్పులు పాయసానికి మంచి రుచిని అందిస్తే..సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మెత్తగా మారి పాయసానికి క్రీమీ టెక్స్చర్‌ను ఇస్తుంది. నవరాత్రి వేడుకలు, పూజలు, ప్రసాదం, కుటుంబ వేడుకల సమయంలో దీన్ని తయారు చేసుకోవచ్చు.

55
పాయసం రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి
Image Credit : vismai food/Youtube

పాయసం రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి

సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే పాయసాన్ని దించుకోవాలి. పాలు అడుగున అంటుకోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాయసం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి, స్టవ్‌పై ఉన్నప్పుడే మరీ గట్టిగా అయ్యే వరకు మరిగించకూడదు. బాదం పేస్ట్ వేస్తే పాయసానికి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. స్పెషల్ స్వీట్‌గా, పూజా ప్రసాదంగా , డెజర్ట్‌గా బాదం సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image2
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Recommended image3
బాగా ఉన్నోళ్లే కాదు మ‌నం కూడా డిష్ వాషర్ కొనుక్కోవచ్చు.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫ‌ర్
Related Stories
Recommended image1
Navaratri Fasting: నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ 9 రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి
Recommended image2
Inspiring Story: అమ్మమ్మ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం..ఇప్పుడు రూ.580 కోట్ల బ్రాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved