- Home
- Business
- 8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?
8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?
8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరిలో 5 శాతం డీఏ పెంపు అందే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు ముందే 63 శాతానికి డీఏ చేరనుందని అంచనా. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

8వ వేతన సంఘం బాంబ్ పేలింది.. ఇక ఉద్యోగులకు పండగే పండగ!
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. ఇంటి అద్దెలు, రేషన్ సరుకులు, మందులు, పిల్లల చదువులు ఇలా ప్రతీది ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఈ తరుణంలో జీతాలు లేదా పెన్షన్ పెంపు వార్త వింటే ఉద్యోగులకు కలిగే ఉపశమనం అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి శుభవార్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం జనవరిలోనే రాబోతోంది.
8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వేళ, డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) విషయంలో భారీ పెంపు ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జనవరి నెలలోనే డీఏ సుమారు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
డీఏ 5 శాతం పెరిగే అవకాశం ఉందా?
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్ 2025 నెలకు సంబంధించిన AICPI-IW (పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక) గణాంకాలను విడుదల చేసింది. ఈ సూచిక 148.2 పాయింట్ల వద్ద నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ నేరుగా ఈ ఇండెక్స్‌పైనే ఆధారపడి ఉంటాయి.
దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలు, నివాసం, వస్త్రాలు, ఇంధనం, ఆరోగ్యం, రవాణా, విద్య వంటి అత్యవసర సేవల ధరలలో వచ్చే మార్పులను ఈ సూచిక ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ గణాంకాల ఆధారంగా, ఈ ఏడాది జనవరిలోనే డీఏ, డీఆర్ 5 శాతం పాయింట్ల మేర పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
63 శాతానికి చేరుకోనున్న డీఏ
కేంద్ర ప్రభుత్వం గతంలో జూలై 2025లో డీఏను 4 శాతం పెంచడంతో అది 54 శాతం నుంచి 58 శాతానికి చేరిన విషయం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం, జనవరిలో 5 శాతం పెంపునకు ఆమోదం లభిస్తే, మొత్తం డీఏ 61 శాతం నుండి 63 శాతం పరిధిలోకి చేరుకునే అవకాశం ఉంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన AICPI-IW డేటా కీలకం కానుంది. త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
8వ వేతన సంఘం ఎప్పటి నుండి అమలవుతుంది?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన పనిని కూడా ప్రారంభించింది. ఈ కమిషన్‌కు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్-టైమ్ మెంబర్‌గా, పంకజ్ జైన్ మెంబర్-సెక్రటరీగా నియమితులయ్యారు. కమిషన్ విధివిధానాలు కూడా ఖరారయ్యాయి.
ప్రభుత్వ అధికారిక టైమ్‌లైన్ ప్రకారం, ఈ కమిషన్ సిఫార్సులు 1 జనవరి 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, రిపోర్టు తయారీ, అమలు ప్రక్రియకు సుమారు రెండేళ్ల సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. ఈ మధ్య కాలంలో పెరిగే డీఏ మాత్రమే ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
50 లక్షల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు ఎంత పెరుగుతాయి?
ఒకవేళ జనవరిలో అంచనా వేసినట్లుగా డీఏ పెంపు జరిగితే, దీని వల్ల 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 69 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారు. వారి నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. మార్కెట్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు ఉద్యోగుల గృహ బడ్జెట్‌ను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో 5 శాతం డీఏ పెరిగితే, వారి జీతాల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ పెంపు ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి కనీస మూల వేతనం రూ. 18,000 అనుకుంటే, 5 శాతం డీఏ పెంపుతో వారి నెలవారీ జీతం రూ. 900 పెరుగుతుంది. అంటే ఏడాదికి రూ. 10,800 అదనంగా చేతికి అందుతాయి.
అదే విధంగా, ఒకవేళ ఉద్యోగి బేసిక్ పే రూ. 56,900 ఉంటే, వారికి నెలకు రూ. 2,845 చొప్పున, ఏడాదికి ఏకంగా రూ. 34,140 వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. ఇవి అంచనాలు మాత్రమే.

