MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Hyundai Ioniq 5 : ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్-వైజాగ్ నాన్‌స్టాప్ జర్నీ.. 690KM రేంజ్ ఏంటి గురూ..!

Hyundai Ioniq 5 : ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్-వైజాగ్ నాన్‌స్టాప్ జర్నీ.. 690KM రేంజ్ ఏంటి గురూ..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇప్పటికే ఇండియాలో అనేక సక్సెస్ ఫుల్ మోడల్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు మరో సూపర్ కారును సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారేది… ధర ఎంత… ఫీచర్లేంటి..? ఫుల్ డిటెయిల్స్ అందిస్తున్నాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 29 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐయానిక్ 5 ఫేస్ లిప్ట్ ధర ఎంతో తెలుసా..?
Image Credit : x

ఐయానిక్ 5 ఫేస్ లిప్ట్ ధర ఎంతో తెలుసా..?

భారత మార్కెట్లో 2023లో అడుగుపెట్టిన ఐయానిక్ 5 ఇప్పుడు మొదటిసారిగా పెద్ద అప్‌డేట్స్‌తో వచ్చింది. ఈ కొత్త 2026 హ్యుందాయ్ ఐయానిక్ 5 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను రూ.55.7 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేశారు. దీనిలో కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్లు ఏంటో చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఐయానిక్ 5 ఈవి రేంజ్ ఎంతో తెలుసా..?
Image Credit : x

ఐయానిక్ 5 ఈవి రేంజ్ ఎంతో తెలుసా..?

హ్యుందాయ్ E-GMP (ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్) ప్లాట్‌ఫామ్‌పై దీన్ని తయారుచేశారు. పర్ఫార్మెన్స్, టెక్నాలజీ, సేఫ్టీలో చాలా అప్‌గ్రేడ్స్ చేశారు. ఈ కారు అబ్సిడియన్ బ్లాక్ క్యాబిన్ థీమ్‌తో పాటు టైటాన్ గ్రే, గ్రావిటీ గోల్డ్ మ్యాట్, మిడ్‌నైట్ బ్లాక్ పెర్ల్, ఆప్టిక్ వైట్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.

ఈ అప్‌డేట్‌లో అత్యంత ముఖ్యమైనది దీని 84.0kWh బ్యాటరీ ప్యాక్. ARAI సర్టిఫికేషన్ ప్రకారం ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 690 కిలోమీటర్ల వరకు వెళ్తుంది… అంటే హైదరాబాద్-వైజాగ్ నాన్ స్టాప్ జర్నీ అన్నమాట. 'ఈ అప్‌గ్రేడ్ వల్ల రేంజ్ గురించిన ఆందోళన తగ్గుతుంది, లాంగ్ డ్రైవ్‌లు మరింత సులభం అవుతాయి' అని హ్యుందాయ్ చెబుతోంది. 

అయితే ఈ ఐయానిక్ 5 ఫేస్ లిప్ట్ ఇండియా-స్పెక్ మోడల్ పవర్, టార్క్ వివరాలను హ్యుందాయ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గ్లోబల్ మార్కెట్లో 84.0kWh బ్యాటరీ ఉన్న మోడల్ 229bhp పవర్, 350Nm టార్క్ ఇస్తుంది.

Related Articles

Related image1
Car AC : ఈ మండుటెండల్లో మీ కారు ఏసీ కూలింగ్ పెరగాలా..? ఈ 5 చిట్కాలు పాటించండి
Related image2
Hyundai creta: రూ. 50 వేల జీతం ఉన్నా చాలు.. ఈ కారు కొనుక్కోవ‌చ్చు. రూ. ల‌క్ష డౌన్‌పేమెంట్‌తో..
35
ఐయానిక్ 5 ఔట్ లుక్
Image Credit : x

ఐయానిక్ 5 ఔట్ లుక్

కొత్త 2026 హ్యుందాయ్ ఐయానిక్ 5 ఔట్ లుక్ చూస్తే.. ముందు, వెనుక బంపర్లు, కొత్త స్కిడ్ ప్లేట్లు, కొత్తగా డిజైన్ చేసిన అలాయ్ వీల్స్, కొత్త హైటెక్ వి-గార్నిష్ లైటింగ్ డిజైన్, కొత్త రియర్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. అయితే ఈ కారు ప్రత్యేకత అయిన పారామెట్రిక్ పిక్సెల్ డిజైన్ లైటింగ్‌ను మాత్రం మార్చలేదు.

45
ఐయానిక్ 5 ఇంటీరియర్
Image Credit : Hyundai

ఐయానిక్ 5 ఇంటీరియర్

కారు లోపల 4-డాట్ పిక్సెల్ లైట్ డిజైన్, హీటింగ్ ఫంక్షన్‌తో కూడిన కొత్త త్రీ-స్పోక్ లెదర్ స్టీరింగ్ వీల్ ఉంది. ఇది ఇంటీరియర్‌కు మరింత ఆధునిక లుక్ ఇస్తోంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలను కొనసాగించారు. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను కూడా రీడిజైన్ చేశారు. ఇప్పుడు హీటెడ్, వెంటిలేటెడ్ సీట్ల బటన్లను కూడా దీనిలోనే కలిపేశారు.

55
సేఫ్టీ ఫీచర్లు, ఇతర సౌకర్యాలు..
Image Credit : HYUNDAI

సేఫ్టీ ఫీచర్లు, ఇతర సౌకర్యాలు..

సౌకర్యాల విషయానికొస్తే కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5లో కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్ (ccNC), కంట్రోలర్ ఓవర్-ది-ఎయిర్ (C-OTA) అప్‌డేట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, యాక్టివ్ సౌండ్ డిజైన్ (ASD), హ్యుందాయ్ బ్లూలింక్ ద్వారా రిమోట్ ఇమ్మొబిలైజేషన్, కొత్త ఇన్-కార్ పేమెంట్ సౌకర్యం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఈ అప్‌డేటెడ్ SUVలో పార్కింగ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ - రియర్ (PCA-R), పార్కింగ్ డిస్టెన్స్ వార్నింగ్ (PDW - సైడ్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు.

కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5 లాంచ్ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తరుణ్ గార్గ్ మాట్లాడారు. 'ఎలక్ట్రిక్ మొబిలిటీని పునర్నిర్వచించాలనే మా లక్ష్యానికి హ్యుందాయ్ ఐయానిక్ 5 ఒక నిజమైన నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గుర్తింపులతో పాటు, ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్', 'గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను గెలుచుకుంది. డిజైన్, టెక్నాలజీ, స్థిరత్వంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కొత్త ఐయానిక్ 5తో డ్రైవింగ్ రేంజ్, టెక్నాలజీ, రోజువారీ సౌకర్యాన్ని పెంచే అప్‌డేట్స్ అందిస్తున్నాం. ఈ మార్పులు ప్రీమియం, ఫ్యూచర్-రెడీ ఎలక్ట్రిక్ SUVగా ఐయానిక్ 5 ఆకర్షణను మరింత బలోపేతం చేస్తాయి' అని ఆయన పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
హైదరాబాద్
సాంకేతిక వార్తలు చిట్కాలు
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
Best EV in India : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. టాప్ 5 బెస్ట్ ఈవీ కార్లు ఇవే
Recommended image2
TATA Cars Offer : టాటా నెక్సాన్, పంచ్, కర్వ్ EV లపై బంపరాఫర్ .. డిస్కౌంట్ డబ్బులతో మరో కారే కొనొచ్చు..!
Recommended image3
Upcoming Cars : మీరు కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ టాప్ 5 కాంపాక్ట్ SUV ల గురించి తెలుసుకోవాల్సిందే..
Related Stories
Recommended image1
Car AC : ఈ మండుటెండల్లో మీ కారు ఏసీ కూలింగ్ పెరగాలా..? ఈ 5 చిట్కాలు పాటించండి
Recommended image2
Hyundai creta: రూ. 50 వేల జీతం ఉన్నా చాలు.. ఈ కారు కొనుక్కోవ‌చ్చు. రూ. ల‌క్ష డౌన్‌పేమెంట్‌తో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved