MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Car AC : మ్యానువల్ ఏసీ vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ .. మీ కారుకు ఏది బెస్ట్?

Car AC : మ్యానువల్ ఏసీ vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ .. మీ కారుకు ఏది బెస్ట్?

కారులో మాన్యువల్ ఏసీ మంచిదా లేక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ బెటరా..? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి..? ఈ రెండిట్లో ప్లస్సులు, మైనస్సులు ఏమున్నాయో ఇక్కడ వివరంగా చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : May 20 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మ్యానువల్ ఏసీ vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
Image Credit : Gemini AI

మ్యానువల్ ఏసీ vs ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

కొత్తగా కారు కొనాలనుకునే వాళ్లు మాన్యువల్ ఏసీ ది ఎంచుకోవాలా..? ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎంచుకోవాలా..? ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మాన్యువల్ ఏసీ సరిపోతుందా లేక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్న కారు కొనాలా అని ఆలోచిస్తుంటారు. ఈ రెండు ఏసీ సిస్టమ్స్ మధ్య తేడాలు, వాటి లాభనష్టాలు ఏంటో సింపుల్‌గా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మ్యానువల్ ఏసీ ఎలా పని చేస్తుంది?
Image Credit : Asianet News

మ్యానువల్ ఏసీ ఎలా పని చేస్తుంది?

మ్యానువల్ ఏసీ సిస్టమ్ ఉన్న కార్లలో టెంపరేచర్, గాలి వేగాన్ని మనమే మార్చుకోవాలి. దీనికి మూడు నాబ్స్ ఉంటాయి. ఒకటి టెంపరేచర్, రెండోది ఫ్యాన్ స్పీడ్, మూడోది గాలి వచ్చే దిశను సెట్ చేయడానికి. ఈ సిస్టమ్ కారులోని వేడి గాలిని కూలింగ్ యూనిట్ ద్వారా చల్లబరిచి, బ్లోయర్ సహాయంతో క్యాబిన్‌లోకి పంపుతుంది. 

ప్రయోజనాలు: 

బడ్జెట్‌లో వస్తుంది : ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కంటే మ్యానువల్ ఏసీ సిస్టమ్ ధర తక్కువ. అందుకే బడ్జెట్ కార్లలో ఇదే ఉంటుంది. 

మెయింటెనెన్స్ సులభం : ఇందులో తక్కువ భాగాలు ఉంటాయి. కాబట్టి మెకానిక్‌లు దీన్ని రిపేర్ చేయడం చాలా సులభం. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. 

లోపాలు : 

ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు : మ్యానువల్ ఏసీలో ఒకే ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడం కష్టం. కొన్నిసార్లు చాలా చల్లగా, కొన్నిసార్లు వేడిగా అనిపిస్తుంది. 

పదేపదే మార్చాలి: లాంగ్ డ్రైవ్స్‌లో టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్‌ను పదేపదే మార్చాల్సి వస్తుంది. ఇది డ్రైవర్‌కు చికాకు కలిగించడమే కాకుండా, వాళ్ల దృష్టిని మరల్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Summer Car Care: ఎండ‌లో కారును చెట్టు కింద పార్క్ చేస్తున్నారా.? భారీ మూల్యం చెల్లించాల్సిందే
Related image2
Old Car: మీరు కారు కొని ఎన్నేళ్లయింది.? ఈ ప‌ని చేయ‌క‌పోతే భారీ జరిమానా త‌ప్ప‌దు
33
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఎలా పని చేస్తుంది?
Image Credit : Asianet News

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఎలా పని చేస్తుంది?

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఒక స్మార్ట్ ఏసీ సిస్టమ్ లాంటిది. ఇది కారు లోపల ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. మీరు ఒకసారి టెంపరేచర్ సెట్ చేస్తే చాలు, అందులోని సెన్సార్లు అదే ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేస్తాయి. మీరు పదేపదే కంట్రోల్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. 

ప్రయోజనాలు : 

భద్రత : డ్రైవర్ ఏసీని పదేపదే అడ్జస్ట్ చేయాల్సిన పనిలేదు కాబట్టి, వాళ్ల దృష్టి డ్రైవింగ్‌పైనే ఉంటుంది. ఇది భద్రతను పెంచుతుంది. 

మంచి మైలేజ్ : ఈ సిస్టమ్, అవసరం లేనప్పుడు ఏసీ కంప్రెసర్‌ను ఆపుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది, కారు మంచి మైలేజ్ ఇస్తుంది. 

లోపాలు :

రిపేర్ ఖర్చు ఎక్కువ : ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీలో చాలా సెన్సార్లు, ఇతర భాగాలు ఉంటాయి. ఇది మ్యానువల్ ఏసీ కంటే సంక్లిష్టమైనది. అందుకే ఇది రిపేర్ వస్తే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

వాడటంలో కొంత గందరగోళం: కొంతమందికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌లోని బటన్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మొదటిసారి వాడేవారికి ఈ సెట్టింగ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా అనిపించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
Summer Car Care: ఎండ‌లో కారును చెట్టు కింద పార్క్ చేస్తున్నారా.? భారీ మూల్యం చెల్లించాల్సిందే
Recommended image2
Old Car: మీరు కారు కొని ఎన్నేళ్లయింది.? ఈ ప‌ని చేయ‌క‌పోతే భారీ జరిమానా త‌ప్ప‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved