Cheapest Bikes : రూ.80 వేలలోపు బడ్జెట్లోనే.. బెస్ట్ మైలేజ్ టాప్ 5 బైక్స్ ఇవే
తక్కువ బడ్జెట్‌లోనే మంచి మైలేజ్ బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే కేవలం రూ.80,000 లోపు ధరలో, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ కూడా ఉన్నాయి. వాటిలో టాప్ 5 గురించి తెలుసుకుందాం.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Delux)
హీరో కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ మన దేశంలోని పల్లెటూర్లు, పట్టణాల్లో బాగా అమ్ముడవుతుంది. దీని స్టైలిష్ లుక్, మంచి పనితీరు వల్ల ఇది చాలా పాపులర్ అయింది. దీని మాన్యువల్ బైక్స్ ఆన్-రోడ్ ధర రూ.68,080 నుంచి మొదలవుతుంది. సెల్ఫ్-స్టార్ట్ వేరియంట్లు కూడా రూ.80,000 బడ్జెట్‌లోనే వస్తాయి.
ఈ బైక్ లీటర్‌కు సుమారు 68 నుంచి 70 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఇందులో హీరో ప్రత్యేకమైన i3S టెక్నాలజీ ఉంది. ఇది ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసి, క్లచ్ నొక్కగానే మళ్లీ స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల పెట్రోల్ బాగా ఆదా అవుతుంది.

హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, ఏళ్ల తరబడి ఎలాంటి ఇబ్బంది పెట్టని బైక్ కావాలంటే మాత్రం హీరో హెచ్ఎఫ్ 100 పర్పెక్ట్ ఎంపిక. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.69,024 కాగా, ఎక్స్-షోరూమ్ ధర రూ.59,840. ఇది లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే ఫుల్ ట్యాంక్ (9.1 లీటర్లు) కొట్టిస్తే 600 కిలోమీటర్లకు పైగా ఈజీగా వెళ్లొచ్చు. ఇది కిక్-స్టార్ట్‌తో వస్తుంది. ధర తక్కువగా ఉంచేందుకు ఇందులో సెల్ఫ్-స్టార్ట్ ఫీచర్ తీసేశారు. కానీ, సేఫ్టీ విషయంలో రాజీ పడలేదు. బండి కింద పడితే ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది (ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్).
హోండా షైన్ 100 (Honda Shine 100)
హోండా బైక్‌లు వాటి స్మూత్ ఇంజిన్లకు పెట్టింది పేరు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉండకూడదనుకుంటే షైన్ 100 ఒక మంచి ఆప్షన్. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.69,468. ఇది లీటర్‌కు 65-68 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, దీని సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రోజంతా నడిపినా నడుము నొప్పి రాదు.
బజాజ్ సీటీ 110X (Bajaj CT 110X)
మీరు ఉండే ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేవా..? లేదా మీరు నిత్యం బరువైన సామాన్లు తీసుకెళ్లాలా..? అయితే బజాజ్ సీటీ 110X చాలా గట్టి, రఫ్ అండ్ టఫ్ బైక్. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.73,676 కాగా, ఎక్స్-షోరూమ్ ధర రూ.67,284. ఇందులో కొంచెం పెద్దదైన 115.45cc ఇంజిన్ ఉంటుంది. ఇది కొండలు, గతుకుల రోడ్లపై మంచి గ్రిప్, పవర్ ఇస్తుంది. దీని లుక్ కొంచెం స్పోర్టీగా, ఆఫ్-రోడ్ బైక్‌లా ఉండటంతో యూత్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది.
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
మీరు ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కోరుకుంటే బజాజ్ ప్లాటినా 100 ఇప్పటికీ ఒక పాపులర్ ఛాయిస్. ఈ బైక్ సిటీల్లో, పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.75,121. ఇది లీటర్‌కు దాదాపు 70 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. దీని పొడవైన, మెత్తని సీటు గతుకుల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులో 99.59cc DTS-i ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ పాపులర్ బజాజ్ బైక్‌లో యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అమర్చారు.
గమనిక : బైక్స్ ధరలు మైలేజ్, ఫీచర్లు, నగరం, డీలర్‌షిప్, మోడల్, సమయాన్ని బట్టి మారవచ్చు. ఆన్-రోడ్ ధరలో RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిసి ఉంటాయి. బైక్ కొనే ముందు, మీ దగ్గర్లోని షోరూమ్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో లేటెస్ట్ సమాచారాన్ని చెక్ చేసుకోండి.

