MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Automobile
  • Car AC : ఈ మండుటెండల్లో మీ కారు ఏసీ కూలింగ్ పెరగాలా..? ఈ 5 చిట్కాలు పాటించండి

Car AC : ఈ మండుటెండల్లో మీ కారు ఏసీ కూలింగ్ పెరగాలా..? ఈ 5 చిట్కాలు పాటించండి

వేసవిలో కారు ఏసీ పనితీరును మెరుగుపరిచే 5 సులభమైన చిట్కాలు ఇవి. ఈ మండుటెండల్లో ప్రయాణాలు చేసేవారు ఈ చిట్కాలు పాటించారో చల్లచల్లగా జర్నీ చేయడమే కాదు ఇంధనం ఆదా చేసుకుంటారు.   

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 28 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీ కారును మరింత చల్లగామార్చే ఏసీ చిట్కాలు...
Image Credit : Gemini AI

మీ కారును మరింత చల్లగామార్చే ఏసీ చిట్కాలు...

ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి… తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రయాణమంటే ఇబ్బందులు తప్పవు… ఇక కారులో ఏసీ సరిగ్గా పనిచేయకుంటే ఆ ప్రయాణం నరకమే. అయితే చాలామంది కారు ప్రయాణంలో కొన్ని సింపుల్ విషయాలను పట్టించుకోరు… దీనివల్ల కూడా ఏసీ కూలింగ్ తగ్గి, కారుపై అదనపు భారం పడుతుంది. ఈ ఐదు చిట్కాలు పాటిస్తే మీ కారు ఏసీ పనితీరును సులభంగా మెరుగుపరుచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వేడి గాలిని బయటకు పంపండి
Image Credit : formacar.com

వేడి గాలిని బయటకు పంపండి

కారును ఎండలో పార్క్ చేసినప్పుడు లోపలంతా వేడి గాలి నిండిపోతుంది. ఇలాంటి సమయంలో కారు స్టార్ట్ చేసేముందు నిమిషంపాటు డోర్లు, కిటికీలు తెరిచి ఉంచండి. దీంతో లోపలున్న వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది... అప్పుడు కారు స్టార్ట్ చేసి ఏసి ఆన్ చేస్తే క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది.

Related Articles

Related image1
Summer Tour : లక్షలు కాదు కేవలం వెేల ఖర్చుతోనే ఫారిన్ టూర్.. ఈ 10 దేశాలు చాలా చీప్ గురూ..!
Related image2
Summer Grooming: ఎండాకాలంలో ఇలా చేస్తే చెమట దుర్వాసన రాదు
36
కారు స్టార్ట్ చేయగానే ఏసీ ఆన్ చేయకండి
Image Credit : audi India

కారు స్టార్ట్ చేయగానే ఏసీ ఆన్ చేయకండి

కారు స్టార్ట్ చేయగానే ఏసీ ఆన్ చేసి ఫుల్ కూలింగ్‌లో పెట్టకూడదు... ముందు కారును కాసేపు నడపండి. కొద్దిదూరం వెళ్లాక ఏసి ఆన్ చేయండి... ఎందుకంటే ఇంజిన్ రన్ అవుతుంటే ఏసీ కంప్రెసర్ సమర్థంగా పనిచేసి, క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. సిస్టమ్‌పై ఓవర్‌లోడ్ పడకుండా నెమ్మదిగా టెంపరేచర్ తగ్గించుకుంటూ వెళ్లండి.

46
రీసర్క్యులేషన్ మోడ్‌ను సరిగ్గా వాడండి
Image Credit : X@AarizRizvi

రీసర్క్యులేషన్ మోడ్‌ను సరిగ్గా వాడండి

కారులోని రీసర్క్యులేషన్ మోడ్‌ను ఆన్ చేయండి… దీంతో బయటి వేడి గాలి లోపలికి రాకుండా క్యాబిన్‌లోని గాలినే మళ్లీ మళ్లీ చల్లబరుస్తుంది. దీనివల్ల క్యాబిన్ త్వరగా కూల్ అవుతుంది. 

అయితే లాంగ్ డ్రైవ్స్‌లో దీన్ని కంటిన్యూగా వాడొద్దు. ఎందుకంటే లోపల గాలి నాణ్యత తగ్గే అవకాశం ఉంది. అప్పుడప్పుడు బయట గాలి కూడా కారులోకి వచ్చేలా రిసర్క్యులేషన్ మోడ్ ను సెట్ చేసుకుంటూ ఉండాలి.

56
మీ ఏసీని రెగ్యులర్‌గా సర్వీస్ చేయించండి
Image Credit : X@basedauto

మీ ఏసీని రెగ్యులర్‌గా సర్వీస్ చేయించండి

ఈ ఎండాకాలం ఏసీ సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి, గ్యాస్ లెవల్స్ చెక్ చేయించాలి, లీకులు లేకుండా చూసుకోవాలి. రెగ్యులర్ సర్వీసింగ్ వల్ల ఏసీ పనితీరు బాగుంటుంది.

66
సరైన చోట పార్క్ చేయండి
Image Credit : Asianet News

సరైన చోట పార్క్ చేయండి

వీలైనంత వరకు మీ కారును నీడలో పార్క్ చేయండి. ఇది కారు లోపలి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అప్పుడు ఏసీపై అంతగా భారం పడదు, తక్కువ సమయంలోనే కారు చల్లబడుతుంది. మండుటెండల్లో హాయిగా ప్రయాణించవచ్చు.

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వేసవిలోనూ మీ కారు చల్లగా ఉంటుంది. అంతేకాదు జాగ్రత్తగా ఏసి వాడటంవల్ల ఇంధనం ఆదా అవుతుంది... తద్వారా డబ్బులు ఆదా అవడంతో పాటు ఏసీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇలా ఈ వేసవిలో మీ కారు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకొండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
చిట్కాలు మరియు ఉపాయాలు
యుటిలిటీ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
BMW Full Form : లగ్జరీ కార్ల కంపెనీ బిఎండబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా?
Recommended image2
Cars : కేవలం రూ.10 లక్షల బడ్జెట్ లో 360-డిగ్రీ కెమెరా కార్లు.. టాప్ 3 మోడల్స్ ఇవే
Recommended image3
ఇండియాలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర, ఫీచర్లు అదుర్స్!
Related Stories
Recommended image1
Summer Tour : లక్షలు కాదు కేవలం వెేల ఖర్చుతోనే ఫారిన్ టూర్.. ఈ 10 దేశాలు చాలా చీప్ గురూ..!
Recommended image2
Summer Grooming: ఎండాకాలంలో ఇలా చేస్తే చెమట దుర్వాసన రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved