Zodiac Signs: రాహు అనుగ్రహంతో జూలై 28 వరకు ఈ 6 రాశులకు తిరుగేలేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ప్రస్తుతం కుంభరాశిలో శుభ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల 6 రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. జూలై 28 వరకు వారికి తిరుగేలేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మేష రాశిపై రాహు ప్రభావం
మేష రాశి వారికి అనుకూల స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. రాహువుపై గురు, కుజ గ్రహాల దృష్టి ఉండటం వల్ల ఈ రాశివారికి ఆదాయంలో వృద్ధి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణం, సంతాన ప్రాప్తి, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. లాభాలు పెరుగుతాయి. షేర్లు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి అదృష్ట స్థానంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. మంచి ఉద్యోగానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తున్న రాహువుపై గురు, కుజ గ్రహాల దృష్టి ఉండటం శుభప్రదం. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆస్తులు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి దక్కుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
కన్య రాశి
కన్య రాశి వారికి 6వ స్థానంలో రాహువు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గురు, కుజ గ్రహాల దృష్టి ఉండటం వల్ల రాహువు ఇచ్చే శుభ యోగాలు త్వరగా ఫలిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు ఊహించని విధంగా పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఇంట్లో సంతోషం నెలకొంటుంది. గురు, కుజ గ్రహాల దృష్టి ఉండటం వల్ల మరింత శుభం జరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది.
కుంభ రాశి
కుంభ రాశిలో రాహువు సంచరిస్తున్నందున ఈ రాశిపై గురు, కుజ గ్రహాల దృష్టి ఉంటుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆస్తి కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చిన్న ప్రయత్నంతో ఊహించని ఆదాయం పొందుతారు.