జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో బుధుడి, శని గ్రహాలు కలిసి నవపంచమ యోగాన్నిఏర్పరచనున్నాయి. ఈ యోగం వల్ల 5 రాశుల వారికి మేలు జరగనుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారాల్లో అద్భుతమైన విజయం దక్కనుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో ఓసారి చూసేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శని కలిసి జూన్ 28న నవపంచమ యోగాన్ని ఏర్పరచనున్నాయి. ఆ రోజు ఉదయం బుధ-శని ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఏవైనా రెండు గ్రహాలు జాతకంలో తొమ్మిది, ఐదో స్థానాల్లో ఉన్నప్పుడు ఈ కోణం ఏర్పడుతుంది. అందుకే దీన్ని నవపంచమ యోగం అంటారు. బుధ-శని నవపంచమ యోగం ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బుధ గ్రహం బుద్ధి, వ్యాపారం, లెక్కలకు కారకం. శని గ్రహం కర్మ, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, స్థిరత్వానికి ప్రతీక. ఈ రెండు గ్రహాలు నవపంచమ యోగంలో ఉన్నప్పుడు కొన్ని రాశులవారికి ఉద్యోగం, చదువు, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అద్భుతమైన విజయాన్ని ఇస్తాయి. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం.
నవపంచమ యోగం ప్రభావం ఏరాశులపై ఉంటుంది?
మేషరాశి..
మేషరాశి వారిని ఈ యోగం ఉద్యోగంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా బదిలీ గురించి శుభవార్త రావచ్చు. వ్యాపారులకు పాత పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణం చేయవచ్చు. లేదా పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ యోగం ఉద్యోగంలో అభివృద్ధిని సూచిస్తుంది. చాలా కాలంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చూస్తున్నవారికి కొత్త దారి దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధించవచ్చు. ఏదైనా కోర్టు కేసు ఉంటే.. దానిలో కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. పెట్టుబడులకు మంచి సమయం.
కన్య రాశి
ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి.. ఈ యోగం వీరికి చాలా మంచిది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు మొదలుపెట్టడానికి మంచి సమయం. ఆర్థికంగా కూడా ఈ సమయం బాగుంటుంది.
తుల రాశి
తుల రాశివారికి ఈ యోగం కుటుంబం, ఉద్యోగంలో సంతోషాన్నిస్తుంది. ఉద్యోగుల పనికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు పెద్ద ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడులు లేదా షేర్ మార్కెట్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశివారికి నవపంచమ యోగం స్థిరత్వం, విజయాన్నిస్తుంది. శని ఈ రాశికి అధిపతి. బుధుడితో దాని నవపంచమ సంబంధం వీరికి నిర్వహణ, ప్రణాళిక, విశ్లేషణలో ప్రయోజనాలనిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారులకు పాత భాగస్వామితో మళ్లీ సంబంధం ఏర్పడితే లాభదాయకం కావచ్చు.